IND vs SL Rohit Sharma Plan For Charith Asalanka: వీడియో: లంక కెప్టెన్​తో ఆడుకున్న రోహిత్.. స్పాట్​లోనే స్కెచ్ వేసి ఔట్ చేశాడు!

Rohit Sharma: వీడియో: లంక కెప్టెన్​తో ఆడుకున్న రోహిత్.. స్పాట్​లోనే స్కెచ్ వేసి ఔట్ చేశాడు!

శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ అదరగొడుతోంది. తొలుత బ్యాటింగ్​కు దిగిన ఆతిథ్య జట్టును తక్కువ స్కోరుకు కట్టడి చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ తన స్ట్రాటజీలతో ఆ టీమ్ పని పట్టాడు.

శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ అదరగొడుతోంది. తొలుత బ్యాటింగ్​కు దిగిన ఆతిథ్య జట్టును తక్కువ స్కోరుకు కట్టడి చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ తన స్ట్రాటజీలతో ఆ టీమ్ పని పట్టాడు.

సాధారణంగా క్రికెట్​లో ఏ బ్యాటర్​ను ఎలా ఔట్ చేయాలనేది ముందే ప్లానింగ్ చేసుకొని వస్తుంటాయి బౌలింగ్ టీమ్స్. వాళ్ల వీక్​నెస్, స్ట్రెంగ్త్ ఏంటనేది ముందే తెలుసుకొని ఎక్కడెక్కడ ఔలింగ్ చేయాలి? ఫీల్డ్ పొజిషన్స్​ ఎలా పెట్టాలనేది? డిసైడ్ అయి వస్తుంటాయి. అయితే కొందరు కెప్టెన్లు మాత్రం స్పాట్​లోనే ఇంప్రువైజ్‌ చేస్తుంటారు. దీనికి టీమిండియా సారథి రోహిత్ శర్మ బెస్ట్ ఎగ్జాంపుల్ అనే చెప్పాలి. మ్యాచ్ కండీషన్స్, బ్యాటర్ ఆడుతున్న తీరును బట్టి సరికొత్త వ్యూహాలతో చిత్తు చేస్తుంటాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలోనూ ఇలాగే స్పాట్​లోనే స్కెచ్ వేసి ప్రత్యర్థి కెప్టెన్​ బిత్తరపోయేలా చేశాడు హిట్​మ్యాన్.

18.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 60 పరుగులతో ఉంది శ్రీలంక. అప్పుడు క్రీజులోకి అడుగుపెట్టాడు లంక కెప్టెన్ చరిత్ అసలంక. అయితే అప్పటికే ఆ జట్టు బ్యాటర్లు ఔట్ అయిన తీరును గమనించిన రోహిత్.. అసలంక కోసం స్పెషల్ ప్లాన్ వేశాడు. లంక బ్యాటర్లు ఆఫ్ సైడ్​ షాట్లు సరిగ్గా కొట్టలేకపోవడం, స్వీప్ షాట్లు ఆడటం లేదా అడ్డదిడ్డంగా బంతిని ఊపడం అబ్జర్వ్ చేసి అసలంక కోసం లెగ్ సైడ్ ఎక్కువ మంది ఫీల్డర్లను మోహరించాడు. అదే టైమ్​లో ఆఫ్ సైడ్ కూడా క్యాచింగ్ పొజిషన్స్​లో కొందర్ని ఉంచి, తాను వెళ్లి స్లిప్​లో నిల్చున్నాడు.

లెగ్ సైడే కొడతాడు, గుర్తుంచుకో అంటూ కుల్దీప్​కు చెప్పాడు రోహిత్. ఆఫ్ సైడ్ బంతులు వేసి బ్యాటర్​ను రెచ్చగొట్టమంటూ సూచించాడు. దీంతో అతడు అటు వైపే బంతులు వేయగా.. షాట్లు ఆడినా కనెక్ట్ అవకపోవడంతో అసలంక ఫ్రస్టేషన్​కు లోనయ్యాడు. కుల్దీప్ వేసిన నెక్స్ట్ ఓవర్​లో థర్డ్ మ్యాన్ దిశగా గట్టిగా షాట్​ కొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే షాట్ మిస్ ఫైర్ అవడంతో బాల్ కాస్తా వెళ్లి స్లిప్​లో ఉన్న రోహిత్ చేతుల్లో పడింది. హిట్​మ్యాన్​ స్కెచ్​ను అర్థం చేసుకునే లోపు ఔట్ అయ్యాడు లంక సారథి. ఈ మ్యాచ్​లో ఆతిథ్య జట్టు అన్ని ఓవర్లు ఆడి 8 వికెట్లకు 230 పరుగులు చేసింది. మరి.. సిరీస్ ఓపెనర్​లో రోహిత్ కెప్టెన్సీ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Show comments