iDreamPost
android-app
ios-app

శ్రీలంకతో ఆసియా కప్‌ ఫైనల్‌! ఇండియా ప్లేయింగ్‌ 11 ఇదే!

  • Author Soma Sekhar Updated - 02:47 PM, Sat - 16 September 23
  • Author Soma Sekhar Updated - 02:47 PM, Sat - 16 September 23
శ్రీలంకతో ఆసియా కప్‌ ఫైనల్‌! ఇండియా ప్లేయింగ్‌ 11 ఇదే!

ఆసియా కప్ 2023 తుది సమరానికి సమయం ఆసన్నమైంది. ఇక ఫైనల్ పోరులో టీమిండియాతో అమీతుమీకి సిద్ధమైంది శ్రీలంక. అయితే ఫైనల్ కు ముందు పాక్ పై ఉత్కంఠ విజయం సాధించి.. మంచి ఊపుమీదుంది లంక. కానీ టీమిండియా పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఫైనల్ కు ముందు బంగ్లాదేశ్ తో జరిగిన నామమాత్రపు మ్యాచ్ లో 6 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. దీంతో ప్రేక్షకుల్లో ఒక్కింత నిరాశతో పాటుగా ఆందోళన సైతం మెుదలైంది. ఈ నేపథ్యంలోనే ఫైనల్ కు టీమిండియా కొన్ని మార్పులతో బరిలోకి దిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకు కారణం ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ లంకకు వెళ్లడమే. ఫైనల్ కు ముందు అతడిని అక్కడి రప్పించారు అంటే.. అతడిని మ్యాచ్ లోకి తీసుకునేందుకే అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీలంకతో జరిగే ఫైనల్ లో ఆడే తుది జట్టు ఎవరెవరికి చోటు దక్కుతుందో ఇప్పుడు చూద్దాం.

టీమిండియా-శ్రీలంక మధ్య సెప్టెంబర్ 17(ఆదివారం)న ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఈ తుది సమరం జరగనుంది. ఇదిలా ఉండగా.. ఫైనల్ కు ముందు టీమిండియా కొంత డీలా పడింది. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ లో బంగ్లా బ్యాటర్లు, బౌలర్లు అద్భుతంగా రాణించారు. పటిష్ట బ్యాటింగ్ లైనప్, బౌలింగ్ ఉన్న టీమిండియాను సమర్థవంతగా ఎదుర్కొని సమష్టి విజయం సాధించింది బంగ్లా టీమ్. ఇక ఈ మ్యాచ్ లో చేసిన తప్పిదాలను సవరించుకుని ఫైనల్ పోరుకు సిద్దం అవుతోంది టీమిండియా.

అందులో భాగంగానే జట్టులో స్వల్ప మార్పులతో ఫైనల్ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. యువ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ను లంకకు రప్పించింది టీమిండియా. దీంతో తుది జట్టులో అతడికి చోటు ఖాయం అంటూ క్రీడా విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కొలంబో పిచ్ స్పిన్ కు అనుకూలిస్తున్న నేపథ్యంలో జడేజా, కుల్దీప్ లతో పాటుగా బ్యాటింగ్ ఆల్ రౌండర్ అయిన సుందర్ ను తుది జట్టులోకి తీసుకుంటారని తెలుస్తోంది. కాగా.. ఈ ఒక్క మార్పే తప్ప జట్టులో పెద్దగా మార్పులేవీ కనిపించడంలేదు.

ఇక శ్రీలంక విషయానికి వస్తే.. స్టార్ స్పిన్నర్ మహేష్ తీక్షణ గాయ పడటంతో లంకకు భారీ షాక్ తగలనుంది. అతడు ఫైనల్ కు అందుబాటులో ఉండటం అనుమానమే అని లంక బోర్డ్ ప్రకటించింది. లంక జట్టు సైతం సమతూకంగానే ఉంది. ఆసియా కప్ లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ ల్లో అద్భుతంగా రాణించింది శ్రీలంక టీమ్. ఎప్పటి లాగే రోహిత్ తో కలిసి ఓపెనింగ్ కు రానున్నాడు యువ ఓపెనర్ గిల్. ఆ తర్వాత విరాట్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ లు బ్యాటింగ్ కు దిగనున్నారు. ఏదైనా ప్రయోగం చేస్తే గానీ ఈ బ్యాటింగ్ ఆర్డర్ మారదు.

భారత జట్టు (అంచనా)

రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్యా, జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, బుమ్రా, సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌.