iDreamPost
android-app
ios-app

చరిత్ర సృష్టించిన టీమిండియా.. వరల్డ్ కప్ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైమ్!

  • Published Jun 29, 2024 | 9:58 PM Updated Updated Jun 29, 2024 | 9:58 PM

India vs South Africa: భారత జట్టు చరిత్ర సృష్టించింది. సౌతాఫ్రికాతో జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్​లో మన టీమ్ అరుదైన ఘనతను అందుకుంది. ఇప్పటివరకు ఏ జట్టుకూ సాధ్యం కానిది రోహిత్ సేన చేసి చూపించింది.

India vs South Africa: భారత జట్టు చరిత్ర సృష్టించింది. సౌతాఫ్రికాతో జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్​లో మన టీమ్ అరుదైన ఘనతను అందుకుంది. ఇప్పటివరకు ఏ జట్టుకూ సాధ్యం కానిది రోహిత్ సేన చేసి చూపించింది.

  • Published Jun 29, 2024 | 9:58 PMUpdated Jun 29, 2024 | 9:58 PM
చరిత్ర సృష్టించిన టీమిండియా.. వరల్డ్ కప్ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైమ్!

భారత జట్టు చరిత్ర సృష్టించింది. సౌతాఫ్రికాతో జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్​లో మన టీమ్ అరుదైన ఘనతను అందుకుంది. ఇప్పటివరకు ఏ జట్టుకూ సాధ్యం కానిది రోహిత్ సేన చేసి చూపించింది. తుదిపోరులో తొలుత బ్యాటింగ్​కు దిగిన మెన్ ఇన్ బ్లూ ఓవర్లన్నీ ఆడి 7 వికెట్లకు 176 పరుగుల భారీ స్కోరు చేసింది. వరల్డ్ కప్ ఫైనల్ హిస్టరీలో ఇదే హయ్యెస్ట్ స్కోరు. పొట్టి కప్పు ఫైనల్ చరిత్రలో ఏ జట్టు కూడా ఇప్పటివరకు ఇంత స్కోరు చేయలేదు. దీంతో ఇది ఎప్పటికీ నిలిచిపోయే రికార్డుగా మారింది. ఇక, ఫైనల్ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన భారత్​కు మంచి స్టార్ట్ దొరికింది. కోహ్లీ-రోహిత్ ఫస్ట్ బాల్ నుంచే అటాకింగ్​కు దిగారు.

రోహిత్-కోహ్లీ కలసి తొలి వికెట్​కు 1.4 ఓవర్లలోనే 23 పరుగులు జోడించారు. ఆ తర్వాత హిట్​మ్యాన్ (9) ఔటైనా విరాట్ క్రీజులో పాతుకుపోయాడు. యాంకర్ ఇన్నింగ్స్ ఆడిన కింగ్.. ఆఖర్లో జూలు విదిల్చాడు. వచ్చిన బాల్​ను వచ్చినట్లు స్టాండ్స్​కు పంపించాడు. మొత్తంగా 59 బంతులు ఎదుర్కొన్న అతడు 76 పరుగులు చేశాడు. ఇందులో 6 బౌండరీలతో పాటు 2 భారీ సిక్సులు ఉన్నాయి. ఆఖర్లో శివమ్ దూబె (16 బంతుల్లో 27) కూడా మెరుపులు మెరిపించాడు. అయితే భారత ఇన్నింగ్స్​లో స్పెషల్ అంటే అక్షర్ పటేల్ (31 బంతుల్లో 47) బ్యాటింగ్ అనే చెప్పాలి. కోహ్లీని ఒక ఎండ్​లో ఉంచి అతడు బిగ్ షాట్స్​తో అలరించాడు. ఏకంగా 4 సిక్సులు బాదాడతను. మరి.. భారత్ నయా రికార్డుపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.