iDreamPost

IND vs SA: టీమిండియా ఓటమికి బ్యాటర్లే కారణమా? వాళ్లిద్దరి వైఫల్యం కనిపించట్లేదా?

  • Published Dec 29, 2023 | 5:47 PMUpdated Dec 29, 2023 | 5:47 PM

సౌతాఫ్రికాతో రెండు టెస్ట్​ల సిరీస్​ను టీమిండియా ఓటమితో మొదలుపెట్టింది. తొలి మ్యాచ్​లో ప్రొటీస్ చేతిలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. అయితే ఈ ఓటమికి బ్యాటర్లే కారణమని అంతా అనుకుంటున్నారు. కానీ ఇద్దరు ప్లేయర్ల వైఫల్యం దెబ్బతీసిందని అర్థం చేసుకోవాలి. ఆ ఇద్దరూ ఎవరంటే..?

సౌతాఫ్రికాతో రెండు టెస్ట్​ల సిరీస్​ను టీమిండియా ఓటమితో మొదలుపెట్టింది. తొలి మ్యాచ్​లో ప్రొటీస్ చేతిలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. అయితే ఈ ఓటమికి బ్యాటర్లే కారణమని అంతా అనుకుంటున్నారు. కానీ ఇద్దరు ప్లేయర్ల వైఫల్యం దెబ్బతీసిందని అర్థం చేసుకోవాలి. ఆ ఇద్దరూ ఎవరంటే..?

  • Published Dec 29, 2023 | 5:47 PMUpdated Dec 29, 2023 | 5:47 PM
IND vs SA: టీమిండియా ఓటమికి బ్యాటర్లే కారణమా? వాళ్లిద్దరి వైఫల్యం కనిపించట్లేదా?

సౌతాఫ్రికా గడ్డ మీద టెస్ట్ సిరీస్ నెగ్గాలన్న భారత్ కోరిక అలాగే ఉండిపోయింది. 31 ఏళ్లలో తొలిసారి సిరీస్​ గెలవాలన్న టీమిండియాకు ఆశలు అడియాశలయ్యాయి. బ్యాట్​తో, బాల్​తో ఘోరంగా ఫెయిలైన మన జట్టు ఫస్ట్ టెస్ట్​లో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ సిరీస్​లో మరో టెస్ట్ జరగాల్సి ఉంది. ఒకవేళ అందులో టీమిండియా నెగ్గినా సమం అవుతుందే గానీ సిరీస్ సొంతమవదు. కాబట్టి తొలి మ్యాచ్​లోనే భారత్ నెగ్గాల్సింది. కానీ అన్ని రంగాల్లోనూ విఫలమైన మన టీమ్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. మూడో రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ కంటిన్యూ చేసిన సౌతాఫ్రికా 408 రన్స్​కు ఆలౌట్ అయింది. 163 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్​ మొదలుపెట్టిన రోహిత్ సేన.. 131 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ ఓటమికి అందరూ కారణాలు వెతకడం స్టార్ట్ చేశారు. అయితే చాలా మంది బ్యాటర్లనే విమర్శిస్తున్నారు గానీ ఆ ఇద్దరి ఫెయిల్యూర్​ను పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.

నెటిజన్స్​తో పాటు అభిమానులు భారత బ్యాటర్ల తీరును తప్పుబడుతున్నారు. వాళ్ల ఫెయిల్యూర్ వల్లే టీమిండియా ఓడిపోయిందని అంటున్నారు. కానీ ఇద్దరు ఆటగాళ్ల వైఫల్యాన్ని గమనించడం లేదు. ఆ ప్లేయర్లు మరెవరో కాదు.. శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ. ఈ మ్యాచ్​లో శార్దూల్ 19 ఓవర్లు వేసి ఏకంగా 101 రన్స్ ఇచ్చుకున్నాడు. ప్రసిద్ధ్ 20 ఓవర్లు వేసి 93 పరుగులు ఇచ్చుకున్నాడు. వీళ్లిద్దరూ మూడో రోజు మార్నింగ్ సెషన్​లో ధారాళంగా పరుగులిచ్చారు. పస లేని వీరి బౌలింగ్​ను డీన్ ఎల్గర్​, యాన్సెన్ నిర్దాక్షిణ్యంగా శిక్షించారు. శార్దూల్, ప్రసిద్ధ్​లు లైన్ అండ్ లెంగ్త్ తప్పారు. సౌతాఫ్రికాలోని కండీషన్స్​ను ఉపయోగించుకుంటూ బంతిని బలంగా గుద్ది ఎక్స్​ట్రా బౌన్స్ రాబడతాడనే ఉద్దేశంతో ప్రసిద్ధ్​ను టీమ్​లోకి తీసుకున్నారు. కానీ అందులో అతడు పూర్తిగా ఫెయిలయ్యాడు.

inida bowlers failed

పొడగరి అయిన ప్రసిద్ధ్​ కృష్ణ బౌన్సర్లతో ప్రొటీస్ బ్యాటర్లను ఇబ్బంది పెడతాడని టీమ్ మేనేజ్​మెంట్ భావించింది. కానీ అతడు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. శార్దూల్ అయితే అటు బౌలింగ్​తో పాటు ఇటు బ్యాటింగ్​లోనూ తేలిపోయాడు. బౌలింగ్​లో భారీగా పరుగులు ఇచ్చుకున్న శార్దూల్.. బ్యాట్​తోనూ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. మరో పేసర్ మహ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీసినా ఎక్కువ రన్స్ ఇచ్చుకున్నాడు. దీంతో బుమ్రా ఒంటరివాడు అయ్యాడు. ఇంకో ఎండ్​ నుంచి సహకారం లేకపోవడంతో అతడు ఏమీ చేయలేకపోయాడు. ఫస్ట్ టెస్ట్​లో దారుణ ఓటమికి బ్యాటర్ల ఫెయిల్యూరే ప్రధాన కారణమైనా.. బౌలర్లు రాణించి ఉంటే పోరాడే ఛాన్స్ ఉండేది. ఈ టెస్ట్ ఓటమి నుంచి టీమిండియా ఎంత త్వరగా బయటపడుతుందనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. మరి.. ఫస్ట్ టెస్ట్​లో భారత్ ఓటమికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయని మీరు భావిస్తున్నట్లయితే కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: AUS vs PAK: ఒక్క బాల్‌కి 5 రన్స్‌! నో బాల్‌ కాదు, బౌండరీ పోలేదు.. జస్ట్‌ పాకిస్థాన్‌ థింగ్స్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి