Nidhan
India vs South Africa: భారత జట్టు చరిత్ర సృష్టించింది. సౌతాఫ్రికాతో జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్లో మన టీమ్ అరుదైన ఘనతను అందుకుంది. ఇప్పటివరకు ఏ జట్టుకూ సాధ్యం కానిది రోహిత్ సేన చేసి చూపించింది.
India vs South Africa: భారత జట్టు చరిత్ర సృష్టించింది. సౌతాఫ్రికాతో జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్లో మన టీమ్ అరుదైన ఘనతను అందుకుంది. ఇప్పటివరకు ఏ జట్టుకూ సాధ్యం కానిది రోహిత్ సేన చేసి చూపించింది.
Nidhan
భారత జట్టు చరిత్ర సృష్టించింది. సౌతాఫ్రికాతో జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్లో మన టీమ్ అరుదైన ఘనతను అందుకుంది. ఇప్పటివరకు ఏ జట్టుకూ సాధ్యం కానిది రోహిత్ సేన చేసి చూపించింది. తుదిపోరులో తొలుత బ్యాటింగ్‌కు దిగిన మెన్ ఇన్ బ్లూ ఓవర్లన్నీ ఆడి 7 వికెట్లకు 176 పరుగుల భారీ స్కోరు చేసింది. వరల్డ్ కప్ ఫైనల్ హిస్టరీలో ఇదే హయ్యెస్ట్ స్కోరు. పొట్టి కప్పు ఫైనల్ చరిత్రలో ఏ జట్టు కూడా ఇప్పటివరకు ఇంత స్కోరు చేయలేదు. దీంతో ఇది ఎప్పటికీ నిలిచిపోయే రికార్డుగా మారింది. ఇక, ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు మంచి స్టార్ట్ దొరికింది. కోహ్లీ-రోహిత్ ఫస్ట్ బాల్ నుంచే అటాకింగ్‌కు దిగారు.
రోహిత్-కోహ్లీ కలసి తొలి వికెట్‌కు 1.4 ఓవర్లలోనే 23 పరుగులు జోడించారు. ఆ తర్వాత హిట్‌మ్యాన్ (9) ఔటైనా విరాట్ క్రీజులో పాతుకుపోయాడు. యాంకర్ ఇన్నింగ్స్ ఆడిన కింగ్.. ఆఖర్లో జూలు విదిల్చాడు. వచ్చిన బాల్‌ను వచ్చినట్లు స్టాండ్స్‌కు పంపించాడు. మొత్తంగా 59 బంతులు ఎదుర్కొన్న అతడు 76 పరుగులు చేశాడు. ఇందులో 6 బౌండరీలతో పాటు 2 భారీ సిక్సులు ఉన్నాయి. ఆఖర్లో శివమ్ దూబె (16 బంతుల్లో 27) కూడా మెరుపులు మెరిపించాడు. అయితే భారత ఇన్నింగ్స్‌లో స్పెషల్ అంటే అక్షర్ పటేల్ (31 బంతుల్లో 47) బ్యాటింగ్ అనే చెప్పాలి. కోహ్లీని ఒక ఎండ్‌లో ఉంచి అతడు బిగ్ షాట్స్‌తో అలరించాడు. ఏకంగా 4 సిక్సులు బాదాడతను. మరి.. భారత్ నయా రికార్డుపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
THIS IS THE HIGHEST SCORE IN THE T20I WORLD CUP FINAL HISTORY 🇮🇳
– India 176 for 7 vs South Africa…!!! pic.twitter.com/9la0QxRv3p
— Johns. (@CricCrazyJohns) June 29, 2024