SNP
మంగళవారం నుంచి సెంచూరియన్ వేదికగా ఇండియా-సౌతాఫ్రికా మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ టెస్టులో విజయం సాధించేందుకు రెండు జట్లు గట్టి పట్టుదలతో ఉన్నాయి. అయితే ఏ టీమ్ ఎలాంటి ప్లేయింగ్ ఎలెవన్‌తో బరిలోకి దిగుతుందో ఇప్పుడు చూద్దాం..
మంగళవారం నుంచి సెంచూరియన్ వేదికగా ఇండియా-సౌతాఫ్రికా మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ టెస్టులో విజయం సాధించేందుకు రెండు జట్లు గట్టి పట్టుదలతో ఉన్నాయి. అయితే ఏ టీమ్ ఎలాంటి ప్లేయింగ్ ఎలెవన్‌తో బరిలోకి దిగుతుందో ఇప్పుడు చూద్దాం..
SNP
ప్రస్తుతం టీమిండియా సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు భారత జట్టు సఫారీ పర్యటనకు వెళ్లింది. ఇప్పటి వరకు భారత జట్టు టూర్ సక్సెస్‌ఫుల్‌గా సాగింది. పటిష్టమైన సౌతాఫ్రికా టీమ్‌ను ఎదుర్కొని యంగ్ టీమిండియా టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అలాగే వన్డే సిరీస్‌ను 2-1తో నెగ్గింది. టీ20 సిరీస్‌ను సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఆడిన భారత జట్టు.. వన్డే సిరీస్‌ను మాత్రం కేఎల్ రాహుల్ నాయకత్వంలో ఆడింది. ఈ రెండు సిరీస్‌ల్లోను యంగ్ టీమిండియానే బరిలోకి దిగి.. ఆకట్టుకుంది.
అయితే.. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్టలు సిరీస్‌లో అసలు సిసలైన భారత జట్టు బరిలోకి దిగనుంది. పైగా ఈ టెస్ట్ సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా సైతం బరిలోకి దిగుతున్నారు. వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్లో ఎదురైన ఓటమి తర్వాత.. ఈ నలుగురు స్టార్ ఆటగాళ్లు.. ముఖ్యంగా రోహిత్, కోహ్లీ రెస్ట్ తీసుకున్న విషయం తెలిసిందే. వరల్డ్ కప్ తర్వాత జరిగిన ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్, అలాగే సౌతాఫ్రికాతో ఇటీవల ముగిసిన మూడు టీ20ల సిరీస్, మూడు వన్డేల సిరీస్‌కు ఈ స్టార్ ఆటగాళ్లు దూరంగా ఉన్నారు.
వరల్డ్ కప్ ఓటమి బాధ నుంచి ఈ ఆటగాళ్లు బయటపడి.. తిరిగి గ్రౌండ్‌లోకి దిగుతుండటంతో క్రికెట్ అభిమానులు ఈ టెస్ట్ సిరీస్ కోసం ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. సౌతాఫ్రికాలో ఇప్పటి వరకు టెస్ట్ సిరీస్ గెలిచిన ఘనత ఇండియాకు లేదు. అయితే.. ఈ సారి ఆ లోటు తీరుతుందని, రోహిత్ అండ్ కో సౌతాఫ్రికాను ఓడించి టెస్ట్ సిరీస్ విజయం సాధిస్తారని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి సౌతాఫ్రికా లాంటి పటిష్టమైన జట్టును ఎదుర్కొనేందుకు టీమిండియా ఎలాంటి ప్లేయింగ్ ఎలెవన్‌తో బరిలోకి దిగుతుందో చూడాలి. అలాగే టెస్ట్ మ్యచ్ తొలి రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగే ప్రమాదం కూడా ఉంది. అయితే.. మ్యాచ్ జరిగే సెంచూరియన్ పిచ్ పేస్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఏది ఏమైనా.. తొలి టెస్టులో బరిలోకి దిగే ఇండియా, సౌతాఫ్రికా ప్లేయింగ్ ఎలెవన్ ఇలా ఉండొచ్చు. కిందున్న ప్లేయింగ్ ఎలెవన్ అంచనాలను చూసి.. ఎవరి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని మీరు భావిస్తున్నారో? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇండియా ప్లేయింగ్ ఎలెవన్(అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
సౌతాఫ్రికా ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా): డీన్ ఎల్గర్, ఐడెన్ మార్క్రామ్, టోనీ డి జోర్జి, టెంబా బావుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్ వెర్రెయిన్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, గెరాల్డ్ కోయెట్జీ, కగిసో రబడ, లుంగి ఎన్‌గిడి
Session timing of India vs South Africa Test series. [IST]
1st session – 1.30 pm to 3.30 pm.
2nd session – 4.10 pm to 6.10 pm.
3rd session – 6.30 pm to 8.30 pm. pic.twitter.com/st9f2P1VEl— Johns. (@CricCrazyJohns) December 24, 2023