Nidhan
సౌతాఫ్రికాతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను టీమిండియా ఓటమితో మొదలుపెట్టింది. తొలి మ్యాచ్‌లో ప్రొటీస్ చేతిలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. అయితే ఈ ఓటమికి బ్యాటర్లే కారణమని అంతా అనుకుంటున్నారు. కానీ ఇద్దరు ప్లేయర్ల వైఫల్యం దెబ్బతీసిందని అర్థం చేసుకోవాలి. ఆ ఇద్దరూ ఎవరంటే..?
సౌతాఫ్రికాతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను టీమిండియా ఓటమితో మొదలుపెట్టింది. తొలి మ్యాచ్‌లో ప్రొటీస్ చేతిలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. అయితే ఈ ఓటమికి బ్యాటర్లే కారణమని అంతా అనుకుంటున్నారు. కానీ ఇద్దరు ప్లేయర్ల వైఫల్యం దెబ్బతీసిందని అర్థం చేసుకోవాలి. ఆ ఇద్దరూ ఎవరంటే..?
Nidhan
సౌతాఫ్రికా గడ్డ మీద టెస్ట్ సిరీస్ నెగ్గాలన్న భారత్ కోరిక అలాగే ఉండిపోయింది. 31 ఏళ్లలో తొలిసారి సిరీస్ గెలవాలన్న టీమిండియాకు ఆశలు అడియాశలయ్యాయి. బ్యాట్‌తో, బాల్‌తో ఘోరంగా ఫెయిలైన మన జట్టు ఫస్ట్ టెస్ట్‌లో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ సిరీస్‌లో మరో టెస్ట్ జరగాల్సి ఉంది. ఒకవేళ అందులో టీమిండియా నెగ్గినా సమం అవుతుందే గానీ సిరీస్ సొంతమవదు. కాబట్టి తొలి మ్యాచ్‌లోనే భారత్ నెగ్గాల్సింది. కానీ అన్ని రంగాల్లోనూ విఫలమైన మన టీమ్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. మూడో రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ కంటిన్యూ చేసిన సౌతాఫ్రికా 408 రన్స్‌కు ఆలౌట్ అయింది. 163 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన రోహిత్ సేన.. 131 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ ఓటమికి అందరూ కారణాలు వెతకడం స్టార్ట్ చేశారు. అయితే చాలా మంది బ్యాటర్లనే విమర్శిస్తున్నారు గానీ ఆ ఇద్దరి ఫెయిల్యూర్‌ను పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.
నెటిజన్స్‌తో పాటు అభిమానులు భారత బ్యాటర్ల తీరును తప్పుబడుతున్నారు. వాళ్ల ఫెయిల్యూర్ వల్లే టీమిండియా ఓడిపోయిందని అంటున్నారు. కానీ ఇద్దరు ఆటగాళ్ల వైఫల్యాన్ని గమనించడం లేదు. ఆ ప్లేయర్లు మరెవరో కాదు.. శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ. ఈ మ్యాచ్‌లో శార్దూల్ 19 ఓవర్లు వేసి ఏకంగా 101 రన్స్ ఇచ్చుకున్నాడు. ప్రసిద్ధ్ 20 ఓవర్లు వేసి 93 పరుగులు ఇచ్చుకున్నాడు. వీళ్లిద్దరూ మూడో రోజు మార్నింగ్ సెషన్లో ధారాళంగా పరుగులిచ్చారు. పస లేని వీరి బౌలింగ్‌ను డీన్ ఎల్గర్, యాన్సెన్ నిర్దాక్షిణ్యంగా శిక్షించారు. శార్దూల్, ప్రసిద్ధ్‌లు లైన్ అండ్ లెంగ్త్ తప్పారు. సౌతాఫ్రికాలోని కండీషన్స్‌ను ఉపయోగించుకుంటూ బంతిని బలంగా గుద్ది ఎక్స్ట్రా బౌన్స్ రాబడతాడనే ఉద్దేశంతో ప్రసిద్ధ్‌ను టీమ్‌లోకి తీసుకున్నారు. కానీ అందులో అతడు పూర్తిగా ఫెయిలయ్యాడు.
పొడగరి అయిన ప్రసిద్ధ్ కృష్ణ బౌన్సర్లతో ప్రొటీస్ బ్యాటర్లను ఇబ్బంది పెడతాడని టీమ్ మేనేజ్మెంట్ భావించింది. కానీ అతడు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. శార్దూల్ అయితే అటు బౌలింగ్‌తో పాటు ఇటు బ్యాటింగ్‌లోనూ తేలిపోయాడు. బౌలింగ్‌లో భారీగా పరుగులు ఇచ్చుకున్న శార్దూల్.. బ్యాట్‌తోనూ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. మరో పేసర్ మహ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీసినా ఎక్కువ రన్స్ ఇచ్చుకున్నాడు. దీంతో బుమ్రా ఒంటరివాడు అయ్యాడు. ఇంకో ఎండ్ నుంచి సహకారం లేకపోవడంతో అతడు ఏమీ చేయలేకపోయాడు. ఫస్ట్ టెస్ట్‌లో దారుణ ఓటమికి బ్యాటర్ల ఫెయిల్యూరే ప్రధాన కారణమైనా.. బౌలర్లు రాణించి ఉంటే పోరాడే ఛాన్స్ ఉండేది. ఈ టెస్ట్ ఓటమి నుంచి టీమిండియా ఎంత త్వరగా బయటపడుతుందనేది ఇంట్రెస్టింగ్గా మారింది. మరి.. ఫస్ట్ టెస్ట్‌లో భారత్ ఓటమికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయని మీరు భావిస్తున్నట్లయితే కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: AUS vs PAK: ఒక్క బాల్కి 5 రన్స్! నో బాల్ కాదు, బౌండరీ పోలేదు.. జస్ట్ పాకిస్థాన్ థింగ్స్!