iDreamPost
android-app
ios-app

Rohit Sharma: మూడో వన్డేకు ముందు భారత్​కు బిగ్ షాక్! రోహిత్ శర్మ దూరం?

  • Published Aug 06, 2024 | 8:44 PM Updated Updated Aug 06, 2024 | 8:44 PM

లంకతో జరిగే మూడో వన్డే కోసం టీమిండియా సిద్ధమవుతోంది. సిరీస్ డిసైడర్​గా మారిన ఈ మ్యాచ్​లో తాడోపేడో తేల్చుకోవాలని చూస్తోంది రోహిత్ సేన.

లంకతో జరిగే మూడో వన్డే కోసం టీమిండియా సిద్ధమవుతోంది. సిరీస్ డిసైడర్​గా మారిన ఈ మ్యాచ్​లో తాడోపేడో తేల్చుకోవాలని చూస్తోంది రోహిత్ సేన.

  • Published Aug 06, 2024 | 8:44 PMUpdated Aug 06, 2024 | 8:44 PM
Rohit Sharma: మూడో వన్డేకు ముందు భారత్​కు బిగ్ షాక్! రోహిత్ శర్మ దూరం?

లంకతో జరిగే మూడో వన్డే కోసం టీమిండియా సిద్ధమవుతోంది. సిరీస్ డిసైడర్​గా మారిన ఈ మ్యాచ్​లో తాడోపేడో తేల్చుకోవాలని చూస్తోంది రోహిత్ సేన. ఈ టూర్​ను బాగానే స్టార్ట్ చేసిన భారత్.. అదే జోరును కొనసాగించడంలో మాత్రం విఫలమైంది. తొలుత జరిగిన మూడు టీ20ల సిరీస్​ను క్లీన్​స్వీప్ చేసిన మెన్ ఇన్ బ్లూ.. వన్డే సిరీస్​ను కూడా అదే విధంగా సొంతం చేసుకోవాలని అనుకుంది. కానీ ఆతిథ్య జట్టు అద్భుతంగా ఆడుతూ రోహిత్ సేనకు షాక్ ఇచ్చింది. ఫస్ట్ మ్యాచ్ టై కాగా.. రెండో వన్డేలో లంక గెలిచింది. దీంతో రేపు జరగబోయే మ్యాచ్ సిరీస్ డిసైడర్​గా మారింది. ఇందులో ఆతిథ్య జట్టు గెలిస్తే సిరీస్ వాళ్ల సొంతం అవుతుంది.

మూడో వన్డేలో భారత్ గెలిస్తే సిరీస్ 1-1తో సమం అవుతుంది. ఎలాగైనా టీమిండియాను ఓడించి తమ సత్తాను చాటాలని లంక భావిస్తోంది. ఆ జట్టును చిత్తు చేసి సిరీస్​ను సమం చేయాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది. ఇరు జట్లు నువ్వా నేనా అంటూ తలపడటం ఖాయం కాబట్టి రేపటి మ్యాచ్ ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగడం పక్కాగా కనిపిస్తోంది. ఇప్పటికే ఇరు జట్లు గెలుపు కోసం వ్యూహాలు పన్నడంలో తలమునకలై ఉన్నాయి. ఈ తరుణంలో భారత అభిమానులకు షాకింగ్ న్యూస్. రేపు జరగబోయే మూడో వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడని వార్తలు వస్తున్నాయి. గాయంతో బాధపడుతున్న అతడు.. ఇవాళ ప్రాక్టీస్​ సెషన్​లో పాల్గొనలేదని తెలుస్తోంది.

రోహిత్ కుడి కాలికి గాయమైందని.. అందుకే అతడు ఇవాళ నెట్ ప్రాక్టీస్​కు దూరంగా ఉన్నాడని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇంజ్యురీ చిన్నదేనని.. అయితే రిస్క్ ఎందుకనే ఉద్దేశంతో ప్రాక్టీస్​కు దూరంగా ఉన్నాడని.. మ్యాచ్​లో ఆడటం పక్కా అని బీసీసీఐ వర్గాల సమాచారం. ఇవాళ నిర్వహించినది ఆప్షనల్ ప్రాక్టీస్.. పక్కా ఇందులో పాల్గొనాలనేమీ లేదని, అందుకే అతడు దూరంగా ఉన్నాడని టాక్ నడుస్తోంది. అయితే లంక మీడియా మాత్రం హిట్​మ్యాన్​కు అయిన గాయం తీవ్రత ఎక్కువగా ఉందని, అందుకే అతడు ప్రాక్టీస్​కు దూరమయ్యాడని అంటోంది. మ్యాచ్​లో కూడా రోహిత్ ఆడటం అనుమానమేనని చెబుతోంది. ఒకవేళ హిట్​మ్యాన్ దూరమైతే భారత్ విజయావకాశాల మీద తీవ్ర ప్రభావం పడుతుది. ఈ సిరీస్​లో అద్భుతంగా ఆడుతున్న​ అతడు దూరమైతే టీమ్​లోని ఇతర ఆటగాళ్ల మీద కూడా ఆ ఎఫెక్ట్ పడుతుంది. రోహిత్ ఆడకపోతే అతడి ప్లేస్​లో రిషబ్ పంత్ లేదా రియాన్ పరాగ్​ను ప్లేయింగ్ ఎలెవన్​లో తీసుకునే అవకాశం ఉంది.