Rohit Sharma: చరిత్రకు అడుగు దూరంలో రోహిత్.. కోహ్లీ ఆల్​టైమ్ రికార్డుకు మూడింది!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించేందుకు ఇంకో అడుగు దూరంలో ఉన్నాడు. సౌతాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్​లో అతడు రేర్ రికార్డ్​ను క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించేందుకు ఇంకో అడుగు దూరంలో ఉన్నాడు. సౌతాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్​లో అతడు రేర్ రికార్డ్​ను క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు రికార్డులు కొత్త కాదు. దశాబ్దంన్నరకు పైగా కెరీర్​లో అతడు ఎన్నో అరుదైన ఘనతలు అందుకున్నాడు. ఎవరికీ సాధ్యం కాని కొన్ని రికార్డుల్ని క్రియేట్ చేశాడు. అలాంటోడు ఇప్పుడు చరిత్ర సృష్టించడానికి మరో అడుగు దూరంలో ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్-2024 ఫైనల్​ మ్యాచ్​కు మరికొన్ని నిమిషాలే ఉన్నాయి. తుదిపోరులో సౌతాఫ్రికాతో తలపడనుంది భారత్. ప్రపంచ కప్​ను తొలిసారి ముద్దాడాలని సఫారీ టీమ్ పట్టుదలతో ఉంది. మరోవైపు పొట్టి కప్పును రెండోసారి కైవసం చేసుకోవాలని రోహిత్ సేన తీర్మానించుకుంది. దీంతో ఫైనల్ మ్యాచ్ ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ తరుణంలో మ్యాచ్​తో పాటు రోహిత్ రికార్డు గురించి కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు.

చరిత్ర సృష్టించేందుకు రోహిత్ శర్మకు అరుదైన అవకాశం. ప్రొటీస్​తో ఫైనల్ ఫైట్​కు ముందు ఓ అరుదైన రికార్డు హిట్​మ్యాన్​ను ఊరిస్తోంది. ఇవాళ గనుక మరో 6 పరుగులు చేస్తే టీ20 ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్​గా రోహిత్ నిలుస్తాడు. పొట్టి కప్పులో హయ్యెస్ట్‌ స్కోర్ చేసిన రికార్డు టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరు మీద ఉంది. అతడు ఇప్పటిదాకా మెగాటోర్నీలో 1,216 పరుగులు చేశాడు. అదే రోహిత్ 1,211 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. హిట్​మ్యాన్ ఉన్న ఫామ్​కు ఈ ఆరు పరుగులు ఒక లెక్కే కాదు. కాబట్టి కోహ్లీ ఆల్​టైమ్ రికార్డుకు మూడిందనే చెప్పాలి. ఇక, ప్రస్తుత ప్రపంచ కప్​లో రోహిత్ 7 మ్యాచుల్లో 248 పరుగులతో మూడో టాప్ స్కోరర్​గా కంటిన్యూ అవుతున్నాడు. మరి.. కింగ్ రికార్డును హిట్​మ్యాన్ బ్రేక్ చేస్తాడని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

Show comments