Rohit Sharma Joins Chris Gayle In Most Sixes: మ్యాచ్ పోయినా రోహిత్ రేర్ ఫీట్.. దీన్ని టచ్ చేయడం అసాధ్యమే!

Rohit Sharma: మ్యాచ్ పోయినా రోహిత్ రేర్ ఫీట్.. దీన్ని టచ్ చేయడం అసాధ్యమే!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. లంకతో జరిగిన ఆఖరి వన్డేలో అతడు రేర్ ఫీట్ నమోదు చేశాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. లంకతో జరిగిన ఆఖరి వన్డేలో అతడు రేర్ ఫీట్ నమోదు చేశాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. లంకతో జరిగిన ఆఖరి వన్డేలో అతడు రేర్ ఫీట్ నమోదు చేశాడు. ఈ మ్యాచ్​లో 20 బంతులు ఎదుర్కొన్న హిట్​మ్యాన్ 6 బౌండరీలు, 1 భారీ సిక్స్ సాయంతో 35 పరుగులు చేశాడు. 175 స్ట్రైక్​ రేట్​తో బ్యాటింగ్ చేసిన భారత సారథి.. క్రీజులో ఉన్నంత సేపు లంక బౌలర్లను ఆడుకున్నాడు. వరుస ఫోర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో అతడో రేర్ ఫీట్​ను నమోదు చేశాడు. వన్డే క్రికెట్ హిస్టరీలో సిక్సుల విషయంలో రెండో స్థానంలో నిలిచాడు.

లంకతో మ్యాచ్​లో కొట్టిన సిక్స్​ వన్డేల్లో రోహిత్కు 331వ సిక్స్ కావడం విశేషం. దీంతో అత్యధిక సిక్సుల విషయంలో విండీస్ లెజెండ్ క్రిస్ గేల్ (331 సిక్సులు) సరసన అతడు నిలిచాడు. గేల్​ను సమం చేసిన రోహిత్ సిక్సుల విషయంలో సెకండ్ పొజిషన్​కు చేరుకున్నాడు. ఈ లిస్ట్​లో పాకిస్థాన్ గ్రేట్ షాహిద్ అఫ్రిదీ (351 సిక్సులు) అగ్రస్థానంలో ఉన్నాడు. ఇంకో 20 సిక్సులు బాదితే అఫ్రిదీని కూడా హిట్​మ్యాన్ దాటేస్తాడు. వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ టైమ్​లో ఈ ఫీట్​ను రోహిత్ అధిగమించే ఛాన్స్ ఉంది. ఈతరం క్రికెటర్లలో ఎవరూ హిట్​మ్యాన్​కు చేరువలో లేరు. ఇక, ఇవాళ లంకతో జరిగిన మ్యాచ్​లో 110 పరుగుల తేడాతో దారుణంగా ఓడిన భారత్.. సిరీస్​ను కూడా కోల్పోయింది. అయితే రోహిత్ సిక్సర్ల రికార్డు అభిమానులకు కాస్త ఊరటను ఇచ్చింది. మరి.. సిక్సర్ల విషయంలో అఫ్రిదీని రోహిత్ అధిగమిస్తాడని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

Show comments