iDreamPost
android-app
ios-app

Ravindra Jadeja: డేంజర్​లో రవీంద్ర జడేజా కెరీర్! వారసుడు వచ్చేశాడు!

  • Author singhj Updated - 03:26 PM, Sat - 2 December 23

టీమిండియా స్పిన్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా కెరీర్ డేంజర్​లో ఉంది. జడ్డూకు రీప్లేస్​గా తానున్నాంటూ అతడి వారసుడు వచ్చేశాడు.

టీమిండియా స్పిన్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా కెరీర్ డేంజర్​లో ఉంది. జడ్డూకు రీప్లేస్​గా తానున్నాంటూ అతడి వారసుడు వచ్చేశాడు.

  • Author singhj Updated - 03:26 PM, Sat - 2 December 23
Ravindra Jadeja: డేంజర్​లో రవీంద్ర జడేజా కెరీర్! వారసుడు వచ్చేశాడు!

స్పోర్ట్స్​లో ఏ ఆటగాడైనా ఏదో ఒక రోజు రిటైర్ కావాల్సిందే. క్రికెట్ అనే కాదు ఏ గేమ్ అయినా ప్లేయర్లకు వీడ్కోలు చెప్పే రోజు వస్తుంది. అప్పటివరకు వాళ్లు తమ దేశానికి ఎలా సేవలు అందించారనేదే ముఖ్యం. అయితే స్టార్ ప్లేయర్లు రిటైరయ్యే లోపు వాళ్లకు తగిన ఆప్షన్స్ కూడా చూసుకోవాలి. లెజెండరీ ఆటగాళ్లు జట్లకు దూరమైతే వారిని రీప్లేస్ చేసేవారు అందుబాటులో ఉండాలి. అందుకోసం ముందు నుంచే యంగ్​స్టర్స్​ను రెడీ చేసుకోవాలి. అలా చేసుకోకపోతే శ్రీలంకకు పట్టిన గతే మిగతావారికీ పట్టే ప్రమాదం ఉంటుంది.

కుమార సంగక్కర, మహేళ జయవర్దనే, ముత్తయ్య మురళీధరన్, చమిందా వాస్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు టీమ్​లో ఉన్నప్పుడే వారికి ప్రత్యామ్నాయలను కూడా సిద్ధం చేసుకోవాల్సిందే. కానీ లంక క్రికెట్ బోర్డు ఆ పని చేయలేదు. ఇది ఆ జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. ఒకప్పుడు ఛాంపియన్​ టీమ్​లా ఆడే లంక.. ఇప్పుడు పసికూనలా మారిపోయింది. భారత టీమ్ మేనేజ్​మెంట్, సెలక్టర్లు మాత్రం ఈ విషయంలో జాగ్రత్త వహిస్తున్నారు. స్టార్ ప్లేయర్లు రిటైర్మెంట్ వయసుకు చేరుకోవడానికి ముందే వారికి తగిన రీప్లేస్​మెంట్​ను రెడీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

బ్యాటింగ్, బౌలింగ్​లో ఏయే స్థానాలకు ఎవర్ని భర్తీ చేయాలి? యువ ఆటగాళ్లలో ఎవరు పనికొస్తారు? అనే దానిపై ప్రయోగాలు చేస్తున్నారు. ఇవి సక్సెస్ అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహ్మద్ షమి లాంటి సీనియర్లు ఒకవేళ రిటైర్మెంట్ ప్రకటించినా టైమ్​కు రీప్లేస్​మెంట్ అందుబాటులో ఉంది. ఇప్పుడు మరో క్రికెటర్ కోసం కూడా టీమిండియా మేనేజ్​మెంట్ ఆప్షన్స్ చూస్తున్నట్లు కనిపిస్తోంది. స్టార్ స్పిన్​ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజాను భర్తీ చేసే ఆటగాడి కోసం వెతుకులాట మొదలైపోయింది. అతడి ప్లేసులో ఆడే సరైన ప్లేయర్​ను పట్టేసుకున్నారు. యువ సంచలనం సాయి సుదర్శన్​ను జడ్డూ ప్లేస్​లో ఆడించాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది.

సాయి సుదర్శన్​కు జడేజా లాంటి స్కిల్సే ఉన్నాయి. లెఫ్టాండ్ బ్యాటర్ అయిన అతడు.. లెగ్ బ్రేక్ బౌలింగ్ వేస్తాడు. ఎక్కువగా టాపార్డర్​లో బ్యాటింగ్​ చేయడానికి ఇష్టపడే సుదర్శన్.. మిడిలార్డర్​లో ఆడేందుకూ రెడీగా ఉంటాడు. ఫస్ట్ క్లాస్​ క్రికెట్​లో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు బాదిన సుదర్శన్.. హయ్యెస్ట్ స్కోరు 179గా ఉంది. పలు మ్యాచుల్లో బౌలింగ్ వేసినా ఎక్కువ వికెట్లు తీయలేకపోయాడు. కానీ బౌలింగ్ స్టైల్ మాత్రం బాగుంది. బౌలింగ్​లో కాస్త బలహీనంగా ఉన్నా పార్ట్ టైమర్​గా పనికొస్తాడు. ఛాన్సులు ఇచ్చి సానబెడితే దీర్ఘ కాలంలో మంచి స్పినర్​గా ఎదిగే అవకాశం ఉంది.

అద్భుతమైన బ్యాటింగ్ టాలెంట్, పార్ట్ టైమ్ బౌలర్​గా పనికొస్తాడు కాబట్టి సౌతాఫ్రికాతో సిరీస్​కు సాయి సుదర్శన్​ను సెలక్టర్లు ఎంపిక చేశారని చెప్పొచ్చు. రెగ్యులర్ ప్లేయర్ అయిన జడేజా వికెట్లు తీస్తున్నా బ్యాటింగ్​లో ఫ్లాప్ అవుతున్నాడు. అందుకే జడ్డూకు ఆప్షన్స్ వెతికే క్రమంలో సుదర్శన్​ సెలక్టర్లకు కనిపించాడట. సఫారీ సిరీస్​తో పాటు ఇకపై రెగ్యులర్​గా అతడికి అవకాశాలు ఇస్తూ వచ్చే వన్డే వరల్డ్ కప్​కు సిద్ధం చేయాలనే ఉద్దేశంతో ఉన్నారని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ సాయి సుదర్శన్ సక్సెస్ అయితే మాత్రం జడేజా కెరీర్​ డేంజర్​లో ఉందనే చెప్పాలి. మరి.. జడ్డూకు రీప్లేస్​గా సాయి సుదర్శన్​ను ఎంకరేజ్ చేస్తుండటంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Animal Review: కొన్ని మినహా, యానిమల్ సినిమాకి తిరుగులేదు