SNP
SNP
క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 రేపటి నుంచి ప్రారంభం కానుంది. పాకిస్థాన్‌లోని ముల్తాన్ వేదికగా పాక్-నేపాల్ మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ మినీ వరల్డ్ కప్ సమచారానికి తెరలేవనుంది. బుధవారం(ఆగస్టు 30) నుంచి సెప్టెంబర్ 17 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఈ టోర్నీకి పాకిస్థాన్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. నిజానికి ఈ ఆసియా కప్ టోర్నీ మొత్తం పాకిస్థాన్‌లోనే జరగాల్సి ఉన్నా.. టీమిండియా, పాకిస్థాన్‌లో ఆడేందుకు సిద్ధంగా లేని కారణంగా టోర్నీని హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. పాకిస్థాన్‌లో కొన్ని మ్యాచ్‌లో శ్రీలంకలో కొన్ని మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. అయితే.. టీమిండియా ఆడే మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే ఉండనున్నాయి.
అయితే.. ఆసియా కప్ ఆరంభం అనగానే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల చూపు మొత్తం ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌పైనే ఉంటాయి. ఈ దాయాదుల పోరుకుండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత్-పాక్ జట్లు తలపడుతున్నాయంటే.. అది కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ మాత్రమే కాదు.. అందుకు మించి ఉంటుంది. ఆటతో పాటు భావోద్వేగాల సమరం సాగుతుంది. రెండు దేశాల అభిమానులు.. తమ దేశం తరఫున ఓ 11 మంది సైనికులు, మరో 11 మంది శత్రు సైనికులతో తలపడుతున్నట్లు భావిస్తారు. ఏ మ్యాచ్ గెలిచినా అంత ఆనందపడరు.. కానీ, పాకిస్థాన్‌పై ఇండియా గెలిస్తే.. ఆ కిక్కే వేరేప్పా అన్నట్లు ఫీలైపోతారు. అది భారత్-పాక్ మ్యాచ్‌కున్న రేంజ్.
అయితే.. సెప్టెంబర్ 2న శ్రీలంకలోని పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్-పాక్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. భారత్-పాక్ పోరుతో క్రికెట్ ఫీవర్‌తో ఊగిపోదామని భావిస్తున్న క్రికెట్ అభిమానులను నిరాశపరిచే విషయం ఒకటి తెలుస్తుంది. అదేంటంటే.. భారత్-పాక్ మ్యాచ్ జరిగే రోజు వర్షం వచ్చే అవకాశం ఉన్నట్లు శ్రీలంక వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ రోజు 90 శాతం వర్షం వచ్చే అవకాశం ఉందని, అదే జరిగితే.. భారత్-పాక్ మ్యాచ్ జరగకపోవచ్చని సమాచారం. నిజంగా ఇది క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ నచ్చని విషయం కానీ, అదృష్టం బాగుండి ఆ రోజు వర్షం రాకుండా ఉండాలని అంతా కోరుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
2 September weather Pak vs ind
🇵🇰 🇮🇳
“Asia Cup 2023” Jersey #INDvPAK #TheManWhoBuiltPakistan pic.twitter.com/SIMQrNHcEP— ✘ Cricket (@KhanSunny0011) August 28, 2023
Rain may spoil IND vs PAK match in Asia Cup 2023. pic.twitter.com/anAsfzX5JT
— CricketGully (@thecricketgully) August 27, 2023
ఇదీ చదవండి: Asia Cup: పాకిస్థాన్‌తో మ్యాచ్.. భారత ప్లేయింగ్ ఎలెవన్ ఇదే!