Nidhan
సౌతాఫ్రికాతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను సమం చేసి జోష్‌లో ఉన్న టీమిండియాకు భారీ షాక్ తగిలింది. వన్డే, టెస్ట్ సిరీస్‌లకు ముందు ఇది భారత్‌కు గట్టి ఎదురుదెబ్బే అని చెప్పాలి.
సౌతాఫ్రికాతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను సమం చేసి జోష్‌లో ఉన్న టీమిండియాకు భారీ షాక్ తగిలింది. వన్డే, టెస్ట్ సిరీస్‌లకు ముందు ఇది భారత్‌కు గట్టి ఎదురుదెబ్బే అని చెప్పాలి.
Nidhan
సౌతాఫ్రికా టూర్‌ను పాజిటివ్‌గా స్టార్ట్ చేసింది టీమిండియా. ప్రొటీస్‌తో మూడు టీ20ల సిరీస్‌ను 1-1తో సమం చేసి మంచి జోష్‌లో ఉంది. మొదటి మ్యాచ్ వాన వల్ల రద్దవగా.. రెండో మ్యాచ్‌లో పోరాడి ఓడింది భారత్. తప్పక నెగ్గాల్సిన ఆఖరి టీ20లో ఆతిథ్య టీమ్‌ను 106 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ కలిగిన సౌతాఫ్రికాను కేవలం 95 రన్స్‌కే ఆలౌట్ చేసింది. ఈ మ్యాచ్‌లో విజయంతో ఊపు మీదున్న భారత్.. తుదపరి జరిగే మూడు వన్డేల సిరీస్‌కు సన్నద్ధం అవుతోంది. ఈ రెండు టీమ్స్ మధ్య డిసెంబర్ 17 నుంచి వన్డే సిరీస్ మొదలు కానుంది. ఆ తర్వాత రెండు టెస్టు మ్యాచ్‌లు కూడా జరగనున్నాయి. అయితే వన్డే, టెస్ట్ సిరీస్‌కు ముందు భారత జట్టుకు గట్టి షాక్ తగిలింది. ఇద్దరు స్టార్ ప్లేయర్లు టీమ్‌కు దూరమయ్యారు.
ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో దుమ్మురేపిన వెటరన్ పేసర్ మహ్మద్ షమి సౌతాఫ్రికాతో టెస్టులకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ బోర్డు శనివారం అధికారికంగా ధృవీకరించింది. మోకాలి గాయంతో ఇబ్బంది పడుతున్న షమి ఫిట్నెస్ మీద టీమ్ ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదని.. అందుకే అతడు సౌతాఫ్రికాకు వెళ్లడం లేదని ఓ ప్రకటనలో బీసీసీఐ వెల్లడించింది. షమీతో పాటు యంగ్ పేసర్ దీపక్ చాహర్ కూడా టీమ్‌కు దూరమయ్యాడు. ప్రొటీస్‌తో జరగనున్న వన్డే సిరీస్ నుంచి అతడు తప్పుకున్నాడు. పర్సనల్ రీజన్స్ వల్ల సఫారీ టూర్‌కు దూరంగా ఉండాలని చాహర్ డిసైడ్ అయ్యాడు. దీంతో అతడి స్థానంలో బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్‌ను సౌతాఫ్రికాకు పంపాలని బీసీసీఐ నిర్ణయించుకుంది. దీపక్ చాహర్ తండ్రి ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. దీంతో అతడ్ని దగ్గర ఉండి చూసుకుంటున్న చాహర్.. వన్డే సిరీస్ నుంచి వైదొలిగాడు.
వన్డే సిరీస్ మొదలయ్యే లోపు తన నాన్న కోలుకుంటే సౌతాఫ్రికాకు వెళ్లాలని చాహర్ అనుకున్నాడు. కానీ కుదరకపోవడంతో ఈ సిరీస్ నుంచి తప్పకున్నాడు. మోకాలి నొప్పితో బాధపడుతున్న షమి కూడా ఇటీవలే ముంబైలో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయ్యే లోపు ఊరటగా అనిపిస్తే సౌతాఫ్రికాకు వెళ్లాలని అతడు అనుకున్నాడు. కానీ గాయం పూర్తిగా మానకపోవడంతో ఆగిపోయాడు. ఇది టీమిండియాకు బిగ్ షాక్ అనే చెప్పాలి. సౌతాఫ్రికాను వాళ్ల సొంత గడ్డ మీద టెస్టుల్లో ఆడించాలంటే షమి లాంటి ఎక్స్‌పీరియెన్స్ ఉన్న బౌలర్ చాలా అసవరం. కానీ గాయం వల్ల అతడు అందుబాటులో లేకపోవడంతో ఈ లోటును భారత్ ఎలా భర్తీ చేస్తుందో చూడాలి. మరి.. షమి లేకపోయినా సఫారీలను టెస్టుల్లో టీమిండియా మట్టికరిపిస్తుందని మీరు భావిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Hardik Pandya: హార్దిక్‌ను కెప్టెన్ చేయడంతో ముంబైకి షాకిచ్చిన ఫ్యాన్స్.. ఇది అస్సలు ఊహించి ఉండరు!
🚨 NEWS 🚨
Deepak Chahar withdrawn from the ODI series; Mohd. Shami ruled out of the Test series.
Details 🔽 #TeamIndia | #SAvIND https://t.co/WV86L6Cnmt pic.twitter.com/oGdSJk9KLK
— BCCI (@BCCI) December 16, 2023