iDreamPost
android-app
ios-app

India vs South Africa: సౌతాఫ్రికాతో తొలి వన్డేలో టీమిండియా విజయానికి 5 కారణాలు ఇవే..!

  • Published Dec 18, 2023 | 10:01 AM Updated Updated Dec 18, 2023 | 1:33 PM

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్​లో టీమిండియా బోణీ కొట్టింది. స్టార్ ప్లేయర్లతో నిండిన సఫారీ టీమ్​ను చిత్తుగా ఓడించింది. ఈ నేపథ్యంలో భారత్ విజయానికి గల 5 కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్​లో టీమిండియా బోణీ కొట్టింది. స్టార్ ప్లేయర్లతో నిండిన సఫారీ టీమ్​ను చిత్తుగా ఓడించింది. ఈ నేపథ్యంలో భారత్ విజయానికి గల 5 కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Dec 18, 2023 | 10:01 AMUpdated Dec 18, 2023 | 1:33 PM
India vs South Africa: సౌతాఫ్రికాతో తొలి వన్డేలో టీమిండియా విజయానికి 5 కారణాలు ఇవే..!

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్​ను సమం చేసిన జోష్​లో ఉన్న టీమిండియా వన్డే సిరీస్​లో బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన తొలి వన్డేలో ప్రొటీస్​ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్​లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు 27.3 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అర్ష్​దీప్ సింగ్ (5/37), అవేశ్ ఖాన్ (4/27) చెలరేగిపోయారు. ఇక, బ్యాటింగ్​లో సాయి సుదర్శన్ (55 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (52) రాణించడంతో భారత్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్​ను ఛేజ్ చేసింది. సఫారీ బౌలర్లలో ఫెహ్లెక్వాయో, వియాన్ మల్డర్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్​లో భారత్ గెలుపునకు 5 ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఫస్ట్ వన్డేలో టీమిండియా విజయానికి కారణాల్లో మొదటిది బౌలింగ్. సీనియర్ పేసర్లు జస్​ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్ టీమ్​లో లేరు. బరిలోకి దిగిన అర్ష్​దీప్, అవేష్​, ముకేష్ అనుభవం కలిపితే 11 వన్డేలు మాత్రమే. బలమైన బ్యాటింగ్ యూనిట్​ కలిగిన సౌతాఫ్రికాను వాళ్ల సొంతగడ్డపై ఆపడం చాలా కష్టం. కానీ భారత బౌలర్లు అనూహ్యంగా చెలరేగిపోయారు. పదునైన పేస్, కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్, స్వింగ్​తో సఫారీ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. వీళ్ల దెబ్బకు హెన్రిచ్ క్లాసెన్ (6), డేవిడ్ మిల్లర్ (2), వాండర్ డస్సెన్ (0) లాంటి టాప్ బ్యాటర్లు రెండంకెల స్కోరు కూడా చేయకుండానే వెనుదిరిగారు. భారీ స్కోరు నమోదు అవుతుందనుకున్న పిచ్ మీద ప్రత్యర్థి బ్యాటర్లను తక్కువ పరుగులకే కుప్పకూల్చిన బౌలర్లు ఈ మ్యాచ్​ గెలుపులో కీలక పాత్ర పోషించారు.

5 reasons for india victory

భారత విజయానికి మరో కారణం బ్యాటింగ్. ఛేజ్ చేయాల్సిన స్కోరు తక్కువే ఉన్నప్పటికీ పిచ్ పేస్​, స్వింగ్​కు సహకరిస్తుండటంతో టీమిండియాకు ఇబ్బంది తప్పదని అనుకున్నారు. మంచి ఫామ్​లో ఉన్న యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (5) కూడా తక్కువ స్కోరుకే ఔటవడంతో ఛేదన కష్టమని అనిపించింది. కానీ స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (52)తో పాటు అరంగేట్ర ప్లేయర్ సాయి సుదర్శన్ (55) చెలరేగి ఆడటంతో భారత్​ ఈజీగా టార్గెట్​ను అందుకుంది. టీమిండియా విజయానికి బౌలర్లు కారణమైనప్పటికీ అందులో ఎక్కువ క్రెడిట్ అర్ష్​దీప్​కు ఇవ్వాలి. ఫామ్, రిథమ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ఈ పంజాబీ పుత్తర్ ఈ మ్యాచ్​లో తన సత్తా ఏంటో మరోమారు చూపించాడు. పిచ్ నుంచి స్వింగ్​కు సపోర్ట్ ఉండటంతో సఫారీ బ్యాటర్లను ఓ ఆటాడుకున్నాడు. తొలి ముగ్గురు బ్యాటర్లను అర్ష్​దీప్ ఔట్ చేయడంతో మిగతా బౌలర్ల కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది. అతడు వేసిన లెంగ్త్​ను పట్టుకొని బౌలింగ్ చేసిన అవేశ్​ ఖాన్​కూ వికెట్లు పడ్డాయి.

చెలరేగి బౌలింగ్ చేసిన అర్ష్​దీప్ సౌతాఫ్రికా గడ్డ మీద సౌతాఫ్రికా టీమ్​పై 5 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్​గా రికార్డు సృష్టించాడు. భారత గెలుపునకు మరో కారణం కెప్టెన్సీ. ఈ సిరీస్​లో జట్టుకు సారథ్యం వహిస్తున్న కేఎల్ రాహుల్ బౌలింగ్, ఫీల్డింగ్ ఛేంజెస్​లో తన మార్క్ చూపించాడు. ముఖ్యంగా అర్ష్​దీప్​కు తక్కువ టైమ్​లో సెకండ్ స్పెల్ ఇవ్వడం బాగా పని చేసింది. ఈ మ్యాచ్​లో టాస్ ఓడిపోవడం కూడా భారత్​కు కలిసొచ్చింది. ఇది కూడా విజయానికి ఓ కారణమే. ఎందుకంటే ఈ సిరీస్​లోని మ్యాచ్​లు సౌతాఫ్రికాలో ఉదయం పూట మొదలవుతున్నాయి. దీంతో మధ్యాహ్నం రెండో ఇన్నింగ్స్ టైమ్​కు బాల్​ స్వింగ్, సీమ్​కు అనుకూలిస్తుందని సఫారీ కెప్టెన్ మార్క్​రమ్ అనుకున్నాడు. అందుకే టాస్ నెగ్గగానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. స్కోరు బోర్డు మీద 250 పరుగులు చేసినా.. భారత్​కు ఛేజ్ చేయడం కష్టం అవుతుందని భావించాడు. కానీ పిచ్​ అనూహ్యంగా ఫస్ట్ ఇన్నింగ్స్​లోనే పేసర్లకు సహకరించడం టీమిండియాకు కలిసొచ్చింది. మరి.. ఈ మ్యాచ్​లో భారత్ విజయానికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయని మీరు భావిస్తే కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Team India: టెస్ట్ సిరీస్​కు ముందు భారత్​కు గట్టి షాక్.. స్టార్ ప్లేయర్ దూరం..!