IND vs SA: అలెన్ డొనాల్డ్ మాట నిజమైంది.. ఆయన చెప్పినట్లే ఓడిన భారత్!

సౌతాఫ్రికా లెజెండ్ అలెన్ డొనాల్డ్ చెప్పిన మాట నిజమైంది. ఆయన అన్నట్లే తొలి టెస్టులో ప్రొటీస్ చేతుల్లో భారత్ చిత్తుగా ఓడింది. ఆ ప్లేయర్ లేకపోవడం రోహిత్ సేనను దెబ్బతీస్తుందంటూ డొనాల్డ్ చేసిన కామెంట్స్ నిజమయ్యాయి.

సౌతాఫ్రికా లెజెండ్ అలెన్ డొనాల్డ్ చెప్పిన మాట నిజమైంది. ఆయన అన్నట్లే తొలి టెస్టులో ప్రొటీస్ చేతుల్లో భారత్ చిత్తుగా ఓడింది. ఆ ప్లేయర్ లేకపోవడం రోహిత్ సేనను దెబ్బతీస్తుందంటూ డొనాల్డ్ చేసిన కామెంట్స్ నిజమయ్యాయి.

సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓడిన తీరును అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. విదేశాల్లో టెస్ట్ మ్యాచుల్లో ఓడటం మామూలే అయినప్పటికీ.. ఇంత చిత్తుగా ఓడుతుందని ఎవరూ ఎక్స్​పెక్ట్ చేయలేదు. అసలు ఏమాత్రం ఫైట్ చేయకుండా ప్రొటీస్ ముందు తలొగ్గడాన్ని ఫ్యాన్స్ డైజెస్ట్ చేసుకోవట్లేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శుబ్​మన్ గిల్, జస్​ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్ లాంటి స్టార్లు టీమ్​లో ఉన్నా ఇలా దారుణంగా ఓడిపోవడం ఏంటని షాకవుతున్నారు. అదే టైమ్​లో సౌతాఫ్రికా లెజెండరీ పేసర్ అలెన్ డొనాల్డ్ మాటల్ని గుర్తుచేసుకుంటున్నారు. ఆయన చెప్పినట్లే భారత్ ఓడిపోయిందని అంటున్నారు. అసలు ఫస్ట్ టెస్ట్​కు ముందు డొనాల్డ్ ఏం చెప్పాడు? అనేది ఇప్పుడు చూద్దాం..

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్​లో సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీని ఆడించకుండా భారత్ పెద్ద తప్పు చేసిందని డొనాల్డ్ అన్నాడు. షమీకి తాను పెద్ద ఫ్యాన్​నని చెప్పాడు. సీమ్ బంతుల్ని పర్ఫెక్ట్​గా వేయగల షమి లాంటి మరో బౌలర్ ఈ రోజుల్లో ఒక్కడూ లేడని మెచ్చుకున్నాడు. అతడ్ని టీమిండియా తప్పక మిస్సవుతుందని డొనాల్డ్ తెలిపాడు. ఈ సిరీస్​కు షమీని అందుబాటులో ఉంచకపోవడం సిగ్గుచేటు అని విమర్శించాడు. సౌతాఫ్రికా కండీషన్స్ షమి బౌలింగ్​కు పర్ఫెక్ట్​గా సూట్ అయ్యేవన్నాడు. షమి లేని లోటు పూడ్చలేనిదని.. భారత్​కు ఓటమి తప్పదని హెచ్చరించాడు. అతడు చెప్పినట్లే ఫస్ట్ టెస్టులో రోహిత్ సేన ఓడిపోయింది. జస్​ప్రీత్ బుమ్రా ఒక్కడు తప్పితే మిగతా పేసర్లంతా ఫెయిలయ్యారు. సిరాజ్ వికెట్లు తీసినా భారీగా రన్స్ ఇచ్చుకున్నాడు.

ప్రసిద్ధ్​ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్​లో పూర్తిగా తేలిపోయారు. వీళ్లిద్దరూ ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు. దీంతో భారత ఫ్యాన్స్ డొనాల్డ్ మాటల్ని గుర్తుచేసుకుంటున్నారు. షమి ఉంటే సౌతాఫ్రికా బ్యాటర్లను పోయించేవాడని.. బుమ్రాకు అతడు తోడుగా ఉండుంటే మ్యాచ్​లో రిజల్ట్ మరోలా ఉండేదని చెబుతున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కూడా షమి ఆడకపోవడంపై రియాక్ట్ అయ్యాడు. తొలి టెస్టులో షమి సేవల్ని భారత్ బాగా మిస్సయిందన్నాడు. అతడు ఆడి ఉంటే స్టోరీ వేరేలా ఉండేదన్నాడు. కాగా, గాయం కారణంగా సఫారీ టూర్​ నుంచి షమి వైదొలిగిన సంగతి తెలిసిందే. ముంబైలో సర్జరీ చేయించుకున్నా ఇంకా కోలుకోకపోవడంతో అతడ్ని దూరంగా ఉంచారు. అయితే షమి ఇంజ్యురీపై కాస్త ముందే రియాక్ట్ అయి ఉంటే ఈపాటికి కోలుకునేవాడని కామెంట్స్ వినిపించాయి. మరి.. షమీని ఆడించకుండా భారత్ తప్పు చేసిందంటూ డొనాల్డ్ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IND vs SA: టీమిండియా ఓటమికి బ్యాటర్లే కారణమా? వాళ్లిద్దరి వైఫల్యం కనిపించట్లేదా?

Show comments