iDreamPost
android-app
ios-app

Mohammed Siraj: వీడియో: సిరాజ్​ను రెచ్చగొట్టిన లంక బ్యాటర్.. అదే ఓవర్​లో తిక్క కుదిర్చాడు!

  • Published Aug 07, 2024 | 6:04 PM Updated Updated Aug 07, 2024 | 6:04 PM

India vs Sri Lanka: భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న మూడో వన్డేలో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. టీమిండియా స్పీడ్​స్టర్ మహ్మద్ సిరాజ్​ను ఓ లంక బ్యాటర్ రెచ్చగొట్టాడు.

India vs Sri Lanka: భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న మూడో వన్డేలో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. టీమిండియా స్పీడ్​స్టర్ మహ్మద్ సిరాజ్​ను ఓ లంక బ్యాటర్ రెచ్చగొట్టాడు.

  • Published Aug 07, 2024 | 6:04 PMUpdated Aug 07, 2024 | 6:04 PM
Mohammed Siraj: వీడియో: సిరాజ్​ను రెచ్చగొట్టిన లంక బ్యాటర్.. అదే ఓవర్​లో తిక్క కుదిర్చాడు!

భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న మూడో వన్డేలో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. టీమిండియా స్పీడ్​స్టర్ మహ్మద్ సిరాజ్​ను ఓ లంక బ్యాటర్ రెచ్చగొట్టాడు. అయితే సిరాజ్ కూడా అతడికి ఇచ్చిపడేశాడు. అదే ఓవర్​లో అతడి తిక్క కుదిర్చాడు. ఇది లంక ఇన్నింగ్స్​ 39వ ఓవర్​లో జరిగింది. ఆ ఓవర్ వేసేందుకు వచ్చాడు సిరాజ్. అప్పటికి 6 ఓవర్లలో 50కి పైగా పరుగులు ఇచ్చుకున్నాడు భారత స్పీడ్​స్టర్. అతడి బౌలింగ్​లో ఓపెనర్లు భారీగా పరుగులు పిండుకున్నారు. లంక మీద ఎప్పుడూ చెలరేగి బౌలింగ్ చేసే సిరాజ్ ఇవాళ ఫెయిల్ అయ్యాడు. ఈ ఫ్రస్ట్రేషన్​లోనే 39వ ఓవర్​లో బౌలింగ్​కు దిగాడతను. క్రీజులో కుశాల్ మెండిస్, సదీర సమరవిక్రమ ఉన్నారు. ఆ ఓవర్ రెండో బంతి వేశాక బ్యాటర్ వైపు చూశాడు సిరాజ్.

బ్యాటర్ కుశామ్ మెండిస్ వైపు సిరాజ్ సీరియస్​గా చూసి ఆగిపోయాడు. కానీ మెండిస్ మాత్రం ఎందుకలా చూస్తున్నావంటూ భారత పేసర్​ను రెచ్చగొట్టాడు. దీంతో ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. గొడవ ఎందుకని సిరాజ్ బౌలింగ్ ఎండ్ వైపు వెళ్తుండగా అతడ్ని వెంబడించిన మెండిస్ ఏదో అన్నాడు. దీంతో కోపం పట్టలేకపోయిన సిరాజ్ మరింత కసితో బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్ ఐదో బంతికి సమరవిక్రమను ఎల్బీడబ్ల్యూగా దొరకబుచ్చుకున్నాడు. మెండిస్ చేసిన పనికి సమరవిక్రమ బలయ్యాడు. సిరాజ్​ను రెచ్చగొట్టినందుకు అదే ఓవర్​లో లంక ఓ వికెట్ పోగొట్టుకుంది. ప్రస్తుతం ఆ టీమ్ 47.3 ఓవర్లలో 6 వికెట్లకు 224 పరుగులతో ఉంది.