Nidhan
టీమిండియా మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. లంకతో జరిగిన మూడో వన్డేలో ఓడి సిరీస్‌ను పోగొట్టుకుంది. ఈ మధ్య కాలంలో మన జట్టు ఇంత చెత్తగా ఆడటం ఇదే ఫస్ట్ టైమ్.
టీమిండియా మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. లంకతో జరిగిన మూడో వన్డేలో ఓడి సిరీస్‌ను పోగొట్టుకుంది. ఈ మధ్య కాలంలో మన జట్టు ఇంత చెత్తగా ఆడటం ఇదే ఫస్ట్ టైమ్.
Nidhan
టీమిండియా మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. లంకతో జరిగిన మూడో వన్డేలో ఓడి సిరీస్‌ను పోగొట్టుకుంది. ఈ మధ్య కాలంలో మన జట్టు ఇంత చెత్తగా ఆడటం ఇదే ఫస్ట్ టైమ్. ఇవాళ్టి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు అన్ని ఓవర్లు ఆడి 7 వికెట్లకు 248 పరుగులు చేసింది. తొమ్మిదో నంబర్ వరకు బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉన్న ఆటగాళ్లు ఉండటంతో ఈ స్కోరును భారత్ ఛేజ్ చేయడం ఈజీనే అని అంతా అనుకున్నారు. కానీ లంక స్పిన్నర్ల దెబ్బకు రోహిత్ సేన 138 పరుగులకు చాపచుట్టేసింది. ఏకంగా 110 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమితో సిరీస్‌ను 0-2ను చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో సిరీస్ డిసైడర్ ఫైట్‌లో మెన్ ఇన్ బ్లూ ఓటమికి గల 3 ప్రధాన కారణాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..
భారత్ ఓటమికి ప్రధాన కారణంగా బ్యాటింగ్ ఫెయిల్యూర్‌ను చెప్పాలి. ఈ సిరీస్ ఆసాంతం మన బ్యాటర్లు దారుణంగా ఆడుతూ వచ్చారు. కెప్టెన్ రోహిత్ శర్మ తప్ప ఎవరూ పెద్దగా రన్స్ చేసింది లేదు. ఇవాళ కూడా అదే జరిగింది. హిట్‌మ్యాన్ 20 బంతుల్లో 35 పరుగులు చేసి టీమ్‌కు మంచి స్టార్ట్ అందించి వెళ్లిపోయాడు. ఆ తర్వాత వచ్చిన వారందరూ విఫలమయ్యారు. శుబ్‌మన్ గిల్ (6), రిషబ్ పంత్ (6), శ్రేయస్ అయ్యర్ (8), అక్షర్ పటేల్ (2), శివమ్ దూబె (9) సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. ఆఖర్లో టెయిలెండర్ వాషింగ్టన్ సుందర్ (30) పోరాడకపోతే భారత్ స్కోరు వంద దాటకపోయేది. ఇక, మన జట్టు ఓటమికి మరో కారణంగా టీమ్ కాంబినేషన్‌ను చెప్పొచ్చు. ఇవాళ్టి మ్యాచ్‌లో కేవలం ఒకే స్పీడ్స్టర్తో ఆడింది టీమిండియా.
సిరాజ్ రూపంలో ఒకే స్పెషలిస్ట్ పేసర్‌తో వెళ్లింది భారత్. కానీ అతడు ఫెయిలయ్యాడు. లంకపై రెచ్చిపోయి బౌలింగ్ చేసే సిరాజ్.. ఇవాళ 9 ఓవర్లలో ఏకంగా 78 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇంకో క్వాలిటీ పేసర్ లేకపోవడం స్టార్టింగ్ ఓవర్స్‌లో భారత్‌ను ఇబ్బంది పెట్టింది. కేఎల్ రాహుల్‌ను తీసేసి పంత్‌ను తీసుకుంటే అతడు 6 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. రాహుల్ ఉంటే వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేసి.. స్కోరు బోర్డును కదిలించే ఛాన్స్ ఉండేది. పంత్ అటు హిట్టింగ్ చేయలేక, ఇటు డిఫెన్స్ చేయలేక ఈజీగా వికెట్‌ను సమర్పించుకున్నాడు.
ఈ వన్డేలో భారత్ ఓటమికి ఇంకో ప్రధాన కారణం కోహ్లీ. సిరీస్‌లోని తొలి రెండు మ్యాచుల్లో ఫెయిలైన కింగ్.. ఈ మ్యాచ్‌లో 20 పరుగులతో మంచి స్టార్ట్ అందుకున్నాక ఔట్ అయ్యాడు. బాల్ గింగిరాలు తిరుగుతున్న పిచ్‌పై మరింత పట్టుదలతో ఆడి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాల్సినోడు త్వరగా ఔట్ అవడంతో టీమ్ అంతా కొలాప్స్ అయింది. ఛేజింగ్ మాస్టర్ అయిన కోహ్లీ.. అర్లీగా ఔట్ అవడం భారత్ విజయావకాశాలను భారీగా దెబ్బ తీసింది. అతడు ఓ ఎండ్‌లో ఉంటే మరో ఎండ్‌లో ఇతర బ్యాటర్లు అటాకింగ్ చేసేవారు. కానీ ఇది సాధ్యపడలేదు. కోహ్లీనే కాదు.. కెప్టెన్ రోహిత్ త్వరగా ఔట్ అవడం కూడా జట్టుకు మైనస్‌గా మారింది. మంచి స్టార్ట్ అందించిన రోహిత్.. ఇంకో పది ఓవర్ల పాటు ఉంటే లంక నుంచి మ్యాచ్‌ను లాగేసుకునేవాడు. బౌలర్లలో సిరాజ్ వైఫల్యం, బ్యాటర్లలో కోహ్లీ, అయ్యర్, పంత్, గిల్ ఫెయిల్యూర్ జట్టును కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి.