iDreamPost
android-app
ios-app

IND vs SA: వన్డే సిరీస్ మనదే.. టీమిండియా ఘనవిజయానికి 5 ప్రధాన కారణాలు!

  • Published Dec 22, 2023 | 7:54 AM Updated Updated Dec 22, 2023 | 7:54 AM

వన్డే సిరీస్​ మనదే అయింది. ఆఖరి మ్యాచ్​లో సౌతాఫ్రికాను ఓడించి సిరీస్ పట్టేశారు భారత కుర్రాళ్లు. చివరి వన్డేలో టీమిండియా విజయానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

వన్డే సిరీస్​ మనదే అయింది. ఆఖరి మ్యాచ్​లో సౌతాఫ్రికాను ఓడించి సిరీస్ పట్టేశారు భారత కుర్రాళ్లు. చివరి వన్డేలో టీమిండియా విజయానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Dec 22, 2023 | 7:54 AMUpdated Dec 22, 2023 | 7:54 AM
IND vs SA: వన్డే సిరీస్ మనదే.. టీమిండియా ఘనవిజయానికి 5 ప్రధాన కారణాలు!

సఫారీ టూర్​లో భారత్ తొలి సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. సౌతాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్​ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. గురువారం జరిగిన చివరి మ్యాచ్​లో టీమిండియా 78 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఐపీఎల్ ప్లేయర్ల రిటెన్షన్, మినీ ఆక్షన్ హడావుడిలో ఈ సిరీస్​ గురించి పెద్దగా మాట్లాడుకోవట్లేదు. కానీ యంగ్​స్టర్స్​తో కూడిన టీమిండియా.. స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్, మంచి బౌలింగ్​ యూనిట్ కలిగిన ప్రొటీస్​ను మట్టికరిపించిన తీరు హైలైట్ అనే చెప్పాలి. గత పర్యటనలో ఇదే కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో ఫుల్ స్ట్రెంగ్త్​తో ఆడినా సిరీస్ ఓడిన భారత్.. ఈసారి యువకులతో వచ్చి సౌతాఫ్రికాను చిత్తు చేసింది. గెలవాలన్న కసి, బాగా ఆడాలన్న పట్టుదలే దీనికి కారణమని చెప్పాలి. ఇక, ఆఖరి వన్డేలో భారత్ విజయానికి 5 కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

చివరి వన్డేలో టీమిండియా సక్సెస్​కు ప్రధాన కారణం బ్యాటింగ్. ఈ మ్యాచ్​లో మన బ్యాటర్లు బాగా పెర్ఫార్మ్ చేశారు. నయా ఓపెనర్లు రజత్ పాటిదార్ (22), సాయి సుదర్శన్ (10) క్విక్ స్టార్ట్ అందించారు. వీళ్లు త్వరగా ఔటైనా స్లో పిచ్ మీద ఇది మంచి ఆరంభమనే చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన సంజూ శాంసన్ (108) కెరీర్​లో ఫస్ట్ సెంచరీతో చెలరేగాడు. కేఎల్ రాహుల్ (21), తిలక్ వర్మ (52)తో కలసి మంచి పార్ట్​నర్​షిప్స్ నమోదు చేశాడు. స్లోగా ఇన్నింగ్స్​ను బిల్డ్ చేస్తూ పోయిన సంజూకు తిలక్ సహకారం అందించాడు. ఆఖర్లో రింకూ సింగ్ (38) బిగ్ షాట్స్ ఆడటం, అతడికి తోడు టెయిలెండర్లూ తలో చేయి వేయడంతో ప్రొటీస్ ముందు 296 రన్స్ బిగ్ టార్గెట్​ను ఉంచగలిగింది భారత్.

