టీమిండియాతో సిరీస్​కు ముందు శ్రీలంకకు బిగ్ షాక్.. ఇలా అయిందేంటి?

IND vs SL: టీమిండియాతో టీ20 సిరీస్​కు సన్నద్ధమవుతోంది శ్రీలంక. దారుణమైన ఆటతీరుతో వరల్డ్ కప్​లో తీవ్రంగా నిరాశపర్చిన సింహళ జట్టు.. భారత్​ మీద గెలిచి తీరాలని చూస్తోంది.

IND vs SL: టీమిండియాతో టీ20 సిరీస్​కు సన్నద్ధమవుతోంది శ్రీలంక. దారుణమైన ఆటతీరుతో వరల్డ్ కప్​లో తీవ్రంగా నిరాశపర్చిన సింహళ జట్టు.. భారత్​ మీద గెలిచి తీరాలని చూస్తోంది.

శ్రీలంక.. ఒకప్పుడు ఈ టీమ్ పేరు చెబితే అన్ని జట్లు వణికేవి. మోస్ట్ డేంజరస్​ టీమ్​గా చాలా ఏళ్ల పాటు క్రికెట్ వరల్డ్​లో హవా నడిపించింది లంక. కప్పులు గెలిచినా గెలవకపోయినా బౌలింగ్, బ్యాటింగ్​లో డామినేషన్ చూపిస్తూ అవతలి జట్లను భయపెట్టడం ఆ కంట్రీ స్టైల్. ఎందరో గ్రేట్ ప్లేయర్లను ప్రొడ్యూస్ చేసిన లంక ఇప్పుడు పసికూన స్టేజ్​కు పడిపోయింది. ఆ టీమ్​తో మ్యాచ్ అంటే అందరూ లైట్ తీసుకుంటున్నారు. జయవర్దనే, సంగక్కర లాంటి దిగ్గజాల నిష్క్రమణ తర్వాత లంక ఆటతీరు నానాటికీ తీసికట్టుగా మారింది. ఇటీవల టీ20 వరల్డ్ కప్​లోనూ చెత్తాటతో గ్రూప్ స్టేజ్​ నుంచే ఇంటిదారి పట్టింది. అలాంటి జట్టు ఇప్పుడు టీమిండియాతో టీ20 సిరీస్​కు సన్నద్ధమవుతోంది.

చెత్తాట కారణంగా సొంత అభిమానుల నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న లంక.. భారత్​ మీద గెలిచి తీరాలని చూస్తోంది. టీ20 సిరీస్​తో పాటు వన్డే సిరీస్​ను కూడా చేజిక్కించుకోవాలని పట్టుదలతో ఉంది. టెంపరరీ కోచ్ జయసూర్య అండతో మెన్ ఇన్ బ్లూను పడగొట్టాలని చూస్తోంది. ఈ సిరీస్​లో నెగ్గి పునర్వైభవం దిశగా అడుగులు వేయాలని ప్లాన్ చేస్తోంది. అందుకోసం ఆ జట్టు ఆటగాళ్లు నెట్స్​లో తీవ్రంగా చెమటోడ్చుతున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్​ప్రీత్ బుమ్రా లాంటి టాప్ ప్లేయర్స్ లేరు కాబట్టి యంగ్ ఇండియాను ఓడించగలమనే ధీమాతో ఉన్నారు. ఈ తరుణంలో ఆ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. లంక్ స్టార్ పేసర్ దుష్మంత చమీర భారత సిరీస్​ నుంచి వైదొలిగాడని తెలిసింది.

గాయం కారణంగా చమీర ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడని లంక క్రికెట్ వర్గాల సమాచారం. అయితే ఆ టీమ్ నుంచి మాత్రం అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదు. కానీ చమీర ఆడటం సాధ్యం కాదని.. అతడి స్థానంలో ఇంకొకర్ని తీసుకోవడం ఖాయమని వినిపిస్తోంది. చమీర స్థానంలో వెటరన్ ఆల్​రౌండర్ ఏంజెలో మాథ్యూస్​ను రీప్లేస్ ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే లంక క్రికెట్​ బోర్డు నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఏదీ చెప్పలేం. అసలే దారుణంగా ఆడుతూ విమర్శల పాలవుతున్న లంక టీమ్ ఈ సిరీస్​తోనైనా గాడిలో పడాలని చూస్తోంది. కనీసం భారత్​కు ఫైట్ బ్యాక్​ ఇవ్వాలని కసిగా ఉంది. ఈ సమయలో స్టార్ పేసర్ దూరమవడం పెద్ద ఎదురుదెబ్బేనని చెప్పాలి. ఈ లోటును అధిగమించి సింహళ జట్టు ఎలా ఆడుతుందో చూడాలి.

Show comments