Gautam Gambhir: లంక చేతుల్లో ఘోర పరాభవానికి గంభీరే కారణమా? BCCI తప్పు లేదా?

India vs Sri Lanka: బడా జట్లను కూడా అవలీలగా ఓడించే భారత్.. శ్రీలంకను చిత్తు చేస్తుందని అంతా అనుకున్నారు. మనోళ్ల చేతితో ఆ టీమ్ వైట్​వాష్ తప్పించుకుంటే అదే గొప్పని భావించారు. కానీ కథ అడ్డం తిరిగింది.

India vs Sri Lanka: బడా జట్లను కూడా అవలీలగా ఓడించే భారత్.. శ్రీలంకను చిత్తు చేస్తుందని అంతా అనుకున్నారు. మనోళ్ల చేతితో ఆ టీమ్ వైట్​వాష్ తప్పించుకుంటే అదే గొప్పని భావించారు. కానీ కథ అడ్డం తిరిగింది.

బడా జట్లను కూడా అవలీలగా ఓడించే భారత్.. శ్రీలంకను చిత్తు చేస్తుందని అంతా అనుకున్నారు. మనోళ్ల చేతితో ఆ టీమ్ వైట్​వాష్ తప్పించుకుంటే అదే గొప్పని భావించారు. కానీ కథ అడ్డం తిరిగింది. లంక చేతిలో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన టీమిండియా.. వన్డే సిరీస్​ను 0-2తో కోల్పోయింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ లాంటి తోపు ప్లేయర్లు ఉన్న టీమ్​.. ఇంటర్నేషనల్ మ్యాచుల్లో అంతగా అనుభవం లేని కుర్రాళ్లతో నిండిన లంక చేతుల్లో ఇంత ఘోర పరాభవం మూటగట్టుకుంటుందని ఎవరూ ఊహించలేదు. ఆతిథ్య జట్టు నుంచి గట్టి పోటీ ఉంటుందని అనుకుంటే.. ఆ టీమ్ మన దిగ్గజాలకు ఎక్కడా ఛాన్స్ ఇవ్వకుండా సిరీస్​ను సొంతం చేసుకుంది.

లంక చేతిలో ఓటమికి ఇప్పుడు అందరూ కారణాలు వెతికే పనిలో పడ్డారు. ఓటమికి కొందరు బ్యాటర్లను తప్పుబడుతుంటే మరికొందరు బౌలర్ల మిస్టేక్ కూడా ఉందని అంటున్నారు. ఇంకొందరు కొత్త కోచ్ గౌతం గంభీర్ వైఫల్యం వల్లే టీమ్​కు ఈ దుస్థితి పట్టిందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే వాస్తవంలో చూసుకుంటే గౌతీ కాదు.. భారత క్రికెట్ బోర్డే అసలు దోషిలా కనిపిస్తోంది. కోచ్​గా గంభీర్​కు ఇదే ఫస్ట్ సిరీస్. అతడికి బాధ్యతలు అప్పజెప్పగానే టీమ్ సెలెక్షన్, కెప్టెన్సీ మార్పు లాంటి అంశాలపై ఫోకస్ పెట్టాడు. సిరీస్​కు దూరంగా ఉంటామని చెప్పిన సీనియర్లు రోహిత్, కోహ్లీని ఆడేందుకు ఒప్పించాడు. లంకకు చేరుకోగానే ఆటగాళ్లందరితో సీరియస్​గా ప్రాక్టీస్ చేయించాడు.

ఆరో బౌలర్ లేకపోవడం టీమ్​ను ఇబ్బంది పెడుతుందని గ్రహించి బ్యాటర్లతో బౌలింగ్ సాధన చేయించి మ్యాచుల్లోనూ ఛాన్సులు ఇచ్చాడు. రన్స్ చేసే కేపబిలిటీ ఉన్న సుందర్ లాంటి బౌలర్లకు బ్యాటింగ్ ఆర్డర్​లో ప్రమోషన్ ఇచ్చి పైకి పంపించాడు. ఇలా తనకు సాధ్యమైనంతగా గౌతీ ఎన్నో చేశాడు. టీమ్ కాంబినేషన్ విషయంలో అతడు చేసిన ప్రయోగాలు సరిగ్గా వర్కౌట్ కాలేదనేది నిజం. కానీ బీసీసీఐ చేసిన కొన్ని తప్పులు, నిర్లక్ష్యం జట్టు కొంపముంచాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీలంకతో సిరీస్​ అంటే ముందు నుంచి అటు టీమ్ గానీ ఇటు బోర్డు గానీ లైట్ తీసుకున్నట్లే కనిపించింది. ప్రాక్టీస్ మటుకు సీరియస్​నెస్​ కనిపించినా గ్రౌండ్​లో గానీ ఆటగాళ్ల యాటిట్యూడ్​లో గానీ అది మిస్సయింది.

లంక పిచ్​లు స్లోగా ఉంటాయి, బాల్ బాగా టర్న్ అవుతుంది. కాబట్టి మన బ్యాటర్లు, బౌలర్లు అక్కడి కండీషన్స్​కు అలవాటు పడేందుకు కొన్ని వార్మప్ మ్యాచ్​లు నిర్వహించాల్సింది. కానీ నేరుగా సిరీస్​కు వచ్చింది జట్టు. ఈ విషయంలో బీసీసీఐనే దోషి అని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. టీ20 సిరీస్​లో భారత్​ను భయపెట్టిన లంక.. స్పిన్​ను ఆడటంలో మన బ్యాటర్ల బలహీనతను పట్టేసింది. వన్డే సిరీస్​లో దాని మీదే దృష్టి పెట్టి టీమ్​ను కూల్చింది. స్పిన్ ఆడటంలో ఉన్న వీక్​నెస్​ను సరిదిద్దుకోకపోతే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్​కు కష్టమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ సిరీస్​ను లైట్ తీసుకోకుండా అవసరమైతే ప్రాక్టీస్ మ్యాచ్​లు, స్పెషల్ సెషన్స్ నిర్వహిస్తూ జట్టును గెలుపుబాటలో నడిపించాలని బోర్డుకు సూచిస్తున్నారు.

Show comments