నేడే ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌! యువీ ఆట మరోసారి..

IND vs PAK, WCL 2024: క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే మ్యాచ్‌ ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్‌. ఈ రోజు ఆ మ్యాచ్‌ జరగనుంది. మరి ఆ మ్యాచ్‌ లైవ్‌ ఎందులో చూడాలి? ఎప్పుడు చూడాలి? లాంటి డీటెల్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం..

IND vs PAK, WCL 2024: క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే మ్యాచ్‌ ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్‌. ఈ రోజు ఆ మ్యాచ్‌ జరగనుంది. మరి ఆ మ్యాచ్‌ లైవ్‌ ఎందులో చూడాలి? ఎప్పుడు చూడాలి? లాంటి డీటెల్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం..

భారత్‌, పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ అంటే క్రికెట్‌ అభిమానులకు అదో పండగే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులంతా ఆసక్తి చూపించే ఏకైక మ్యాచ్‌ ఇండియా వర్సెస్ పాకిస్థాన్‌ మ్యాచ్‌. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భారత్‌, పాక్‌ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో టీమిండియా అద్భుతమైన విజయం సాధించి.. ఐసీసీ ఈవెంట్స్‌లో పాక్‌పై తమ ఆధిపత్యాన్ని కొనసాగించింది. అయితే.. గతంలో దేశాల తరఫున ఆడుతూ.. క్రికెట్‌ అభిమానులకు అసలు సిసలైన క్రికెట్‌ మజాను పంచిన.. యువరాజ్‌ సింగ్‌, షాహిద్‌ అఫ్రిదీ లాంటి స్టార్‌ క్రికెటర్లు మరోసారి నువ్వా-నేనా అన్నట్లు తలపడనున్నారు. ఈ మ్యాచ్‌తో క్రికెట్‌ అభిమానులకు మరోసారి ఇండియా పాకిస్థాన్‌ మ్యాచ్‌ చూసే అవకాశం దక్కింది.

టీమిండియాకు ఆడుతూ.. పాకిస్థాన్‌పై ఎన్నో మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌ సింగ్‌, సురేష్‌ రైనా, యూసుఫ్‌ పఠాన్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌ లాంటి భారత మాజీ క్రికెటర్లు వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ 2024 టోర్నీలో ఇండియా ఛాంపియన్స్‌ తరఫున ఆడుతున్నారు. అలాగే పాకిస్థాన్‌ తరఫున షాహిద్‌ అఫ్రిదీ, మిస్బా ఉల్‌ హక్‌, షోయబ్‌ మాలిక్‌, యూనిస్‌ ఖాన్‌ లాంటి మాజీ క్రికెటర్లు పాకిస్థాన్‌ ఛాంపియన్స్‌ తరఫున బరిలోకి దిగున్నారు. ఈ రోజు(శనివారం) ఇండియా ఛాంపియన్స్‌, పాకిస్థాన్‌ ఛాంపియన్స్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది.

బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా లెజెండ్స్‌ హైఓల్టేజ్‌ మ్యాచ్‌ జరగనుంది. యూకే స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం అవుతుంది. మన టైమ్‌ ప్రకారం.. రాత్రి 9 గంటలకు మ్యాచ్‌ షురూ అవుతుంది. పాకిస్థాన్‌ కాల మాన ప్రకారం అక్కడ రాత్రి 8.30లకు మ్యాచ్‌ ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్‌ను స్టార్‌ స్పోర్ట్స్‌లో లైవ్‌ చూడొచ్చు. ఈ లెజెండ్స్‌ లీగ్‌లో ఇండియా ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచింది. ఇంగ్లండ్‌ ఛాంపియన్స్‌, వెస్టిండీస్‌ ఛాంపియన్స్‌ టీమ్స్‌ను ఓడించింది. పాకిస్థాన్‌పై కూడా గెలిచి హ్యాట్రిక్‌ సాధించాలని యువీ సేన ఉ‍త్సాహంగా ఉంది. మరి ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

టీమ్స్‌..
ఇండియా ఛాంపియన్స్‌: రాబిన్ ఉతప్ప, నమన్ ఓజా(వికెట్‌ కీపర్‌), సురేష్ రైనా, యువరాజ్ సింగ్(కెప్టెన్‌), గురుకీరత్ సింగ్ మాన్, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, వినయ్ కుమార్, హర్భజన్ సింగ్, ధవల్ కులకర్ణి, రాహుల్ శుక్లా, RP సింగ్, సౌరభ్ తివారీ, అనురీత్ సింగ్, రాహుల్ శర్మ, అంబటి రాయుడు, పవన్ నేగి.

పాకిస్థాన్ ఛాంపియన్స్: కమ్రాన్ అక్మల్(వికెట్‌ కీపర్‌), షర్జీల్ ఖాన్, సోహైబ్ మక్సూద్, షోయబ్ మాలిక్, యూనిస్ ఖాన్(కెప్టెన్‌), మిస్బా-ఉల్-హక్, షాహిద్ అఫ్రిది, అబ్దుల్ రజాక్, అమీర్ యామిన్, వాహబ్ రియాజ్, సయీద్ అజ్మల్, తౌఫీక్ ఉమర్, మహ్మద్ హఫీజ్, యాసిర్ అరాఫత్, సొహైల్ తన్వీర్, సోహైల్ ఖాన్, ఉమర్ అక్మల్, తన్వీర్ అహ్మద్.

Show comments