ఆసియా కప్-2023లో మరో రసవత్తర పోరుకు అంతా సిద్ధమవుతోంది. గ్రూప్ దశలో తలపడిన భారత్-పాకిస్థాన్ జట్లు మరోమారు ముఖాముఖి మ్యాచ్‌లో తేల్చుకునేందుకు రెడీ అవుతున్నాయి. గ్రూప్ దశలో భాగంగా భారత్ తన తొలి మ్యాచ్‌లోనే దాయాది పాక్‌తో తలపడింది. కానీ వరుణుడు ఆటంకం కలిగించడంతో ఆ మ్యాచ్ అసంపూర్తిగా ముగిసింది. ఆ మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ మాత్రమే సాధ్యమైంది. దీంతో దాయాదులు మళ్లీ తలపడితే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. వాళ్ల కోరికను తీరుస్తూ సూపర్-4 దశలో కీలకమైన మ్యాచ్ వచ్చేసింది.
భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఆదివారం ఆసక్తికర మ్యాచ్ జరగబోతోంది. టోర్నమెంట్లో ముందు దశకు వెళ్లేందుకు రెండు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం కానుంది. దీంతో విజయం కోసం రెండు టీమ్స్ చివరి వరకు పోరాడతాయి. పాక్‌తో లీగ్ మ్యాచ్‌లో జరిగిన తప్పిదాలను పునరావృతం చేయొద్దని భారత్ భావిస్తోంది. షాహిన్ అఫ్రిది బౌలింగ్‌ను మరింత సమర్థవంతంగా ఎదుర్కొవాలని అనుకుంటోంది. ఒకవేళ అతడి బౌలింగ్‌లో గనుక బాగా ఆడితే టీమిండియాకు ఎదురుండకపోవచ్చు. షాహిన్‌తో పాటు మంచి ఫామ్‌లో ఉన్న హ్యారీస్ రౌఫ్, నసీమ్ షాతో కూడా భారత్‌కు ప్రమాదం పొంచి ఉంది.
బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ టీమిండియా మరింత మెరుగవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. లీగ్ దశలో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో భారత బౌలర్లు బౌలింగ్ చేయలేదు. కానీ పసికూన నేపాల్‌తో మ్యాచ్‌లో మన బౌలర్లు బౌలింగ్ చేశారు. ఆ మ్యాచ్‌లో స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ 3 వికెట్లు తీసినా.. 61 రన్స్ సమర్పించుకున్నాడు. ఒక్క జడేజా తప్ప ఎవరూ రాణించలేదు. ఈ నేపథ్యంలో పాక్‌తో మ్యాచ్‌లో బాగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే.. పాక్‌తో మ్యాచ్‌కు ముందు భారత్‌కు హెచ్చరికలు పంపాడు షోయబ్ అక్తర్. టీమిండియా తమ జట్టు ఆటగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని పాక్ లెజెండరీ పేసర్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ మ్యాచ్ కోసం కొలంబోకు వెళ్లిన అక్తర్.. అక్కడ వాతావరణం బాగుందన్నాడు.
ఇదీ చదవండి: ఇది ఆరంభం మాత్రమే.. భారత్‌కు షాహిన్ అఫ్రిది వార్నింగ్!
Just landed in Colombo. Excited about Pakistan vs India.
Weather looks quite amazing. #Pakistan #India #cricket pic.twitter.com/m8hVbnVMo9— Shoaib Akhtar (@shoaib100mph) September 9, 2023