SNP
India vs Pakistan, T20 World Cup 2024: రానున్న టీ20 వరల్డ్ కప్ 2024లో పాకిస్థాన్‌తో టీమిండియా జూన్ 9న మ్యాచ్ ఆడనుంది. అయితే.. ఈ మ్యాచ్‌తో ఎస్‌ఆర్‌హెచ్ 287 పరుగులు రికార్డ్ బ్రేక్ అవుతుందని అంటున్నారు. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం..
India vs Pakistan, T20 World Cup 2024: రానున్న టీ20 వరల్డ్ కప్ 2024లో పాకిస్థాన్‌తో టీమిండియా జూన్ 9న మ్యాచ్ ఆడనుంది. అయితే.. ఈ మ్యాచ్‌తో ఎస్‌ఆర్‌హెచ్ 287 పరుగులు రికార్డ్ బ్రేక్ అవుతుందని అంటున్నారు. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం..
SNP
ప్రస్తుతం క్రికెట్ అభిమానులంతా ఐపీఎల్ ఫీవర్‌తో ఊగిపోతున్నారు. మరో 20 రోజుల పాటు ఐపీఎల్ సందడి కొనసాగునుంది. అయితే.. ఆ తర్వాత అసలు సిసలు టీ20 క్రికెట్ మజా మొదలుకానుంది. అదే.. టీ20 వరల్డ్ కప్ 2024. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ కోసం ఇప్పటికే భారత సెలెక్టర్లు టీమిండియాను ప్రకటించారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో 15 మందితో కూడిన స్క్వౌడ్‌ను ఎంపిక చేశారు. వీరితో పాటు మరో నలుగురు ప్లేయర్లను స్టాండ్‌బైగా సెలెక్ట్ చేశారు. జూన్ 2 నుంచి వెస్టిండీస్, అమెరికా సంయుక్త వేదికగా ఈ టోర్నీ జరగనుంది. జూన్ 5న టీమిండియా ఐర్లాండ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.
కానీ, టీ20 వరల్డ్ కప్‌లో అంతా ఎదురుచూస్తున్న మ్యాచ్.. ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్. ఈ మ్యాచ్ జూన్ 9న న్యూయార్క్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం అమెరికా ఒక కొత్త క్రికెట్ స్టేడియాన్నే నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ సమరంలో భారత్-పాక్ మధ్య మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు పండగ అనే చెప్పాలి. అయితే.. ఈ మ్యాచ్‌కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే.. జూన్ 9న జరిగే ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌తో.. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ క్రికెట్ చేసిన రికార్డు బ్రేక్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఐపీఎల్ 2024లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 287 పరుగుల భారీ స్కోర్ సాధించిన విషయం తెలిసిందే. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్‌లు చెలరేగడంతో ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక స్కోర్‌ను ఎస్‌ఆర్‌హెచ్ నమోదు చేసింది. అయితే.. ఈ రికార్డ్ ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌తో తుడిచిపెట్టుకుని పోతుందని అంతా భావిస్తున్నారు. అది ఎలాగంటే.. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ జరగబోయే న్యూయార్క్ గ్రాండ్ బౌండరీలు చాలా చిన్నగా ఉండటమే అందుకు కారణం.. 65-70 మీటర్ల బౌండరీలు మాత్రమే ఉండటంతో.. పాక్‌తో మ్యాచ్‌లో ఇండియా ముందుగా బ్యాటింగ్ చేస్తే.. పాకిస్థాన్ బౌలింగ్‌ను రోహిత్ శర్మ, జైస్వాల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ చీల్చిచెండాడి, సిక్సుల వర్షం కురిపించి.. 300 పరుగులు ఈజీగా చేస్తారని, దాంతో ఎస్‌ఆర్‌హెచ్ రికార్డ్ బ్రేక్ అవుతుందని అంటున్నారు క్రికెట్ అభిమానులు. మరి ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ జరగబోయే న్యూయర్క్ గ్రౌండ్‌లో బౌండరీల దూరం మరీ తక్కువగా ఉండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The boundary size of the New York Cricket Stadium.
– India Vs Pakistan will be played here. 🇮🇳 pic.twitter.com/50iUHsuOXw
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 4, 2024