Nidhan
టీమిండియా స్పీడ్ గన్ మహ్మద్ సిరాజ్ ఈ మధ్య కాస్త డల్ అయ్యాడు. శ్రీలంక అనగానే చెలరేగే మియా ఆ టీమ్ మీద కూడా తుస్సుమన్నాడు. దీంతో అతడికి ఏమైందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
టీమిండియా స్పీడ్ గన్ మహ్మద్ సిరాజ్ ఈ మధ్య కాస్త డల్ అయ్యాడు. శ్రీలంక అనగానే చెలరేగే మియా ఆ టీమ్ మీద కూడా తుస్సుమన్నాడు. దీంతో అతడికి ఏమైందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Nidhan
అన్ని ఫార్మాట్లలోనూ ఎదురులేకుండా ఆధిపత్యం చలాయిస్తున్న భారత జట్టు.. ఇటీవలే టీ20 వరల్డ్ కప్ గెలుచుకొని డామినేషన్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లింది. వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ-2025, వరల్డ్ టెస్ట్ సిరీస్ లాంటి ఐసీసీ టోర్నీలు సొంతం చేసుకొని క్రికెట్‌పై ఏకఛత్రాధిపత్యాన్ని చూపించాలని అనుకుంటోంది. ఇలా భారీ అంచనాలతో సాగుతున్న జట్టు అనూహ్యంగా శ్రీలంక చేతిలో సిరీస్‌ను పోగొట్టుకుంది. ఆ జట్టుతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోయింది. ఇది అంత ఇంపార్టెంట్ సిరీస్ కాదు.. పెద్దగా పోయేదేం లేదని అనొచ్చు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ ముందు భారత్ పెద్దగా వన్డేలు ఆడట్లేదు. ఈ ఏడాది ఇదే ఆఖరి వన్డే సిరీస్. అందులో ఓడటం బిగ్ మైనస్ అనే చెప్పాలి. అయితే ఓటమి కంటే కూడా కొందరు ఆటగాళ్ల ప్రదర్శన తీవ్రంగా నిరుత్సాహపర్చింది. అందులో మహ్మద్ సిరాజ్ ఒకడు.
టీమిండియా స్పీడ్ గన్ మహ్మద్ సిరాజ్ ఈ మధ్య కాస్త డల్ అయ్యాడు. శ్రీలంక అనగానే చెలరేగే మియా ఆ టీమ్ మీద కూడా తుస్సుమన్నాడు. లంక సిరీస్‌లో మూడు వన్డేల్లో కలిపి అతడు తీసింది 3 వికెట్లే కావడం గమనార్హం. ఆఖరి వన్డేలో 9 ఓవర్లలో ఏకంగా 78 పరుగులు సమర్పించుకున్నాడు. భారీగా పరుగులు ఇచ్చుకోవడం, వికెట్లు తీయకపోవడంతో అతడు ఫ్రస్ట్రేషన్లో కనిపించాడు. దీంతో అతడికి ఏమైందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సిరీస్ డిసైడర్‌లో అర్ష్‌దీప్‌ను తీసేసి ఏకైక పేసర్‌గా సిరాజ్‌ను టీమ్‌లోకి తీసుకున్నాడు కెప్టెన్ రోహిత్. అతడికి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి బాగా బౌలింగ్ చేయమని ఎంకరేజ్ చేశాడు. అయినా మియా అంచనాలను అందుకోలేదు. అతడి ఫెయిల్యూర్‌కు పలు కారణాలు కనిపిస్తున్నాయి.
లంక సిరీస్ కాదు.. అంతకుముందు నుంచే సిరాజ్ టచ్ కోల్పోయాడు. ఐపీఎల్లో ఫెయిలయ్యాడు. ఇది ఆర్సీబీ విజయావకాశాలపై తీవ్రంగా ప్రభావం చూపింది. ఆ తర్వాత జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో మోస్తరుగా రాణించాడు. లంకపై చెలరేగే సిరాజ్.. ఈసారి అక్కడ కూడా తుస్సుమన్నాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అండగా ఉంటే రెచ్చిపోయి బౌలింగ్ చేస్తుంటాడు సిరాజ్. అతడు లేకపోవడం వల్లే తన బెస్ట్ ఇవ్వలేకపోయాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. బుమ్రా ఒకవైపు నుంచి బ్యాటర్ల మీద ఒత్తిడి పెంచితే, సిరాజ్ ఆ ప్రెజర్‌ను మరింత పెంచి బ్రేక్‌త్రూలు అందిస్తూ వచ్చాడని.. తన సరిజోడీ లేకపోయే సరికి కొంత డల్ అయ్యాడని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. కారణాలు ఏవైనా సిరాజ్ మళ్లీ ఫామ్‌ను అందుకోవడం టీమ్‌తో పాటు వ్యక్తిగతంగా అతడికి కూడా ఎంతో ముఖ్యం. తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో జట్టులో పర్మినెంట్ ప్లేయర్‌గా, ఆల్ ఫార్మాట్ పేసర్‌గా ఉండాలంటే తన రిథమ్‌ను అందుకోవాలి. మరి.. సిరాజ్ స్ట్రాంగ్‌గా కమ్‌బ్యాక్ ఇస్తాడని మీరు భావిస్తే కామెంట్ చేయండి.