Nidhan
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి సీనియర్ ప్లేయర్లు లేని వేళ టీమ్‌కు అన్నీ తానై నిలిచాడు సూర్యకుమార్ యాదవ్. కెప్టెన్సీ బాధ్యతలు మోస్తూనే బ్యాట్‌తోనూ చెలరేగి సెంచరీ బాదాడు. కీలకమైన మూడో టీ20లో జట్టును గెలిపించాడు. అయితే అతడు గాయపడటంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి సీనియర్ ప్లేయర్లు లేని వేళ టీమ్‌కు అన్నీ తానై నిలిచాడు సూర్యకుమార్ యాదవ్. కెప్టెన్సీ బాధ్యతలు మోస్తూనే బ్యాట్‌తోనూ చెలరేగి సెంచరీ బాదాడు. కీలకమైన మూడో టీ20లో జట్టును గెలిపించాడు. అయితే అతడు గాయపడటంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.
Nidhan
రెండో టీ20లో ఓటమితో సఫారీ టూర్‌ను స్టార్ట్ చేసిన టీమిండియాకు ఆఖరి టీ20లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. నెగ్గితేనే సిరీస్ డ్రా అవుతుందనుకునే మ్యాచ్‌లో ఘనవిజయం సాధించింది భారత్. ముందు బ్యాటింగ్, ఆ తర్వాత బౌలింగ్‌లో తిరుగులేని విధంగా డామినేట్ చేస్తూ సఫారీలను చిత్తు చేసింది. మ్యాచ్ జరుగుతోంది సౌతాఫ్రికాలోనా? లేదా ఇండియాలోనా? అనేలా మన ప్లేయర్లు ఆధిపత్యం చలాయించారు. భారత బ్యాటర్లు, బౌలర్లు చెలరేగిపోవడంతో ప్రొటీస్‌కు చుక్కలు కనిపించాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా 106 పరుగుల భారీ తేడాతో నెగ్గిందంటే అందులో సూర్యకుమార్ యాదవ్ కాంట్రిబ్యూషన్ చాలా కీలకం. 56 బంతుల్లో 100 పరుగులు చేసిన మిస్టర్ 360.. కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో టీమ్‌కు భారీ స్కోరును అందించాడు. అతడి ఇన్నింగ్స్ వల్లే సౌతాఫ్రికా ముందు బిగ్ టార్గెట్ పెట్టగలిగింది భారత్. ఆ తర్వాత అపోజిషన్ టీమ్‌ను ఒత్తిడిలోకి నెట్టి తక్కువ స్కోరుకే కుప్పకూల్చింది. ఈ విక్టరీతో మూడు మ్యాచుల సిరీస్‌ను 1-1 తేడాతో సమం చేసింది టీమిండియా. కానీ జట్టులో గెలిచిన ఆనందం మాత్రం లేదు.
అటు భారత టీమ్‌తో పాటు ఇటు ఫ్యాన్స్‌లోనూ సౌతాఫ్రికా మీద నెగ్గామనే ఆనందం లేదు. ఆ మ్యాచ్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గాయపడటమే అందుకు కారణం. ఫీల్డింగ్ చేస్తున్న టైమ్‌లో అతడి ఎడమ కాలి పాదం ట్విస్ట్ అయింది. దీంతో వెంటనే గ్రౌండ్‌ను వీడాడు మిస్టర్ 360. టీమిండియా వైద్య సిబ్బంది అతడ్ని పట్టుకొని మైదానం నుంచి తీసుకెళ్లారు. గాయం కారణంగా సూర్య వెళ్లిపోవడంతో వైస్ కెప్టెన్ రవీంద్ర జడేజా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. భారత్ మ్యాచ్ గెలిచినప్పటికీ సెంచరీతో మెరిసిన సూర్యకుమార్‌కు గాయం అవడంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. టీ20 వరల్డ్ కప్-2024లో భారత జట్టుకు సూర్య ఎంతో కీలకం. కాబట్టి అతడు త్వరగా రికవర్ అవ్వాలని టీమ్ మేనేజ్మెంట్, సెలక్టర్లు కూడా భావిస్తున్నారు.
ఇక. ఇంజ్యురీపై స్వయంగా సూర్యకుమార్ యాదవ్ అప్డేట్ ఇచ్చాడు. మ్యాచ్ అనంతరం ఈ విషయం మీద రియార్ట్ అయిన మిస్టర్ 360.. తాను బాగానే ఉన్నానని అన్నాడు. ఫీల్డింగ్ చేస్తున్న టైమ్‌లో కాలు జారడంతో కొంత ఇబ్బంది పడ్డానని చెప్పాడు. ఇప్పుడు బాగానే నడుస్తున్నానని.. ఆందోళన అక్కర్లేదని తెలిపాడు. ఎప్పటిలాగే ఈ మ్యాచ్‌లోనూ భయం లేకుండా ఆడాలనే ప్లాన్‌తో బరిలోకి దిగి సక్సెస్ అయ్యామన్నాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే స్కోరు బోర్డు మీద భారీగా రన్స్ ఉంచాలని డిసైడ్ అయ్యామని పేర్కొన్నాడు. దీని వల్ల బౌలర్లు మరింత స్వేచ్ఛగా బంతులు వేసేందుకు ఛాన్స్ లభిస్తుందని సూర్యకుమార్ చెప్పుకొచ్చాడు. తమ ప్లేయర్లు అన్ని విభాగాల్లోనూ అదరగొట్టారని.. అటాకింగ్ గేమ్‌తో ఆకట్టుకున్నారని వ్యాఖ్యానించాడు. స్పిన్నర్ కుల్దీప్ వికెట్ల కోసం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాడని.. అదే అతడి స్పెషాలిటీ అని సూర్య వివరించాడు. కాగా, సూర్యకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కడం విశేషం.
ఇదీ చదవండి: BCCI సంచలన నిర్ణయం.. IPL తరహాలో మరో కొత్త లీగ్!
Suryakumar Yadav is off the field due to an ankle injury!
Ravindra Jadeja has taken over as the interim captain.
📸: Disney+Hotstar #SAvIND #SuryakumarYadav #Jadeja pic.twitter.com/VU76qrQyBr
— OneCricket (@OneCricketApp) December 14, 2023
SuryaKumar Yadav updates on his injury!
Courtesy: BCCI
.
.#suryakumaryadav #cricket #SAvIND pic.twitter.com/KHeCebcCR2— Machaao For Cricket (@MachaaoApp) December 15, 2023