iDreamPost
android-app
ios-app

Virat Kohli: ఇంగ్లండ్​కు వార్నింగ్ ఇచ్చిన ఇండియా లెజెండ్.. తమ దగ్గర విరాట్​బాల్ ఉందంటూ..!

  • Published Jan 21, 2024 | 3:53 PM Updated Updated Jan 21, 2024 | 3:53 PM

ఐదు టెస్టుల సిరీస్​లో ఆడేందుకు భారత్​కు వస్తున్న ఇంగ్లండ్​ జట్టుకు ఓ టీమిండియా లెజెండ్ మాస్ వార్నింగ్ ఇచ్చాడు. బజ్​బాల్​కు కౌంటర్​గా తమ దగ్గర విరాట్​బాల్ ఉందన్నాడు.

ఐదు టెస్టుల సిరీస్​లో ఆడేందుకు భారత్​కు వస్తున్న ఇంగ్లండ్​ జట్టుకు ఓ టీమిండియా లెజెండ్ మాస్ వార్నింగ్ ఇచ్చాడు. బజ్​బాల్​కు కౌంటర్​గా తమ దగ్గర విరాట్​బాల్ ఉందన్నాడు.

  • Published Jan 21, 2024 | 3:53 PMUpdated Jan 21, 2024 | 3:53 PM
Virat Kohli: ఇంగ్లండ్​కు వార్నింగ్ ఇచ్చిన ఇండియా లెజెండ్.. తమ దగ్గర విరాట్​బాల్ ఉందంటూ..!

క్రికెట్​లో మరో ఆసక్తికర పోరుకు అంతా సిద్ధమవుతోంది. టాప్ టీమ్స్ అయిన భారత్, ఇంగ్లండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరగనుంది. ఒకటి, రెండు కాదు ఏకంగా ఐదు మ్యాచులు జరగనున్నాయి. స్వదేశంలో జరగనున్న ఈ సిరీస్​లో నెగ్గడం టీమిండియాకు ఎంతో కీలకం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్ పాయింట్స్ టేబుల్​లో ఫస్ట్ ప్లేస్​కు చేరుకోవాలంటే ఈ సిరీస్​లో గెలవాల్సి ఉంటుంది. అందుకే ఇంగ్లీష్ టీమ్​ను చిత్తు చేయాలని రోహిత్ సేన భావిస్తోంది. రికార్డుల పరంగా చూసుకుంటే ఇంగ్లండ్​ ఎప్పుడు భారత్​కు వచ్చినా ఖాళీ చేతులతోనే వెళ్లింది. కానీ ఒక్క 2012లో మాత్రం అలిస్టర్ కుక్ కెప్టెన్సీలో టెస్ట్ సిరీస్​ను నెగ్గింది. ఆ తర్వాత మళ్లీ ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో ఈసారి భారత్​ను ఓడించేందుకు బజ్​బాల్​ మంత్రాన్ని కూడా ప్రయోగించాలని చూస్తోంది. ఈ తరుణంలో బ్యాటింగ్ లెజెండ్ సునీల్ గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. టీమిండియా దగ్గర కూడా ఓ అస్త్రం ఉందన్నాడు.

బజ్​బాల్​కు కౌంటర్​గా భారత్ దగ్గర విరాట్​బాల్ ఉందన్నాడు గవాస్కర్. ఈ అస్త్రాన్ని తట్టుకోవడం ఇంగ్లండ్​​ వల్ల సాధ్యం కాదని హెచ్చరించాడు. టీమిండియా చేతిలో మరోసారి ఇంగ్లీష్ టీమ్​కు ఓటమి తప్పదని చెప్పాడు. ‘ఇంగ్లండ్ బజ్​బాల్​ స్ట్రాటజీని చిత్తు చేసేందుకు భారత్ దగ్గర విరాట్​బాల్ ఉంది. ఇంగ్లీష్ టీమ్ మీద కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. అతడు బ్యాటింగ్ చేస్తున్న తీరు, కదలికలు చాలా బాగున్నాయి. ప్రస్తుతం కోహ్లీ ఉన్న ఫామ్​కు అతడ్ని అడ్డుకోవడం ఎవరి వల్లా కాదు. బజ్​బాల్​కు సరైన కౌంటర్​ విరాట్​బాలే’ అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. గత రెండు, మూడేళ్లుగా ఇంగ్లండ్ జట్టు అగ్రెసివ్​గా ఆడుతోందని తెలిపాడు. ఎలాంటి సిచ్యువేషన్​లోనైనా దూకుడుగా ఆడాలని వారు డిసైడ్ అయి దాన్ని కొనసాగిస్తున్నారని పేర్కొన్నాడు గవాస్కర్. అయితే ఈ ఫార్ములా భారత్​లో ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలన్నాడు.

ఇండియాలోని టర్నింట్ ట్రాక్స్​ మీద రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా లాంటి టాప్ స్పిన్నర్ల బౌలింగ్​లో బజ్ బాల్ వర్కౌట్ అవడం కష్టమేనన్నాడు గవాస్కర్. ఇంగ్లండ్ ఈ ఫార్ములాను ఎలా ముందుకు తీసుకెళ్తుందో చూడాలని ఉందన్నాడు. ఇక, ఇంగ్లీష్ టీమ్​పై విరాట్ కోహ్లీ రికార్డులను చూసుకుంటే.. ఇప్పటిదాకా ఆ జట్టుతో 28 మ్యాచులు ఆడాడు. వాటిల్లో 42.36 యావరేజ్​తో 1991 పరుగులు చేశాడు కింగ్. అందుకే ఇంగ్లండ్​కు సరైనోడు కోహ్లీనేనని గవాస్కర్ సహా పలువురు భారత మాజీ క్రికెటర్లు అంటున్నారు. ఈ విషయం ఇంగ్లీష్ టీమ్​కు కూడా తెలుసు. అందుకే ఆ దేశ మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత ప్లేయర్లు కోహ్లీని టార్గెట్ చేసుకుంటున్నారు. కోహ్లీకి ఈగో ఎక్కువని.. అతడి ఈగోతో ఆడుకుంటామంటూ రెచ్చగొడుతున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లీ బ్యాట్​తోనే వారికి సమాధానం ఇస్తాడేమో చూడాలి. మరి.. బజ్​బాల్​కు విరాట్​బాల్​ సరైన కౌంటర్ అంటూ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.