iDreamPost
android-app
ios-app

ఇషాన్ కిషన్ అద్భుతమైన క్యాచ్.. గాల్లోకి అమాంతం ఎగిరి..!

  • Author singhj Published - 08:46 PM, Mon - 4 September 23
  • Author singhj Published - 08:46 PM, Mon - 4 September 23
ఇషాన్ కిషన్ అద్భుతమైన క్యాచ్.. గాల్లోకి అమాంతం ఎగిరి..!

ఆసియా కప్​లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్​లో నేపాల్ ఊహించిన దాని కంటే మంచి స్కోరు చేసింది. పటిష్టమైన భారత బౌలింగ్ యూనిట్​ను సమర్థంగా ఎదుర్కొని 48.2 ఓవర్లలో 230 రన్స్​కు ఆలౌటైంది. ఆ జట్టు ఓపెనర్లు కుశాల్ బార్టెల్ (25 బంతుల్లో 38), ఆసిఫ్ షేక్ (97 బంతుల్లో 58) రాణించారు. వీళ్లతో పాటు లోయర్ ఆర్డర్ బ్యాట్స్​మన్ సోమ్​పాల్ (56 బంతుల్లో 48) కూడా బ్యాటుతో మెరిశాడు. అలాగే గుల్షాన్ జా (23), దీపేంద్ర సింగ్ (29) కూడా బాగానే బ్యాటింగ్ చేయడంతో నేపాల్ 230 రన్స్ చేయగలిగింది.

ఒక దశలో నేపాల్ తక్కువ స్కోరుకే ఆలౌట్ అయ్యేలా కనిపించింది. 146 రన్స్​కు 6 వికెట్లు కోల్పోవడంతో 180లోపే నేపాల్ ఇన్నింగ్స్ ముగుస్తుందేమో అనిపించింది. కానీ చివర్లో సోమ్​పాల్ పట్టుదలగా ఆడి జట్టుకు పోరాడే స్కోరును అందించాడు. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ చెరో 3 వికెట్లతో అదరగొట్టారు. మహ్మద్ షమి, హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్​లు తలో వికెట్ పడగొట్టారు. నేపాల్ ఇన్నింగ్స్​లో ఓపెనర్ల బ్యాటింగ్ అందర్నీ ఆకట్టుకుంది. అయితే భారత్ తొలి నాలుగు ఓవర్లలో మూడు క్యాచ్​లు మిస్ చేసింది. నేపాల్ ఓపెనర్ బుర్టెల్ ఇచిన ఒక క్యాచ్​ను స్లిప్​లో శ్రేయస్ అయ్యర్ అందుకోలేకపోయాడు.

ఆ తర్వాత ఓవర్​లో మరో ఓపెనర్ ఆసిఫ్​ ఇచ్చిన క్యాచ్​ను విరాట్ కోహ్లీ మిస్ చేశాడు. వీళ్ల తర్వాతి వంతు కీపర్ ఇషాన్ కిషన్​ది అయ్యింది. షమీ బౌలింగ్​లో బుర్టెల్ గ్లోవ్స్​కు తాకిన బంతిని అందుకోవడంలో ఇషాన్ ఫెయిలయ్యాడు. ఇలా 4 ఓవర్ల గ్యాప్​లో 3 క్యాచ్​లు మిస్ చేయడంతో నేపాల్ ఓపెనర్లు రెచ్చిపోయారు. ఈ మ్యాచ్​లో భారత జట్టు ఫీల్డింగ్​పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అయితే మ్యాచ్​లో ఇషాన్ కిషన్ అందుకున్న ఒక క్యాచ్ మాత్రం సూపర్బ్ అనే చెప్పాలి. షమి బౌలింగ్​లో సోమ్​పాల్ (48) ఇచ్చిన క్యాచ్​ను ఇషాన్ అద్భుతంగా పట్టాడు. కుడివైపు అమాంతం గాల్లోకి సూపర్​మ్యాన్ తరహాలో ఎగిరి క్యాచ్​ను అందుకున్నాడు ఇషాన్. ఈజీ క్యాచ్​ను వదిలేసినప్పటికీ.. ఆఖర్లో అద్భుతమైన క్యాచ్​తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు ఇషాన్.

ఇదీ చదవండి: నేపాలీ ఫ్యాన్​కు కోహ్లీ పలకరింపు!