Nidhan
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో టీమిండియాను అద్భుతంగా నడిపించాడు తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్. యువకులతో నిండిన జట్టుతో పటిష్టమైన సఫారీ టీమ్‌ను చిత్తు చేసి.. సిరీస్ భారత్ సొంతమయ్యేలా చేశాడు. అదే టైమ్‌లో ఆఖరి మ్యాచ్‌లో తన సెన్సాఫ్ హ్యూమర్‌తోనూ అందర్నీ నవ్వించాడు.
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో టీమిండియాను అద్భుతంగా నడిపించాడు తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్. యువకులతో నిండిన జట్టుతో పటిష్టమైన సఫారీ టీమ్‌ను చిత్తు చేసి.. సిరీస్ భారత్ సొంతమయ్యేలా చేశాడు. అదే టైమ్‌లో ఆఖరి మ్యాచ్‌లో తన సెన్సాఫ్ హ్యూమర్‌తోనూ అందర్నీ నవ్వించాడు.
Nidhan
యంగ్ ఇండియా అదరగొట్టింది. స్టార్లతో నిండిన బ్యాటింగ్ లైనప్‌తో పాటు మంచి బౌలింగ్ యూనిట్ కలిగిన సౌతాఫ్రికాను వాళ్ల సొంత గడ్డే మీదే ఓడించి వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. కీలకమైన ఆఖరి మ్యాచ్‌లో 78 రన్స్ తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది భారత్. బౌలింగ్, బ్యాటింగ్‌లో ఒకరిద్దరు మినహా పెద్దగా ఎక్స్‌పీరియెన్స్ కలిగిన ప్లేయర్లు లేకపోయినా.. యంగ్‌స్టర్స్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేయడంతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. సఫారీ గడ్డ మీద టీమిండియా వన్డే సిరీస్ గెలుచుకోవడం ఇది రెండోసారి మాత్రమే. ఇంతకుముందు విరాట్ కోహ్లీ సారథ్యంలో 2018లో 5-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. మళ్లీ ఐదేళ్ల తర్వాత మరోమారు సిరీస్ నెగ్గింది. ఇక, లాస్ట్ వన్డేలో జరిగిన ఓ ఘటన అందరికీ నవ్వులు తెప్పించింది. భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేస్తూ తన సెన్సాఫ్ హ్యూమర్‌తో ఆకట్టుకున్నాడు.
సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ బ్యాటింగ్‌కు వచ్చిన టైమ్‌లో రాహుల్ వికెట్ల వెనుక కీపింగ్ చేస్తున్నాడు. అతడు క్రీజులోకి రాగానే స్టేడియంలోని డీజే ఒక సాంగ్ ప్లే చేశాడు. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ మూవీలోని ‘రామ్ సీతా రామ్’ పాటను ప్లే చేశాడు. ఈ సిరీస్‌లోని మిగతా మ్యాచుల్లోనూ కేశవ్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడల్లా ఈ పాటే పెడుతూ వచ్చారు. దీన్ని గమనించిన రాహుల్.. క్రీజులోకి వచ్చిన మహారాజ్‌తో ‘కేశవ్ భాయ్.. నువ్వు బ్యాటింగ్‌కు వచ్చినప్పుడుల్లా ఇదే పాటను పెడుతున్నారు’ అని అన్నాడు. దీంతో ఇటు మహారాజ్, అటు రాహుల్ ఇద్దరూ నవ్వుల్లో మునిగిపోయారు. వీళ్ల మాటలు స్టంప్ మైక్ ద్వారా బయటకు వినపడటంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాహుల్ కామెడీ టైమింగ్, సెన్సాఫ్ హ్యూమర్‌ను అందరూ మెచ్చుకుంటున్నారు. కాగా, భారత మూలాలు కలిగిన కేశవ్ మహారాజ్ ఆంజనేయ స్వామిని బాగా నమ్ముతాడు.
ఇక, వన్డే సిరీస్ విజయంలో ప్లేయర్ల ఇండివిడ్యువల్ పెర్ఫార్మెన్స్లను మినహాయిస్తే కెప్టెన్ కేఎల్ రాహుల్ రోల్ చాలా కీలకమనే చెప్పాలి. సారథ్యంలో అతడు పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాడు. యువ ఆటగాళ్లతో కలసిపోయాడు రాహుల్. ప్రొటీస్‌తో సిరీస్‌లో ఎక్కువగా యంగ్‌స్టర్స్ ఆడటం, అందులోనూ సాయి సుదర్శన్, రజత్ పాటిదార్ వంటి అరంగేట్ర ఆటగాళ్లు ఉన్న జట్టును లీడ్ చేయడం చాలా కష్టమని అంతా అనుకున్నారు. కానీ ఈ ఛాలెంజ్‌ను రాహుల్ ధైర్యంగా స్వీకరించాడు. యంగ్‌స్టర్స్‌కు అండగా ఉంటూ అవసరమైన టైమ్‌లో సలహాలు, సూచనలు ఇచ్చాడు. బౌలింగ్ ఛేంజెస్, అటాకింగ్ ఫీల్డ్ సెట్‌తో ఆకట్టుకున్నాడు. సిరీస్ గెలుపులో మూడో మ్యాచ్ కీలకం కావడంతో తానే కీపింగ్ బాధ్యతలు తీసుకున్నాడు. వికెట్ వెనుక నుంచి వ్యూహాలు పన్నాడు. ఇది బాగా వర్కౌట్ అయింది. ఈ క్రమంలోనే కేశవ్ మహారాజ్ బ్యాటింగ్‌కు వచ్చిన టైమ్‌లో తన సెన్సాఫ్ హ్యూమర్‌తో నవ్వించాడు రాహుల్. మరి.. రాహుల్ కెప్టెన్సీ, అతడి సెన్సాఫ్ హ్యూమర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Sunrisers Hyderabad: సంచలన నిర్ణయం తీసుకున్న సన్ రైజర్స్! ఏంటంటే?
Hahahahha….Rahul- “Keshav bhai, every time you come, they play this song (Ram Siya Ram) 🤍🤍🤍 pic.twitter.com/79NtNEbomk
— tea_addict 🇮🇳 (@on_drive23) December 21, 2023