Nidhan
13 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న వరల్డ్ కప్ కలను నిజం చేసుకుంది టీమిండియా. నిన్న జరిగిన పొట్టి కప్పు ఫైనల్లో సౌతాఫ్రికాను 7 పరుగుల తేడాతో చిత్తు చేసి ఛాంపియన్‌గా అవతరించింది.
13 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న వరల్డ్ కప్ కలను నిజం చేసుకుంది టీమిండియా. నిన్న జరిగిన పొట్టి కప్పు ఫైనల్లో సౌతాఫ్రికాను 7 పరుగుల తేడాతో చిత్తు చేసి ఛాంపియన్‌గా అవతరించింది.
Nidhan
13 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న వరల్డ్ కప్ కలను నిజం చేసుకుంది టీమిండియా. నిన్న జరిగిన పొట్టి కప్పు ఫైనల్లో సౌతాఫ్రికాను 7 పరుగుల తేడాతో చిత్తు చేసి ఛాంపియన్‌గా అవతరించింది. 2007లో జరిగిన అరంగేట్ర టీ20 వరల్డ్ కప్‌ను ముద్దాడిన భారత్.. మళ్లీ 17 ఏళ్ల తర్వాత ఈ ఫార్మాట్లో జగజ్జేతగా నిలిచింది. దీంతో దేశమంతటా సంబురాలు మిన్నంటాయి. రోహిత్ సేన విజయంతో కోట్లాది మంది భారతీయులు ఆనందంతో కేరింతలు కొట్టారు. చిన్న పిల్లల్లా మారి సంబురాలు చేసుకున్నారు. అయితే ఈ గెలుపు అంత ఈజీగా రాలేదు. సౌతాఫ్రికా ఆఖరి బంతి వరకు పోరాడటంతో ఫైనల్ మ్యాచ్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గెలుపు కోసం భారత ఆటగాళ్లు తమ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టారు. కెప్టెన్ రోహిత్ ఫీల్డ్ పొజిషన్స్, బౌలింగ్ ఛేంజెస్ వల్ల ప్రొటీస్ ఆఖరికి మన ముందు తల వంచక తప్పలేదు.
టీమిండియా విజయంలో రోహిత్, విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ ఇలా చాలా మంది కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. టీమ్ ఎఫర్ట్ వల్లే సౌతాఫ్రికాను మట్టికరిపించింది భారత్. అయితే మ్యాచ్‌లో అసలైన హీరోగా నిలిచాడు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా. బ్యాటింగ్‌లో 2 బంతుల్లో 5 పరుగులు చేసిన అతడు.. బౌలింగ్‌లో 3 ఓవర్లు వేసి 20 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. లాస్ట్ ఓవర్లో 9 పరుగులు ఇచ్చి ఇద్దరు బ్యాటర్లను ఔట్ చేశాడు. మ్యాచ్‌ను లాక్కొనే ప్రయత్నం చేసిన క్లాసెన్ (27 బంతుల్లో 52), డేవిడ్ మిల్లర్ (17 బంతుల్లో 21)ను ఔట్ చేసి భారత్‌కు రియల్ హీరోగా మారాడు హార్దిక్. మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ అతడు ఎమోషనల్ అయ్యాడు. కన్నీటి పర్యంతం అయ్యాడు. ఫస్ట్ టైమ్ ట్రోలింగ్‌పై అతడు నోరు విప్పాడు. ఎన్ని విమర్శలైనా సరే.. ఒక్క విజయంతో ఎగిరిపోతాయని నమ్మానని అన్నాడు.
‘ఇది ఎంతో ఎమోషనల్ మూమెంట్. మేం చాలా కష్టపడుతూ వచ్చాం. అయినా ఎందుకో గతంలో కప్పు అందుకోలేకపోయాం. కానీ ఇవాళ మేం దాన్ని సాధించాం. మొత్తం దేశానికి ఇది ఎంతో గర్వకారణం. ఇది నాకెంతో స్పెషల్ టోర్నమెంట్. గత 6 నెలలు నాకెంతో కష్టంగా గడిచింది. అయినా నేను ఏ రోజూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేను బాగా కష్టపడి చేయాల్సిన పనిని చేస్తూ పోతే మార్పు వస్తుందని అర్థం చేసుకున్నా. అవకాశాల్ని అందిపుచ్చుకొని సత్తా చాటడం వల్లే ఇది సాధ్యమైంది. అనుకున్న ప్లాన్స్‌ను అమలు చేయడం, కఠిన సమయాల్లోనూ ప్రశాంతంగా ఉండటం, మన మీద ఉండే ప్రెజర్‌ను అవతలి జట్టు మీద నెట్టడం చేశాం కాబట్టే ఇంత సక్సెస్ అయ్యాం’ అని పాండ్యా చెప్పుకొచ్చాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ వివాదం కారణంగా ఐపీఎల్-2024 టైమ్‌లో హార్దిక్‌పై విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. ఆ టోర్నీలో ఫెయిలవడంతో అతడ్ని వరల్డ్ కప్‌లోకి తీసుకెళ్లొద్దు అంటూ డిమాండ్లు వచ్చాయి. కానీ ఇప్పుడు అతడే జట్టుకు కప్పు అందించి హీరో అయ్యాడు.