SNP
India vs Pakistan, World Championship of Legends: ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌ల కోసం క్రికెట్ అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. టీ20 వరల్డ్ కప్‌లో జూన్ 9న మ్యాచ్ జగరనుంది. అలాగే జూలైలో కూడా ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ విశేషాలు ఇప్పుడు చూద్దాం..
India vs Pakistan, World Championship of Legends: ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌ల కోసం క్రికెట్ అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. టీ20 వరల్డ్ కప్‌లో జూన్ 9న మ్యాచ్ జగరనుంది. అలాగే జూలైలో కూడా ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ విశేషాలు ఇప్పుడు చూద్దాం..
SNP
క్రికెట్ అభిమానులను ఒక రేంజ్‌లో అలరించిన ఐపీఎల్ ముగిసింది. క్రికెట్ అభిమానులు ధనాధన్ క్రికెట్‌ను మిస్ అవుతున్నారు. కానీ, త్వరలోనే టీ20 వరల్డ్ కప్ 2024 ప్రారంభం కానుంది. అయితే.. అది ముగిసిన తర్వాత ఓ క్రేజీ లీగ్ ప్రారంభం కానుంది. ఆ లీగ్ పేరు డబ్ల్యూసీఎల్(వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్). ఇంగ్లండ్ వేదికగా ప్రారంభం కాబోతున్న ఈ లీగ్‌లో ఇండియా, పాకిస్థాన్ ఆటగాళ్లు కూడా పాల్గొన బోతున్నారు. ప్రపంచంలో ఏ లీగ్‌లో కూడా ఇండియా పాకిస్థాన్ ఆటగాళ్లు తలపడటం లేదు. తొలి సారి ఈ లీగ్‌లో ఇండియా, పాకిస్థాన్ ఆటగాళ్లు ఆడితే.. క్రికెట్ అభిమానులు ఈ లీగ్‌ను ఎగబడి చూసే అవకాశం ఉంటుంది. ఈ లీగ్ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంగ్లండ్ వేదికగా ఈ డబ్ల్యూసీఎల్ ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు పాల్గొంటున్నాయి. అయితే.. ఈ టీమ్స్‌లో ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న క్రికెటర్లు ఉండరు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిపోయిన స్టార్ ప్లేయర్లు ఈ లీగ్‌లో పాల్గొంటారు. ఇండియా టీమ్‌లో యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా లాంటి స్టార్ ఆటగాళ్లు ఆడుతున్నారు. అలాగే పాకిస్థాన్ జట్టుకు షాహిద్ అఫ్రిదీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇక ఇంగ్లండ్ జట్టులో కెవిన్ పీటర్సన్, ఇయాన్ బెల్ లాంటి దిగ్గజ క్రికెటర్లు ఆడుతున్నారు.
వెస్టిండీస్ తరఫున క్రిస్ గేల్, ఆస్ట్రేలియా తరఫున బ్రెట్ లీ లాంటి దిగ్గజ క్రికెటర్ బరిలోకి దిగనున్నాడు. జూలై 3 నుంచి ప్రారంభం కానున్న ఈ వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ.. జూలై 13న ముగియనుంది. మ్యాచ్‌లన్నీ ఇంగ్లండ్‌లోనే జరగనున్నాయి. అయితే.. జూలై 6న ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. అమెరికా, వెస్టిండీస్ వేదికగా జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ 2024లో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జూన్ 9న జరగనుంది. ఇలా రెండు నెలల్లో రెండు సార్లు ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌లు చూసే అవకాశం కలగనుంది. అయితే.. జూలై 6న డబ్ల్యూసీఎల్‌లో మరోసారి పాకిస్థాన్‌పై యువీ తన ప్రతాపం చూపాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. మరి డబ్ల్యూసీఎల్ టోర్నీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
View this post on Instagram
A post shared by World Championship Of Legends | WCL (@worldchampionshipoflegends)