iDreamPost
android-app
ios-app

శ్రీలంకతో రెండో వన్డే.. భారత జట్టులో కీలక మార్పు! స్టార్ ప్లేయర్ ఎంట్రీ!

  • Published Aug 03, 2024 | 10:03 PM Updated Updated Aug 03, 2024 | 10:03 PM

India vs Sri Lanka: టీమిండియా మరో సవాల్​కు సిద్ధమవుతోంది. తొలి వన్డేలో శ్రీలంక ఇచ్చిన షాక్ నుంచి కోలుకున్న రోహిత్ సేన.. రెండో వన్డేలో ఆ జట్టు పని పట్టాలని చూస్తోంది.

India vs Sri Lanka: టీమిండియా మరో సవాల్​కు సిద్ధమవుతోంది. తొలి వన్డేలో శ్రీలంక ఇచ్చిన షాక్ నుంచి కోలుకున్న రోహిత్ సేన.. రెండో వన్డేలో ఆ జట్టు పని పట్టాలని చూస్తోంది.

  • Published Aug 03, 2024 | 10:03 PMUpdated Aug 03, 2024 | 10:03 PM
శ్రీలంకతో రెండో వన్డే.. భారత జట్టులో కీలక మార్పు! స్టార్ ప్లేయర్ ఎంట్రీ!

టీ20 సిరీస్​లో శ్రీలంకను చిత్తు చేసిన భారత్​కు అసలైన సవాల్ వన్డే సిరీస్​లో ఎదురైంది. తొలి మ్యాచ్​లో రోహిత్ సేనకు ఆతిథ్య జట్టు షాక్ ఇచ్చింది. టీమిండియా ఈజీగా గెలవాల్సిన మ్యాచ్​ టై అయింది. రెండు బంతుల తేడాతో మ్యాచ్​ స్వరూపాన్ని మార్చేసింది లంక. మ్యాచ్ డ్రా అయినా టీమిండియాకు ఉన్న స్టార్ల బలాన్ని బట్టి చూస్తే ఇది మనకు ఓటమి అనే చెప్పాలి. యంగ్​స్టర్స్​తో కూడుకున్న ఆతిథ్య జట్టు నైతికంగా విజయం సాధించిందని ఒప్పుకోక తప్పదు. ఈ మ్యాచ్ నుంచి గుణపాఠం నేర్చుకున్న మెన్ ఇన్ బ్లూ.. సెకండ్ ఛాలెంజ్​కు సిద్ధమవుతోంది. రేపు జరగబోయే రెండో వన్డేలో లంక పని పట్టాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో భారత ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

తొలి వన్డేలో దిగిన జట్టునే భారత్ దాదాపుగా రిపీట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్లేయింగ్ ఎలెవన్​లో ఒకట్రెండు మార్పులు మాత్రం తథ్యంగా కనిపిస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మకు జతగా మరో ఓపెనర్​గా శుబ్​మన్ గిల్ బరిలోకి దిగుతాడు. ఫస్ట్ వన్డేలో అతడు 16 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. అయినా వైస్ కెప్టెన్ కాబట్టి గిల్​ను పక్కనబెట్టలేని పరిస్థితి. ఓపెనర్లుగా రోహిత్-గిల్ వస్తే.. ఫస్ట్ డౌన్​లో కింగ్ విరాట్ కోహ్లీ దిగుతాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఆడటం ఖాయం. స్పిన్ ఆల్​రౌండర్లుగా వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ టీమ్​లో ఉండటం పక్కా అనే చెప్పాలి. అయితే శివమ్ దూబేకు ప్లేయింగ్ ఎలెవన్​లో చోటు దక్కడం డౌట్​గా ఉంది. అతడి స్థానంలో ఐపీఎల్ స్టార్ రియాన్ పరాగ్​ను రీప్లేస్ చేసే ఛాన్స్ బలంగా కనిపిస్తోంది.

తొలి వన్డేలో దూబె బాగానే ఆడినా మ్యాచ్​ను ఫినిష్ చేయలేకపోయాడు. బౌలింగ్​లో ఒక వికెట్ తీసినా పెద్దగా ఇంపాక్ట్‌ చూపించలేకపోయాడు. పైగా సుందర్, అక్షర్ రూపంలో ఇద్దరు లెఫ్టాండ్ బ్యాటర్లు టీమ్​లో ఉన్నారు. అందుకే దూబేకు బదులు లాంగ్ ఇన్నింగ్స్ ఆడే సత్తా, క్వాలిటీ స్పిన్ బౌలింగ్ వేసే టాలెంట్ ఉన్న పరాగ్​ను జట్టులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. దూబె ప్లేస్​లో పంత్​ను తీసుకోవడం కంటే పరాగ్​ను తీసుకుంటే బెటర్ అని టీమ్ మేనేజ్​మెంట్ భావిస్తోందట. బౌలింగ్​లోనూ ప్లస్ అవుతాడు, ఆల్రెడీ టీ20 సిరీస్​లో రాణించాడు అనే ఉద్దేశంతో అతడి వైపు మొగ్గు చూపుతున్నారట. ఇక, రెండో వన్డేలో స్పెషలిస్ట్ స్పిన్నర్​గా కుల్దీప్ ఆడటం ఖాయం. అర్ష్​దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ మరోమారు పేస్ బాధ్యతల్ని పంచుకుంటారు. మరి.. భారత ప్లేయింగ్ ఎలెవన్​లో ఇంకేమైనా మార్పులు జరుగుతాయని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

భారత జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్​మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్/రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్​దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్.