Nidhan
టీమిండియా సిసలైన పోరాటానికి సిద్ధమవుతోంది. పొట్టి కప్పు కోసం ఫైనల్లో సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ మొదలవడానికి మరికొన్ని గంటలే ఉన్నాయి.
టీమిండియా సిసలైన పోరాటానికి సిద్ధమవుతోంది. పొట్టి కప్పు కోసం ఫైనల్లో సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ మొదలవడానికి మరికొన్ని గంటలే ఉన్నాయి.
Nidhan
టీమిండియా సిసలైన పోరాటానికి సిద్ధమవుతోంది. పొట్టి కప్పు కోసం ఫైనల్లో సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ మొదలవడానికి మరికొన్ని గంటలే ఉన్నాయి. దీంతో ప్రేక్షకులు, అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రెండు హేమాహేమీలు లాంటి జట్లు బరిలో ఉండటంతో ఏ టీమ్ గెలుస్తుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అటు భారత్, ఇటు సౌతాఫ్రికా రెండు కూడా ఓటమి అనేది లేకుండా ఫైనల్స్‌కు చేరుకున్నాయి ఇరు జట్లలోనూ అద్భుతమైన స్పిన్నర్లు, పేసర్లు ఉన్నారు. ఆల్‌రౌండర్లు, బ్యాటర్లు ఇలా ఏ రకంగా చూసుకున్నా రోహిత్-మార్క్రమ్ టీమ్స్ సమవుజ్జీలుగానే కనిపిస్తున్నాయి. దీంతో ప్రెజర్‌ను తట్టుకొని నిలబడే జట్టుదే విజయం ఖాయమని చెప్పొచ్చు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సీనియర్లతో పాటు కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు ఈ ఫైనల్ మ్యాచ్ ఎంతో కీలకం కానుంది. హిట్‌మ్యాన్, విరాట్ పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పనున్నారనే వార్తలు వస్తున్నాయి. అందుకే వాళ్ల కోసమైనా కప్పు గెలవాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ద్రవిడ్‌కు భారత టీమ్ కోచ్‌గా ఇదే ఆఖరి రోజు కానుంది. అతడి పదవీకాలం ఇవాళ్టితో ముగియనుంది. దీంతో వరల్డ్ కప్ గెలిచి ద్రవిడ్‌కు గిఫ్ట్‌గా ఇవ్వాలని మరికొందరు అంటున్నారు. దీన్ని పక్కనబెడితే టీమిండియా కోచ్‌ను ఓ పీడకల వెంటాడుతోంది. అదే వెస్టిండీస్. అది 2007 వన్డే ప్రపంచ కప్. అప్పటిదాకా టీమ్‌కు కెప్టెన్‌గా ఉంటూ ఎన్నో కఠిన మ్యాచుల్లో విజయాలు అందించిన ద్రవిడ్ ఆ ఏడాది మెగాటోర్నీలో మాత్రం దాన్ని రిపీట్ చేయలేకపోయాడు.
2007 వరల్డ్ కప్‌లో భారత్ గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. అప్పుడు పసికూనగా ఉన్న బంగ్లాదేశ్ చేతిలో ఓడి టోర్నీ నుంచి బయటకు వచ్చేసింది. దీంతో మన జట్టు ఆటగాళ్ల ఇంటి మీద కొందరు దాడి చేసిన ఉదంతాలు ఉన్నాయి. అన్ని విమర్శలు ద్రవిడ్ తన కెరీర్లో ఎన్నడూ ఎదుర్కోలేదు. ఆ కరీబియన్ పర్యటన అతడికి పీడకలగా మారింది. అతడు కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పేశాడు. అయితే పోయిన చోటే వెతుక్కోవాలని పెద్దలు అంటుంటారు. ఇప్పుడు ద్రవిడ్ అదే చేయాలి. అప్పుడు కెప్టెన్‌గా విండీస్ గడ్డపై ఫెయిలైన ద్రవిడ్.. ఇప్పుడు అక్కడ టీమిండియాకు కోచ్‌గా ఉన్నాడు. తాను ఓడిన చోట రోహిత్ సేనను వెనుక ఉండి సలహాలు, సూచనలు ఇస్తూ గెలిపిస్తే అది మధుర జ్ఞాపకంగా మారుతుంది. తాను సాధించనిది హిట్‌మ్యాన్‌కు అందించి కోచ్‌గా తన కెరీర్, కెప్టెన్‌గా రోహిత్ కెరీర్‌ను కూడా మరింత చిరస్మరణీయం చేసే అవకాశం ద్రవిడ్ ముందు ఉంది. దీన్ని అతడు ఎలా వాడుకుంటాడో చూడాలి.
Rahul Dravid ended his White ball captaincy in West Indies with a nightmare, he deserves a good farewell at the same place as an Indian coach. 🇮🇳
– One final day for Rahul Dravid. pic.twitter.com/qRuhDu9Zb7
— Johns. (@CricCrazyJohns) June 29, 2024