IND vs SA: సౌతాఫ్రికాతో సెకండ్ వన్డే.. మూడు మార్పులతో బరిలోకి టీమిండియా!

సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్​ను గెలుచుకునేందుకు టీమిండియాకు ఇదే కరెక్ట్ ఛాన్స్. ఇవాళ నెగ్గితే మరో మ్యాచ్​ మిగిలి ఉండగానే సిరీస్ భారత్ సొంతం అవుతుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..

సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్​ను గెలుచుకునేందుకు టీమిండియాకు ఇదే కరెక్ట్ ఛాన్స్. ఇవాళ నెగ్గితే మరో మ్యాచ్​ మిగిలి ఉండగానే సిరీస్ భారత్ సొంతం అవుతుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..

సఫారీ టూర్​లో తొలి సిరీస్​ను అందుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. మూడు టీ20ల సిరీస్​లో తొలుత వెనుకబడినా ఆ తర్వాత పుంజుకొని 1-1తో సమం చేసింది. వన్డే సిరీస్​ను కూడా గ్రాండ్​గా స్టార్ట్ చేసింది. మూడు వన్డేల సిరీస్​లో భాగంగా ఆదివారం జరిగిన మొదటి మ్యాచ్​లో 8 వికెట్ల తేడాతో నెగ్గింది. మరో 200 బంతులు మిగిలి ఉండగానే సౌతాఫ్రికా నిర్దేశించిన టార్గెట్​ను అందుకొని ఘనవిజయాన్ని నమోదు చేసింది. కీలకమైన రెండో వన్డే మంగళవారం జరగనుంది. మరో మ్యాచ్​ ఉన్నప్పటికీ రెండో వన్డేలోనే సౌతాఫ్రికాను మట్టికరింపి సిరీస్​ను పట్టేయాలని భారత్ అనుకుంటోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ మ్యాచ్​లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం.. రెండో వన్డేలో భారత్ మూడు మార్పులతో బరిలోకి దిగడం ఖాయంలా కనిపిస్తోంది.

వన్డే సిరీస్​లోని మిగిలిన మ్యాచులకు స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ దూరం అయ్యాడు. టెస్ట్ సిరీస్​కు రెడీ అయ్యేందుకు అతడు టీమ్​ను వీడాడు. దీంతో అతడి ప్లేసులో ఈ మ్యాచ్​లో నయా ఫినిషర్ రింకూ సింగ్ లేదా డొమెస్టిక్ క్రికెట్​లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన రజత్ పటీదార్​ల్లో ఒకరికి అవకాశం దక్కనుంది. టీ20ల్లో అదరగొడుతున్న రింకూకు ప్లేయింగ్ ఎలెవన్​లో వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. అయితే ప్రతి స్థానానికి బ్యాకప్​ను రెడీ చేసుకోవాలనే ఉద్దేశంలో టీమిండియా ఉంది. ఈ నేపథ్యంలో అయ్యర్ నాలుగో స్థానంలో ఆడతాడు కాబట్టి అతడి ప్లేసులో పటీదార్​ను బరిలోకి దించొచ్చు. ఒకవేళ రజత్, రింకూ ఇద్దర్నీ ఆడించాలంటే మాత్రం తిలక్ వర్మను తప్పించాల్సి ఉంటుంది. పేస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు.. కాబట్టి ఆ యూనిట్ విషయంలో మార్పులు ఉండకపోవచ్చు. కానీ స్పిన్ విభాగంలో రెండు ఛేంజ్ చేయడం పక్కాగా కనిపిస్తోంది. టీ20 సిరీస్​తో పాటు మొదటి వన్డేలో కూడా ఆడిన కుల్దీప్ యాదవ్​ను తప్పించి అతడి స్థానంలో యుజ్వేంద్ర చాహల్​ను టీమ్​లోకి తీసుకురావొచ్చు.

చాహల్​ను వన్డే సిరీస్​కు మాత్రమే సెలక్ట్ చేశారు. కాబట్టి అతడ్ని ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే తిలక్ వర్మ స్థానంలో స్పిన్ ఆల్​రౌండర్​ వాషింగ్టన్ సుందర్​కు ఛాన్స్ ఇవ్వొచ్చు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్​లోనూ అతడికి జట్టులో చోటు దక్కలేదు. కాబట్టి ఈ మ్యాచ్​లో అతడ్ని బరిలోకి దింపే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక, గతేడాది సఫారీ టూర్​లో వన్డే సిరీస్​లో ఒక్క మ్యాచ్ కూడా నెగ్గలేదు టీమిండియా. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్ లాంటి స్టార్లు టీమ్​లో ఉన్నా గెలుపు రుచి చూడలేకపోయింది భారత్. అప్పుడు కూడా రాహులే కెప్టెన్​గా ఉన్నాడు. అయితే ఈసారి మాత్రం జట్టులో అంతా యంగ్​స్టర్స్ ఉన్నా ఆల్​రౌండ్ పెర్ఫార్మెన్స్​తో ఫస్ట్ మ్యాచ్​లో సౌతాఫ్రికాకు షాక్ ఇచ్చింది భారత్. ఇదే ఊపులో రెండో మ్యాచ్​లోనూ నెగ్గి సిరీస్​ను ఎగరేసుకుపోవాలని చూస్తోంది. మరి.. ఈ మ్యాచ్​లో భారత జట్టులో ఇంకేమైనా మార్పులు జరుగుతాయని మీరు భావిస్తే కామెంట్ల రూపంలో తెలియజేయండి.

భారత జట్టు (అంచనా):

రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), రింకూ సింగ్/రజత్ పాటిదార్, తిలక్ వర్మ/ వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్, అర్ష్​దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్/యుజ్వేంద్ర చాహల్.

ఇదీ చదవండి: IPL 2024: ఐపీఎల్ షెడ్యూల్​పై కీలక అప్​డేట్.. నెక్స్ట్ సీజన్ ఎప్పుడు మొదలవుతుందంటే..?

Show comments