Nidhan
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా అదరగొడుతోంది. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మధ్య బరిలోకి దిగిన భారత్‌ను ప్రొటీస్ ఎక్కడికక్కడ అడ్డుకుంటోంది.
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా అదరగొడుతోంది. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మధ్య బరిలోకి దిగిన భారత్‌ను ప్రొటీస్ ఎక్కడికక్కడ అడ్డుకుంటోంది.
Nidhan
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా అదరగొడుతోంది. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మధ్య బరిలోకి దిగిన భారత్‌ను ప్రొటీస్ ఎక్కడికక్కడ అడ్డుకుంటోంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అందుకు తగ్గట్లే మంచి స్టార్ట్ లభించింది. మార్కో యాన్సన్ వేసిన ఫస్ట్ ఓవర్లోనే విరాట్ కోహ్లీ 3 బౌండరీలు కొట్టాడు. మొత్తంగా ఆ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. మరో ఓపెనర్ రోహిత్ శర్మ కూడా రెండు ఫోర్లు కొట్టడంతో ఇక తిరుగులేదని అంతా అనుకున్నారు. కానీ 9 పరుగులు చేసిన హిట్‌మ్యాన్‌ను సఫారీ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ పెవిలియన్‌కు పంపించాడు.
మెగాటోర్నీలో స్వీప్ షాట్స్‌తో స్పిన్నర్ల బౌలింగ్‌లో భారీగా పరుగులు రాబట్టాడు రోహిత్. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లోనూ ఇదే షాట్‌ను ఉపయోగించాలని అనుకున్నాడు. అయితే దీన్ని ముందే పసిగట్టిన కేశవ్ మహారాజ్ అందుకు తగ్గట్లు పర్ఫెక్ట్ స్కెచ్ వేశాడు. సర్కిల్ లోపల స్క్వేర్ లెగ్‌లో ఓ ఫీల్డర్‌ను పెట్టి ఆ షాట్ కొట్టమంటూ హిట్‌మ్యాన్‌ను రెచ్చగొట్టాడు. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన రోహిత్ స్వీప్ షాట్ కొట్టాడు. అయితే గాలి కారణంగా బంతికి అనుకున్న ఎలివేషన్ దొరక్కపోవడం, బంతి బ్యాట్ మీదకు స్లోగా రావడంతో ఆ షాట్ వర్కౌట్ కాలేదు. గాల్లో దూసుకొచ్చిన బంతిని హెన్రిచ్ క్లాసెన్ డైవ్ చేసి అందుకున్నాడు. భారతీయ మూలాలు ఉన్న మహారాజ్ మన టీమ్‌ను ఆదిలోనే ఈ విధంగా దెబ్బతీశాడు. రోహిత్‌తో పాటు రిషబ్ పంత్‌ను కూడా అతడు పెవిలియన్‌కు పంపించాడు.
Rohit Sharma holes one out. pic.twitter.com/N36q4Ycmtk
— CricTracker (@Cricketracker) June 29, 2024