సర్​ప్రైజ్ వెపన్​తో లంకకు షాక్.. సిరాజ్ కోసం సిద్ధమైతే కొత్త మొగుడు అడ్డుపడ్డాడు!

India vs Sri Lanka: టీమిండియాతో జరిగిన ఫస్ట్ టీ20లో శ్రీలంక ఓడిపోయింది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్​లో 43 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

India vs Sri Lanka: టీమిండియాతో జరిగిన ఫస్ట్ టీ20లో శ్రీలంక ఓడిపోయింది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్​లో 43 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

టీమిండియాతో జరిగిన ఫస్ట్ టీ20లో శ్రీలంక ఓడిపోయింది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్​లో 43 పరుగుల తేడాతో ఓటమిపాలై సిరీస్​లో 0-1తో వెనుకబడింది. ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్​కు దిగిన భారత్ ఓవర్లన్నీ ఆడి 7 వికెట్లకు 213 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (21 బంతుల్లో 40), శుబ్​మన్ గిల్ (16 బంతుల్లో 34) టీమ్​కు మంచి స్టార్ట్ అందించారు. సారథి సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 58), రిషబ్ పంత్ (33 బంతుల్లో 49) కీలక ఇన్నింగ్స్​లతో జట్టుకు భారీ స్కోరు అందించారు. ఆ తర్వాత ఛేజింగ్​ స్టార్ట్ చేసిన శ్రీలంక అన్ని ఓవర్లు ఆడలేకపోయింది. భారత బౌలర్ల దెబ్బకు 19.2 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌట్ అయింది.

నిన్నటి మ్యాచ్​లో ఒక దశలో శ్రీలంక చాలా పటిష్టంగా కనిపించింది. 14 ఓవర్లకు 1 వికెట్ నష్టానికి 140 పరుగులతో ఉంది. గెలవాలంటే 36 బంతుల్లో 73 పరుగులు చేయాలి. ఇంకో 9 వికెట్లు చేతిలో ఉన్నాయి. కాబట్టి ఆ టీమ్​ గెలుపు పక్కా అని అంతా అనుకున్నారు. ఒకవేళ ఓడినా తక్కువ మార్జిన్​తో ఓడుతుందని భావించారు. కానీ 30 పరుగుల తేడాలో కుప్పకూలింది ఆతిథ్య జట్టు. నిస్సంక నుంచి మొదలైన వికెట్ల పతనం మధుశంక ఔట్ వరకు సాగింది. స్పిన్నర్లు అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, పేసర్లు అర్ష్​దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ కీలక సమయాల్లో వికెట్లు తీసి మ్యాచ్​ను భారత్ వైపు తిప్పారు. అయితే రియాన్ పరాగ్ రూపంలో కోచ్ గంభీర్ వదిలిన సర్​ప్రైజ్ వెపన్ మాత్రం లంకను దారుణంగా దెబ్బతీసింది.

స్పిన్ బౌలింగ్ చేసే పరాగ్ వికెట్లు తీయగలడని తెలుసు. కానీ నిన్న లంక బ్యాటర్లను ఔట్ చేయడమే కాదు.. ముప్పుతిప్పలు పెట్టాడు. తమ మీద చెలరేగిపోయే సిరాజ్ కోసం ఆతిథ్య జట్టు ప్రిపేర్ అయితే.. హఠాత్తుగా వచ్చి పరాగ్ కుప్పకూల్చాడు. 8 బంతులు బౌలింగ్ చేసిన అతడు.. 5 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టి మ్యాచ్​ను లాగేసుకున్నాడు. కమిందు మెండిస్, మహీష​ తీక్షణ, దిల్షాన్ మధుశంకను పెవిలియన్​కు పంపాడు. ఈ ముగ్గురు బ్యాటర్లను అతడు క్లీన్​బౌల్డ్ చేయడం విశేషం. అతడి బౌలింగ్ చూసిన నెటిజన్స్.. లంకకు కొత్త మొగుడు తయారయ్యాడని అంటున్నారు. పరాగ్​ను తీర్చిదిద్దితే మంచి స్పిన్ ఆల్​రౌండర్​గా తయారవుతాడని చెబుతున్నారు. అయితే సూపర్బ్​గా బౌలింగ్ చేసిన అతడు బ్యాటింగ్​లో ఆకట్టుకోలేదు. 7 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అందుకే బ్యాటింగ్ మీద కూడా ఫోకస్ పెట్టాలని ఎక్స్​పర్ట్స్ సూచిస్తున్నారు. మరి.. పరాగ్ స్పెల్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Show comments