Nidhan
టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తనను ఓ పీడకల ఇంకా వెంటాడుతోందని అన్నాడు. దాన్ని తాను మర్చిపోలేకపోతున్నానని చెప్పాడు. అసలు కుల్దీప్ చెబుతున్న ఆ నైట్మేర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తనను ఓ పీడకల ఇంకా వెంటాడుతోందని అన్నాడు. దాన్ని తాను మర్చిపోలేకపోతున్నానని చెప్పాడు. అసలు కుల్దీప్ చెబుతున్న ఆ నైట్మేర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
సౌతాఫ్రికా టూర్లో టీమిండియా అదరగొడుతోంది. ఈ పర్యటనలో భాగంగా తొలుత జరిగిన టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసిన భారత జట్టు.. వన్డే సిరీస్‌లోనూ బోణీ కొట్టింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం ప్రొటీస్‌తో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో భారీ విక్టరీ నమోదు చేసింది. ఆతిథ్య జట్టు నిర్దేశించిన 116 పరుగుల టార్గెట్‌ను మరో 200 బంతులు ఉండగానే ఊది పారేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయానికి బౌలర్లే కారణం. అర్ష్‌దీప్ సింగ్ (5/37 ), అవేశ్ ఖాన్ (4/27 ) చెలరేగడంతో సౌతాఫ్రికా తక్కువ స్కోరుకే ఆలౌట్ అయింది. స్పిన్ మాంత్రికుడు కుల్దీప్ యాదవ్ కూడా ఒక వికెట్ తీశాడు. అయితే కుల్దీప్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తాను ఓ పీడకలను మర్చిపోలేకపోతున్నానని.. అది ఇంకా వెంటాడుతోందని అన్నాడు.
కుల్దీప్ను వెంటాడుతున్న పీడకల మరేంటో కాదు వన్డే వరల్డ్ కపేనట. ఇటీవల జరిగిన మెగా టోర్నీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి నుంచి తాను ఇంకా బయట పడలేకపోతున్నానని చెప్పాడు స్టార్ స్పిన్నర్. ‘ఆ ఓటమి తర్వాత మొదట్లో కొన్ని రోజులు కష్టంగా గడిచాయి. వారం నుంచి 10 రోజుల వరకు చాలా టఫ్‌గా సాగింది. పొద్దున నిద్రలేవగానే వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయామనే ఫీలింగ్ నన్ను వెంటాడేది. కానీ లైఫ్‌లో ముందుకు వెళ్తూనే ఉండాలి’ అని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు కుల్దీప్. ఇక, సౌతాఫ్రికా సిరీస్ గురించి మాట్లాడుతూ.. ఇక్కడ చివరగా ఐదేళ్ల కింద ఆడానని గుర్తుచేసుకున్నాడు. టీ20 సిరీస్‌లో భాగంగా ఆఖరి మ్యాచ్‌లో 5 వికెట్లు తీయడం తనకు చాలా స్పెషల్ అని కుల్దీప్ చెప్పుకొచ్చాడు. టీమ్ గెలుపు కోసం మాత్రమే ప్రయత్నించానని.. కానీ ఐదు వికెట్లు తీస్తానని అనుకోలేదన్నాడు.
టీ20ల్లో చాన్నాళ్ల తర్వాత బౌలింగ్‌కు దిగడంతో మొదట్లో కాస్త భయం వేసిందన్నాడు కుల్దీప్. రిథమ్‌ను అందుకోగలనా అనే అనుమానం వచ్చిందన్నాడు. కానీ బాల్‌ను తన చేతి నుంచి అనుకున్న విధంగా రిలీజ్ చేయడం, పిచ్ కూడా టర్న్‌కు సహకరించడంతో బాగా బౌలింగ్ చేయగలిగానన్నాడు. కాగా, కుల్దీప్ మాత్రమే కాదు.. వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిలో నుంచి చాలా మంది టీమిండియా ప్లేయర్లు బయటకు రాలేకపోతున్నారు. 2011 తర్వాత నుంచి అందకుండా ఉన్న ప్రపంచ కప్‌ను గెలుచుకోవాలనే డ్రీమ్ చెదిరిపోవడంతో భారత జట్టు అభిమానులు కూడా బాధలోనే ఉన్నారు. 2003 ఫైనల్‌లాగే 2023 ఫైనల్ కూడా అందరికీ ఓ పీడకలగా మారింది. మరి.. ఆసీస్ చేతిలో ఓటమిని మర్చిపోలేకపోతున్నానంటూ కుల్దీప్ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Naveen ul Haq: బిగ్ బ్రేకింగ్: నవీన్ ఉల్ హక్‌పై నిషేధం! కారణం ఏంటంటే..?