టీమిండియా-సౌతాఫ్రికా టీ20 సిరీస్‌కు సర్వం సిద్ధమైంది. రసవత్తరంగా జరుగుతుందని భావిస్తున్న ఈ సిరీస్ ఎందులో లైవ్ స్ట్రీమింగ్ చూడాలి లాంటి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
టీమిండియా-సౌతాఫ్రికా టీ20 సిరీస్‌కు సర్వం సిద్ధమైంది. రసవత్తరంగా జరుగుతుందని భావిస్తున్న ఈ సిరీస్ ఎందులో లైవ్ స్ట్రీమింగ్ చూడాలి లాంటి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత్ ఓడటంతో ఫ్యాన్స్ అందరూ బాధలో కూరుకుపోయారు. కానీ అదే ఆసీస్‌తో నాల్రోజుల తర్వాత జరిగిన 5 టీ20ల సిరీస్‌ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది. యంగ్‌స్టర్స్‌తో నిండిన టీమ్ సంచలన విజయం సాధించడంతో అభిమానులు కూడా ఊరట చెందారు. ఎక్స్‌పీరియెన్స్ ప్లేయర్లతో బరిలోకి దిగిన కంగారూ జట్టును మనోళ్లు చిత్తు చేయడంతో కాస్త రిలాక్స్ అయ్యారు. దీంతో ఇప్పుడు అందరి ఫోకస్ భారత జట్టు ఆడబోయే నెక్స్ట్ సిరీస్ మీద పడింది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాకు బయల్దేరింది టీమిండియా. ఇప్పటికే సఫారీ గడ్డ మీద ల్యాండ్ అయిన మన టీమ్ మూడు టీ20లు, మూడు వన్డేలతో పాటు రెండు టెస్టులు ఆడేందుకు సిద్ధమైపోయింది. ఈ సిరీస్‌లో వన్డేల సంగతిని పక్కనబెడితే.. టీ20లు, టెస్టులు చాలా ఇంపార్టెంట్‌గా మారాయి. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ ఉంది. కాబట్టి పొట్టి ఫార్మాట్లో టీమ్ కాంబినేషన్ సెట్ చేసుకోవడం మీద దృష్టి పెడుతోంది భారత టీమ్ మేనేజ్మెంట్.
రీసెంట్గా ముగిసిన ఆసీస్ సిరీస్‌లో యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, రింకూ సింగ్, జితేష్ శర్మ, ముకేశ్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్ లాంటి యంగ్‌స్టర్స్ ఆకట్టుకున్నారు. తమ ప్రతిభతో ఆసీస్‌ను కంగారెత్తించారు. వీళ్లందరూ సఫారీ టూర్‌కూ సెలక్ట్ అయ్యారు. సౌతాఫ్రికా మీద కూడా రాణించి వరల్డ్ కప్ స్క్వాడ్‌లో తమ ప్లేస్‌ను సుస్థిరం చేసుకోవాలని చూస్తున్నారు. దాదాపు నెల రోజుల పాటు సఫారీ గడ్డ మీద ఉండనున్న భారత జట్టు.. మొదటగా టీ20 సిరీస్‌లో ఆతిథ్య జట్టును ఢీకొట్టనుంది. ఈ సిరీస్‌లో మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ మన టీమ్‌ను కెప్టెన్‌గా ముందుండి నడపనున్నాడు. ఆసీస్‌తో సిరీస్‌లో బౌలర్లు, ఫీల్డర్లకు విలువైన సూచనలు ఇస్తూ జట్టుకు వరుస విజయాలు అందించాడు సూర్య. ఇప్పుడు కూడా అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసి సఫారీలను చిత్తు చేయాలని చూస్తున్నాడు. కోచ్ రాహుల్ ద్రవిడ్ ఎంట్రీతో అతడు ప్లానింగ్ విషయంలో మరింత ధీమాతో ఉండే అవకాశం ఉంది.
భారత్-సౌతాఫ్రికా సిరీస్‌లోని అన్ని మ్యాచులనూ స్టార్‌స్పోర్ట్స్ నెట్వర్స్ లైవ్ టెలికాస్ట్ చేయనుంది. డిజిటల్లో అయితే సఫారీ సిరీస్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్ ప్రత్యక్షప్రసారం చేయనుంది. ఇక, తొలి టీ20 డిసెంబర్ 10వ తేదీన మొదలుకానుంది. డర్బన్‌లోని కింగ్మీడ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్‌లో పాల్గొనే టీమిండియా స్క్వాడ్‌లో యంగ్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ చేరనున్నారు. జడ్డూ ఈ సిరీస్‌లో భారత టీమ్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కాబట్టి బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ అతడు మరింతగా రాణించాల్సిన అవసరం ఉంది. కెప్టెన్ సూర్యకుమార్, జడేజాలు అదనపు బాధ్యత తీసుకొని టీమ్‌ను నడిపించాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: MS Dhoni: టీమ్‌లోకి రావాలంటే 20 కిలోలు తగ్గాల్సిందే.. ధోని రూల్‌కు షాకైన ఆఫ్ఘాన్ క్రికెటర్!
The timing of India vs South Africa T20I series: [IST]
1st match – 7.30 pm.
2nd match – 8.30 pm.
3rd match – 8.30 pm.Live on Star Sports & Hotstar….!!!!! pic.twitter.com/CNXfgJhTwh
— Johns. (@CricCrazyJohns) December 5, 2023