Team India: టీ20ల్లో అతడు అవసరమా? యంగ్​స్టర్స్​కు ఛాన్స్ ఇవ్వాలంటున్న ఫ్యాన్స్!

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్​ను 1-1తో సమం చేసినప్పటికీ టీమిండియాను కొన్ని సమస్యలు వీడటం లేదు. కొందరు కీలక ఆటగాళ్ల ఫెయిల్యూర్​ భారత జట్టు కొంపముంచుతోంది.

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్​ను 1-1తో సమం చేసినప్పటికీ టీమిండియాను కొన్ని సమస్యలు వీడటం లేదు. కొందరు కీలక ఆటగాళ్ల ఫెయిల్యూర్​ భారత జట్టు కొంపముంచుతోంది.

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్​లో విజయంతో జోష్ మీద ఉన్న టీమిండియా.. సఫారీ టూర్​లోనూ మంచి స్టార్ట్ చేసింది. దాదాపు నెల రోజుల పాటు సాగే ఈ పర్యటనలో భాగంగా తొలుత జరిగిన టీ20 సిరీస్​ను 1-1 తేడాతో సమం చేసింది భారత్. మొదటి మ్యాచ్ వర్షం వల్ల రద్దవగా.. రెండో టీ20లో సౌతాఫ్రికా నెగ్గింది. దీంతో కీలకంగా మారిన మూడో మ్యాచ్​లో అన్ని విభాగాల్లోనూ అద్భుతంగా రాణించిన టీమిండియా 106 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తద్వారా సిరీస్​ను 1-1తో సమం చేసి వన్డే సిరీస్​కు ముందు మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. అయితే ఆఖరి టీ20లో నెగ్గినా, సిరీస్​ను టై చేసినా.. టీమిండియాను సమస్యలు మాత్రం వీడటం లేదు. సరిగ్గా గమనిస్తే ఈ సిరీస్​లో పాజిటివ్స్ కంటే నెగెటివ్సే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఓపెనర్ శుబ్​మన్ గిల్ బ్యాటింగ్ ఫెయిల్యూర్​ జట్టుకు తలనొప్పిగా మారింది.

వన్డేల్లో అద్భుతంగా రాణిస్తున్న గిల్​ టీ20ల్లో మాత్రం తేలిపోతున్నాడు. ఐపీఎల్​లో గుజరాత్ టైటాన్స్ తరఫున ధనాధన్ ఇన్నింగ్స్​లతో ఆకట్టుకోవడంతో ఇంటర్నేషనల్ లెవల్లోనూ అదే స్థాయిలో పెర్ఫార్మ్ చేస్తాడని టీమిండియా మేనేజ్​మెంట్ అనుకుంది. కానీ గిల్ మాత్రం తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. గత 14 టీ20ల్లో రెండుసార్లు మాత్రమే 50 ప్లస్ స్కోర్లు చేశాడు. అందులో ఒక సెంచరీ ఉన్నా దాదాపు పదిసార్లు 10 స్కోరు లోపే ఔటయ్యాడీ స్టార్ బ్యాటర్. సౌతాఫ్రికాతో సిరీస్​లోనూ అతడి పూర్ ఫామ్ కంటిన్యూ అయింది. సెకండ్ టీ20లో గోల్డెన్​ డక్​గా వెనుదిరిగిన గిల్.. మూడో మ్యాచ్​లో 8 రన్స్ మాత్రమే చేసి పెవిలియన్​కు చేరాడు. రీసెంట్​గా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్​లో అద్భుతంగా రాణించిన రుతురాజ్ గైక్వాడ్​ను కాదని సౌతాఫ్రికా సిరీస్​లో గిల్​ను ఆడించింది టీమిండియా. కానీ టీమ్ మేనేజ్​మెంట్, ఫ్యాన్స్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో అతడు ఫెయిలయ్యాడు.

టీ20 సిరీస్​లో విఫలమైన గిల్​ మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. శుబ్​మన్.. వెళ్లి వన్డేలు ఆడుకో పో, టీ20లకు నువ్వు సరిపోవు అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. గిల్ కోసం ఎంతో టాలెంట్ ఉన్న రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ లాంటి యంగ్​స్టర్స్​ను బలిచేస్తున్నారని.. ఇది సరికాదని సీరియస్ అవుతున్నారు. టీ20లకు గిల్ పనికిరాడని.. అతడ్ని టీమ్​లో నుంచి తీసేయాలని అంటున్నారు. శుబ్​మన్ ప్లేస్​లో యంగ్​స్టర్స్​కు ఛాన్స్ ఇవ్వాలని సూచిస్తున్నారు. టీ20 వరల్డ్ కప్​కు ఎక్కువ టైమ్ లేదు కాబట్టి రుతురాజ్ లాంటి వారిని ఎంకరేజ్ చేయాలని భారత అభిమానులు చెబుతున్నారు. ఈ విషయంలో టీమిండియా మేనేజ్​మెంట్ వెనక్కి తగ్గుతుందో? లేదా మళ్లీ గిల్​కే ఛాన్స్ ఇస్తుందో? ఆఫ్ఘానిస్థాన్​తో వచ్చే ఏడాది జనవరిలో జరిగే టీ20 సిరీస్​లో తేలుతుంది. మరి.. గిల్​ను టీ20 టీమ్​లో నుంచి తీసేయాలనే డిమాండ్ మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్స్​ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Hardik Pandya: ముంబై ఇండియన్స్ సంచలన ప్రకటన! కెప్టెన్​గా హార్దిక్ పాండ్యా!

Show comments