Nidhan
India vs Sri Lanka: శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ డామినేట్ చేస్తోంది. లంక బ్యాటర్లను మన బౌలర్లు ఓ ఆటాడుకున్నారు.
India vs Sri Lanka: శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ డామినేట్ చేస్తోంది. లంక బ్యాటర్లను మన బౌలర్లు ఓ ఆటాడుకున్నారు.
Nidhan
శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ డామినేట్ చేస్తోంది. లంక బ్యాటర్లను మన బౌలర్లు ఓ ఆటాడుకున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయింది. అయితే పిచ్ నుంచి పేస్, బౌన్స్‌కు సపోర్ట్ దొరకడంతో ఆరంభంలో మన పేసర్లు లంకను బాగా ఇబ్బంది పెట్టారు. ఓపెనర్ అవిష్క ఫెర్నాండో (1)ను మహ్మద్ సిరాజ్ వెనక్కి పంపాడు. మరో ఓపెనర్ పతుమ్ నిస్సంక (56) ఒకవైపు నిలదొక్కుకొని పరుగులు చేసినా.. ఇంకోవైపు వచ్చిన వాళ్లు వచ్చినట్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ ప్రత్యర్థి బ్యాటర్లను వణికించారు. అయితే ఒక నిర్ణయం విషయంలో సుందర్‌పై కెప్టెన్ హిట్‌మ్యాన్ సీరియస్ అయ్యాడు. లంక బ్యాటర్ దునిత్ వెల్లలాగే (67) విషయంలో డీఆర్ఎస్కు వెళ్లాలా? వద్దా? అని డిస్కషన్ నడిచింది.
సుందర్ వేసిన ఓవర్లో ఫుల్ లెంగ్త్‌లో పడిన బంతిని డిఫెన్స్ చేశాడు దునిత్. అయితే బాల్ అతడి ఎడమ కాలి షూకు తగిలినట్లు అనిపించడంతో భారత ఆటగాళ్లు ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేశారు. అంపైర్ నాటౌట్ అనడంతో అప్పీల్‌కు వెళ్దామని సుందర్ అనుకున్నాడు. స్లిప్‌లో ఉన్న రోహిత్.. కీపర్ రాహుల్‌ను కన్ఫర్మేషన్ అడిగాడు. కానీ కేఎల్ తానేమీ చెప్పలేనన్నాడు. సుందర్ మాత్రం నువ్వు చెప్పు అంటూ హిట్‌మ్యాన్‌ను అడిగాడు. దీంతో హిట్‌మ్యాన్ గరం అయ్యాడు. స్లిప్‌లో ఉన్నాడు కాబట్టి అతడికి ఏం జరిగిందో ఎగ్జాక్ట్‌గా కనిపించే ఛాన్స్ లేదు. ఆల్రెడీ కీపర్ ఏం చెప్పలేనని అన్నాడు.. అలాంటప్పుడు బౌలింగ్ చేసిన సుందరే ఔట్‌కు వెళ్లాలో లేదో డిసైడ్ చేయాలి. కానీ సుందర్.. నువ్వే చెప్పు అంటూ రోహిత్‌ను అడిగాడు. దీంతో నేను కాదు.. నువ్వు చెప్పు ఏం చేద్దామంటూ ఆగ్రహానికి లోనయ్యాడు. అయితే వెంటనే కోలుకొని.. నా వైపు ఎందుకు చూస్తున్నావంటూ నవ్వుల్లో మునిగిపోయాడు.
Rohit Sharma 🤝 Stump mic. 😂👌 pic.twitter.com/bguQDn1MI2
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 2, 2024