Nidhan
హెడ్ కోచ్‌గా తొలి సిరీస్‌లోనే గౌతం గంభీర్ మిక్స్డ్ రిజల్ట్స్ చూస్తున్నాడు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా.. వన్డే సిరీస్‌లో మాత్రం వెనుకంజలో ఉంది.
హెడ్ కోచ్‌గా తొలి సిరీస్‌లోనే గౌతం గంభీర్ మిక్స్డ్ రిజల్ట్స్ చూస్తున్నాడు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా.. వన్డే సిరీస్‌లో మాత్రం వెనుకంజలో ఉంది.
Nidhan
హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తొలి సిరీస్‌లోనే లెజెండ్ గౌతం గంభీర్ మిక్స్డ్ రిజల్ట్స్ చూస్తున్నాడు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా.. వన్డే సిరీస్‌లో మాత్రం వెనుకంజలో ఉంది. కొలంబో వేదికగా జరిగిన ఫస్ట్ వన్డే టై కాగా.. అదే స్టేడియంలో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో రోహిత్ సేన ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు 9 వికెట్ల నస్టానికి 240 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్ స్టార్ట్ చేసిన మెన్ ఇన్ బ్లూ.. 42.2 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌట్ అయింది. విజయానికి 32 పరుగుల దూరంలో ఆగిపోయింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో శ్రీలంక 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో వన్డేలో భారత్ ఓటమికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి.
టీమిండియా ఓటమికి అనేక కారణాలు కనిపిస్తున్నా అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది బ్యాటింగ్ ఫెయిల్యూర్ గురించే. విరాట్ కోహ్లీ, శివమ్ దూబె, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లాంటి స్టార్ బ్యాటర్లు విఫలమవడం జట్టుకు ఎదురుదెబ్బగా మారింది. మిగతా బ్యాటర్ల సంగతేమో గానీ రాహుల్ విషయంలో మాత్రం అతడి కంటే కోచ్ గంభీర్ తప్పే పెద్దదిగా కనిపిస్తోంది. కేఎల్ విషయంలో గౌతీ చేస్తున్న ప్రయోగాలే అతడి కొంపముంచుతున్నాయని.. దీనికి ఆ బ్యాటర్ తప్పేమీ లేదనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. గంభీర్ ఎక్స్‌పెరిమెంట్స్‌కు రాహుల్ బలవుతున్నాడని.. ఇది ఇలాగే కొనసాగితే అతడు మరో ఇర్ఫాన్ పఠాన్‌లా మిగిలిపోయే ప్రమాదం ఉందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు.
తొలి వన్డేలో రాహుల్‌ను 6వ స్థానంలో బ్యాటింగ్‌కు దింపిన గంభీర్.. రెండో వన్డేలో సెవన్త్ డౌన్లో ఆడించాడు. నిన్నటి మ్యాచ్‌లో ఒక దశలో 97 పరుగులకు వికెట్ కోల్పోకుండా ఛేదనలో దూసుకుపోతున్న భారత్.. ఆ తర్వాత తక్కువ వ్యవధిలో టపటపా వికెట్లు కోల్పోయింది. 30 పరుగుల తేడాతో నాలుగు వికెట్లు పడ్డాయి. రాహుల్ లాంటి సాలిడ్ డిఫెన్స్ టెక్నిక్, స్ట్రైక్ రొటేషన్ తెలిసిన ప్లేయర్‌ను ముందు పంపకుండా ఫినిషర్ రోల్‌కు వాడాలనుకోవడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వికెట్లు పడుతున్నప్పుడు అతడ్ని ముందే పంపి ఉంటే ఒక ఎండ్‌ను కాపాడుకుంటూ స్ట్రైక్ రొటేషన్ చేసేవాడని అంటున్నారు. రాహుల్‌ను కాకుండా ఫినిషర్ దూబెను, స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను బ్యాటింగ్ ఆర్డర్లో పైకి పంపించడం ఏ విధంగా కరెక్ట్ అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పటికైనా రాహుల్‌ను తన రెగ్యులర్ పొజిషన్లో ఆడించాలని.. ఇలా ప్రయోగాలు చేస్తే అతడు ఎటూ కాకుండా మిగిలిపోయే ప్రమాదం ఉందని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.