iDreamPost
android-app
ios-app

సౌతాఫ్రికాతో రెండో టీ20.. భారత ప్లేయింగ్‌ 11 ఇదే! సెంచరీ హీరోకు అన్యాయం?

  • Published Dec 12, 2023 | 1:12 PM Updated Updated Dec 12, 2023 | 1:12 PM

ఇండియా-సౌతాఫ్రికా మధ్య మంగళవారం రెండో టీ20 మ్యాచ్‌ జరగనుంది. తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో.. రెండో మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని ఇరు జట్లు గట్టి పట్టుదలతో ఉన్నాయి. మరి ఈ మ్యాచ్‌లో ఎవరి ప్లేయింగ్‌ ఎలెవన్‌ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

ఇండియా-సౌతాఫ్రికా మధ్య మంగళవారం రెండో టీ20 మ్యాచ్‌ జరగనుంది. తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో.. రెండో మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని ఇరు జట్లు గట్టి పట్టుదలతో ఉన్నాయి. మరి ఈ మ్యాచ్‌లో ఎవరి ప్లేయింగ్‌ ఎలెవన్‌ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

  • Published Dec 12, 2023 | 1:12 PMUpdated Dec 12, 2023 | 1:12 PM
సౌతాఫ్రికాతో రెండో టీ20.. భారత ప్లేయింగ్‌ 11 ఇదే! సెంచరీ హీరోకు అన్యాయం?

సౌతాఫ్రికాతో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు సఫారీ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా రెండో టీ20 మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈ నెల 10న జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కావడంతో.. ప్రొటీస్‌ గడ్డపై టీమిండియాకు ఇదే తొలి మ్యాచ్‌గా భావించాలి. టీమిండియా సీనియర్‌ ప్రోస్‌.. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీలు టీ20, వన్డే సిరీస్‌లకు రెస్ట్‌ తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌ నంబర్‌ వన్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్సీలో యంగ్‌ టీమిండియా సౌతాఫ్రికాను ఢీ కొట్టేందుకు రెడీ అయింది. ఇప్పటికే ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో గెలిచి మంచి జోష్‌ మీదున్న సూర్య సేన.. సౌతాఫ్రికాను సైతం ఓడించి.. తమ విన్నింగ్‌ టెంపోను కొనసాగించాలని గట్టి పట్టుదలతో ఉంది.

అయితే.. ఆస్ట్రేలియాతో ఆడిన జట్టుకు మరికొంతమంది స్టార్‌ క్రికెటర్లు కూడా యాడ్‌ కావడంతో.. ప్లేయింగ్‌ ఎలెవన్‌పై క్రికెట్‌ అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. అలాగే ప్లేయింగ్‌ ఎలెవన్‌ను ఎంపిక చేయడం కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా ఓపెనింగ్‌ జోడీ విషయంలో సమస్య నెలకొంది. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో యశస్వి జైస్వాల్‌-రుతురాజ్‌ గైక్వాడ్‌ జోడీ అద్భుతంగా రాణించింది. ఇద్దరు మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అయితే.. ఇప్పుడు శుబ్‌మన్‌ గిల్‌ తిరిగి జట్టులోకి రావడంతో.. ఆసీస్‌తో ఆడిన జోడీనే కొనసాగిస్తారా? లేక గిల్‌ను ప్లేయింగ్‌ ఎలెవన్‌లోకి తీసుకుంటారా? అన్నది పెద్ద ప్రశ్న.

క్రికెట్‌ నిపుణులు అంచనా ప్రకారం.. శుబ్‌మన్‌ గిల్‌ బరిలోకి దిగే అవకాశం ఎక్కువగా ఉంది. జైస్వాల్‌-గిల్‌ భారత ఇన్నింగ్స్‌ను ఆరంభించనున్నారు. దీంతో.. రుతురాజ్‌ గైక్వాడ్‌కు అన్యాయం జరుగుతుందని కొంతమంది క్రికెట్‌ అభిమానులు పేర్కొంటున్నారు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన మూడో టీ20లో రుతురాజ్‌ ఏకంగా సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. సూపర్‌ ఫామ్‌లో ఉన్న రుతురాజ్‌ను పక్కనపెడుతుండటంపై కొంతమంది క్రికెట్‌ లవర్స్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ కాంబినేషన్‌ కోసం రుతు స్థానంలో గిల్‌ను ఆడించే అవకాశం ఉంది. మొత్తంగా.. రెండో టీ20లో తలపడే ఇండియా-సౌతాఫ్రికా ప్లేయింగ్‌ ఎలెవన్స్‌ను చూసుకుంటే..

ఇండియా ప్లేయింగ్‌ ఎలెవన్‌(అంచనా): యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, జితేష్ శర్మ, రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్, ముఖేష్ కుమార్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్
సౌతాఫ్రికా ప్లేయింగ్‌ ఎవెలన్‌(అంచాన): రీజా హెండ్రిక్స్, మాథ్యూ బ్రీట్జ్కే, ట్రిస్టన్ స్టబ్స్, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ఆండిలే ఫెహ్లుక్వాయో, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కోయెట్జీ, నాండ్రే బర్గర్, తబ్రైజ్ షమ్సీ