5 reasons for india winning

భారత్ విజయంలో మరో ప్రధాన కారణం సంజూ శాంసన్ ఇన్నింగ్స్. స్లో పిచ్ మీద బ్యాటింగ్ చేయడం కష్టంగా మారింది. గ్రౌండ్ పెద్దగా ఉండటంతో భారీ షాట్స్ ఆడితే క్యాచ్​లు అయ్యే ప్రమాదం ఉంది. వికెట్ నుంచి పేస్, స్పిన్​కు సపోర్ట్ దొరకడంతో ఒక్కో రన్ చేసేందుకు బ్యాటర్లు తీవ్రంగా శ్రమించారు. ఫస్ట్ డౌన్​లో వచ్చిన సంజూ పట్టుదలతో బ్యాటింగ్ చేశాడు. బర్గర్, హెండ్రిక్స్ బౌలింగ్​లో అతడు కొన్ని పుల్ షాట్స్ మ్యాచ్​కే హైలైట్ అని చెప్పాలి. వాళ్లిద్దరితో పాటు సీనియర్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్​నూ దీటుగా ఎదుర్కొని రన్స్ చేశాడు సంజూ. చాన్నాళ్ల తర్వాత వచ్చిన ఛాన్స్​ను సద్వినియోగం చేసుకొని శతకం సాధించాడు. తద్వారా ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సెలక్షన్​ రేసులో తానూ ఉన్నానని చాటాడు. టీమిండియా విజయానికి మూడో కారణం బౌలింగ్. బోల్డన్ పార్క్ స్టేడియంలోని పిచ్ నుంచి పేసర్లు, స్పిన్​కు మద్దతు దొరికింది. కానీ పిచ్ మీద పెద్దగా బౌన్స్ లేదు. దీంతో అర్ష్​దీప్ సింగ్ (4/30) తన బలమైన స్వింగ్, స్లో బాల్స్​ను నమ్ముకొని సఫారీ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు.

అర్ష్​దీప్​కు తోడుగా అవేశ్ ఖాన్ (2/45), ముకేశ్ కుమార్ (1/56) రాణించడంతో భారత్​కు తిరుగులేకపోయింది. ముకేశ్ ఎక్కువ రన్స్ ఇచ్చినప్పటికీ గాల్లో బాల్​ను స్వింగ్ చేస్తూ సౌతాఫ్రికా బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. దీని వల్ల మిగతా బౌలర్లకు వికెట్లు పడ్డాయి. స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్ (2/38), అక్షర్ పటేల్ (1/48) కీలక వికెట్లు తీసి గెలుపులో తమ వంతు పాత్ర పోషించారు. ఈ మ్యాచ్​లో టీమిండియా గెలుపునకు మరో కారణం కెప్టెన్సీ. ఈ సిరీస్ మొత్తం ఎంతో ఇన్వాల్వ్​డ్​గా కనిపించిన కేఎల్ రాహుల్.. ఆఖరి మ్యాచ్​లో మరింత రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. బ్యాటింగ్​లో ఫెయిలైనా సారథ్యంతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్​లో కీపింగ్​ బాధ్యతలు తీసుకొని వికెట్ల వెనుక నుంచి వ్యూహాలు రచిస్తూ, బౌలర్లకు సలహాలు ఇస్తూ కనిపించాడు. డీఆర్ఎస్ విషయంలోనూ బౌలర్లకు సపోర్ట్​గా ఉండి సక్సెస్ అయ్యాడు. పిచ్ నుంచి రెండో ఇన్నింగ్స్​లో భారత బౌలర్లకు కాస్త ఎక్కువ మద్దతు లభించడమూ భారత్ విజయానికి మరో కారణంగా చెప్పొచ్చు. మరి.. వన్డే సిరీస్ ఆఖరి మ్యాచ్​లో టీమిండియా గెలుపునకు ఇంకేమైనా కారణాలు ఉన్నాయని మీరు భావిస్తున్నట్లయితే కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IND vs SA: KL రాహుల్ అరుదైన ఘనత.. 14 ఏళ్ల తర్వాత