iDreamPost
android-app
ios-app

Virat Kohli: కోహ్లీకి ఈగో ఎక్కువ.. మాకూ అదే కావాలి: ఇంగ్లండ్ క్రికెటర్

  • Published Jan 20, 2024 | 4:19 PM Updated Updated Jan 20, 2024 | 4:19 PM

ఇంగ్లండ్​తో టెస్ట్ సిరీస్​కు భారత్ రెడీ అవుతోంది. దీంతో ప్రత్యర్థి ప్లేయర్లు టీమిండియా క్రికెటర్లను టీజ్ చేయడం స్టార్ట్ చేశారు. విరాట్ కోహ్లీకి ఈగో ఎక్కువని ఓ ఇంగ్లీష్​ క్రికెటర్ అన్నాడు.

ఇంగ్లండ్​తో టెస్ట్ సిరీస్​కు భారత్ రెడీ అవుతోంది. దీంతో ప్రత్యర్థి ప్లేయర్లు టీమిండియా క్రికెటర్లను టీజ్ చేయడం స్టార్ట్ చేశారు. విరాట్ కోహ్లీకి ఈగో ఎక్కువని ఓ ఇంగ్లీష్​ క్రికెటర్ అన్నాడు.

  • Published Jan 20, 2024 | 4:19 PMUpdated Jan 20, 2024 | 4:19 PM
Virat Kohli: కోహ్లీకి ఈగో ఎక్కువ.. మాకూ అదే కావాలి: ఇంగ్లండ్ క్రికెటర్

టీమిండియా మరో ఇంట్రెస్టింగ్​ సిరీస్​లో ఆడేందుకు సన్నద్ధమవుతోంది. ఇంగ్లండ్​తో స్వదేశంలో 5 టెస్టుల్లో తలపడేందుకు రెడీ అవుతోంది. ఈ సిరీస్​లోని తొలి టెస్ట్ హైదరాబాద్​లో ఈ నెల 25వ తేదీన మొదలుకానుంది. ఇవాళ భాగ్యనగరానికి చేరుకోనుంది రోహిత్ సేన. అయితే సిరీస్​కు ముందే ఇంగ్లీష్ టీమ్ ప్లేయర్లు తమ నోటికి పని చెప్పడం స్టార్ట్ చేసేశారు. మాటలతో భారత స్టార్ క్రికెటర్లను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తద్వారా గ్రౌండ్​లో తమ డామినేషన్ నడవాలనేది వాళ్ల ప్లాన్​గా కనిపిస్తోంది. మైండ్​ గేమ్​తో ఇండియాను ఇబ్బంది పెట్టాలనేది ఆ టీమ్ ఉద్దేశమని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇంగ్లండ్ పేసర్ ఓలీ రాబిన్సన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఈగో ఎక్కువని అన్నాడు.

ఎప్పుడూ బెస్ట్ బ్యాటర్లకు బౌలింగ్ చేయాలని తాను అనుకుంటానని రాబిన్సన్ తెలిపాడు. ‘నేనెప్పుడూ బెస్ట్ బ్యాటర్లతో తలపడాలని అనుకుంటా. వాళ్లను ఔట్ చేస్తే అదో కిక్. అలాంటి బ్యాట్స్​మెన్​లో విరాట్ ఒకడు. అతడికి ఈగో ఎక్కువ. ఇప్పుడు స్వదేశంలో ఆడుతున్నాడు కాబట్టి మమ్మల్ని డామినేట్ చేసేందుకు అతడు ప్రయత్నిస్తాడు. కచ్చితంగా భారీ స్కోర్లు బాదాలని అనుకుంటాడు. మా మధ్య గతంలో గొడవలు ఉన్నాయి. అందుకే ఈ సిరీస్ ఎంతో ఆసక్తిని రేపుతోంది’ అని రాబిన్సన్ చెప్పుకొచ్చాడు. కోహ్లీకి ఈగో ఎక్కువని.. అయితే తమకూ అదే కావాలన్నాడు. 2021లో ఇంగ్లండ్​లో టీమిండియా పర్యటించినప్పుడు రాబిన్సన్, కోహ్లీ మధ్య గొడవ జరిగింది. రాబిన్సన్​ను గ్రౌండ్​లో ఓ ఆటాడుకున్నాడు విరాట్. అతడ్ని రెచ్చగొడుతూ స్లెడ్జింగ్ చేశాడు. దాని గురించి తాజాగా అతడు రియాక్ట్ అయ్యాడు.

లార్డ్స్ టెస్ట్​లో ఏం జరిగిందో తనకు సరిగ్గా గుర్తులేదన్నాడు రాబిన్సన్. మహ్మద్ సిరాజ్ వేసిన బాల్ తన ఛాతీకి తగిలిందని.. అప్పుడు కోహ్లీతో పాటు భారత క్రికెటర్లు అందరూ తనను చుట్టుముట్టారని పేర్కొన్నాడు. అయితే ఆ టైమ్​లో విరాట్ తనతో ఏమన్నాడో మర్చిపోయానన్నాడు. ఈ సందర్భంగా టీమిండియా వెటరన్ పేసర్ షమీపై ప్రశంసల జల్లులు కురిపించాడు రాబిన్సన్. అతడు సంధించే సీమింగ్ డెలివరీస్​ను తానూ ప్రాక్టీస్ చేస్తున్నానని తెలిపాడు. భారత్​కు ఆడిన వారిలో బెస్ట్ బౌలర్లలో అతడూ ఒకడన్నాడు. షమీతో పాటు ఇషాంత్ శర్మ కూడా సూపర్బ్ బౌలర్ అని మెచ్చుకున్నాడు. అయితే రాబిన్సన్ కామెంట్స్ మీద టీమిండియా ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. కోహ్లీ ఈగో ఏంటనేది ఈ సిరీస్​లో రాబిన్సన్ మరోమారు రుచి చూస్తాడని వార్నింగ్ ఇస్తున్నారు. మరి.. విరాట్​కు ఈగో ఎక్కువంటూ ఇంగ్లండ్ క్రికెటర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.