iDreamPost
android-app
ios-app

IND vs SA: సౌతాఫ్రికాతో తొలి వన్డే.. సిక్సర్ల కింగ్ ఎంట్రీ! తుది జట్టు ఇదే!

  • Published Dec 16, 2023 | 4:51 PM Updated Updated Dec 16, 2023 | 4:51 PM

సౌతాఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్ కోసం సీనియర్ బ్యాటర్లు అందుబాటులోకి వచ్చారు. దీంతో తొలి వన్డేలో చోటు ఎవరికి దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. తుది జట్టులో చోటు దక్కించుకునే ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

సౌతాఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్ కోసం సీనియర్ బ్యాటర్లు అందుబాటులోకి వచ్చారు. దీంతో తొలి వన్డేలో చోటు ఎవరికి దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. తుది జట్టులో చోటు దక్కించుకునే ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

IND vs SA: సౌతాఫ్రికాతో తొలి వన్డే.. సిక్సర్ల కింగ్ ఎంట్రీ! తుది జట్టు ఇదే!

సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో ఓడిపోయిన టీమిండియా.. ఆ తర్వాత జరిగిన మ్యాచ్ లో అనూహ్యంగా పుంజుకుని విజయం సాధించింది. దీంతో పొట్టి సిరీస్ ను 1-1తో సమం చేసుకుంది. ఇక ఇప్పుడు వన్డే సిరీస్ కు సిద్దమైంది. మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ డిసెంబర్ 17న జోహన్నెస్ బర్గ్ వేదికగా జరగనుంది. ఈ పోరు కోసం ఇరు జట్లు సిద్దమవుతున్నాయి. గత మ్యాచ్ గెలిచి జోరుమీదున్న భారత జట్టు.. అదే జోరును వన్డే సిరీస్ లో కొనసాగించి.. సిరీస్ ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఇక వన్డే సిరీస్ కోసం కేఎల్ రాహుల్, సంజూ శాంసన్, యజ్వేంద్ర చాహల్ లాంటి స్టార్లు అందుబాటులోకి వచ్చారు. ఈ క్రమంలో సఫారీ టీమ్ తో తలపడబోయే తుది జట్టు ఏదో ఇప్పుడు చూద్దాం.

దక్షిణాఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్ కోసం టీమిండియా సిద్దమైంది. స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ జట్టును ముందుండి నడిపించనున్నాడు. జట్టులోకి సీనియర్, స్టార్ ప్లేయర్లు రావడంతో.. తుది జట్టు కూర్పు ఎలా ఉంటుందోనని క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో జట్టులో ఎవరెవరికి చోటు దక్కుతుందో ఓ సారి పరిశీలిద్దాం. వన్డే సిరీస్ కు టీమిండియా రెగ్యూలర్ ఓపెనర్ గిల్ కు విశ్రాంతి ఇచ్చారు సెలెక్టర్లు. దీంతో తమిళనాడు యువ సంచలనం సాయి సుదర్శన్ కు తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. అదీకాక అతడికి ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నారు సెలెక్టర్లు. దీంతో అతడు టీమ్ లో వస్తే.. రుతురాజ్ తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది.

ఈ క్రమంలో మూడో స్థానంలో సీనియర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యార్ ఉండగా.. ఇక చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్న సంజూకు ఈ మ్యాచ్ లో కచ్చితంగా చోటు దక్కనుంది. దీంతో తిలక్ వర్మ ప్లేస్ కు గండం ఏర్పడనుంది. కాగా.. ఇప్పటికే టీ20ల్లో దుమ్మురేపుతున్న సిక్సర్ల కింగ్ రింకూ సింగ్ ఈ వన్డే ద్వారా అరంగేట్రం చేయం దాదాపు ఖరారు అయినట్లే. సూపర్ ఫామ్ లో ఉన్న రింకూను పక్కనబెట్టే సాహసం సెలెక్టర్లు చేయరు. అయితే వన్డే ఫార్మాట్లో రింకూ ఏవిధంగా రాణిస్తాడో వేచి చూడాలి. ఇక ఆల్ రౌండర్ల జాబితాలో అక్షర్ పటేల్ కు చోటు గ్యారంటీ. చివరి మ్యాచ్ లో ఐదు వికెట్లతో మెరిసిన కుల్దీప్ స్పిన్ విభాగాన్ని ముందుండి నడిపించనున్నాడు. అటు ముకేశ్ కుమార్, అర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్ లు పేస్ దళానికి నాయకత్వం వహించనున్నారు.

టీమిండియా తుది జట్టు(అంచనా):

సాయి సుదర్శన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కెప్టెన్), సంజు శాంసన్, రింకూ సింగ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్.