Nidhan
సిసలైన పోరుకు సిద్ధమైంది టీమిండియా. పొట్టి కప్పు సెమీస్‌లో ఇంగ్లండ్‌తో తాడోపేడో తేల్చుకోనుంది రోహిత్ సేన. ఈ రెండు జట్ల మధ్య ఇవాళ సాయంత్రం నాకౌట్ ఫైట్ జరగనుంది.
సిసలైన పోరుకు సిద్ధమైంది టీమిండియా. పొట్టి కప్పు సెమీస్‌లో ఇంగ్లండ్‌తో తాడోపేడో తేల్చుకోనుంది రోహిత్ సేన. ఈ రెండు జట్ల మధ్య ఇవాళ సాయంత్రం నాకౌట్ ఫైట్ జరగనుంది.
Nidhan
సిసలైన పోరుకు సిద్ధమైంది టీమిండియా. పొట్టి కప్పు సెమీస్‌లో ఇంగ్లండ్‌తో తాడోపేడో తేల్చుకోనుంది రోహిత్ సేన. ఈ రెండు జట్ల మధ్య ఇవాళ సాయంత్రం నాకౌట్ ఫైట్ జరగనుంది. ఇప్పటికే మొదటి సెమీస్ ముగిసింది. ఇందులో సౌతాఫ్రికా-ఆఫ్ఘానిస్థాన్ తలపడ్డాయి. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ను ఓడించి ఫుల్ జోష్‌లో ఉన్న రషీద్ సేన ప్రొటీస్‌ను కూడా కంగుతినిపిస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఈ మ్యాచ్ వన్‌సైడ్ అయిపోయింది. ఆఫ్ఘాన్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది సౌతాఫ్రికా. ఆ టీమ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇప్పటికే ఒక బెర్త్ కన్ఫర్మ్ కావడంతో మరో ఫైనల్ బెర్త్ కోసం టీమిండియా-ఇంగ్లండ్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌కు చేరుకోవాలని ఇరు జట్లు డిసైడ్ అయ్యాయి. దీంతో ఆఖరి బంతి వరకు మ్యాచ్ నువ్వానేనా అంటూ సాగడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇంగ్లండ్‌ను ఓడించేందుకు అవసరమైన అన్ని ప్లాన్స్‌ను రెడీ చేస్తోంది భారత్. ఆ జట్టు ఆయువుపట్టు అయిన బ్యాటింగ్ యూనిట్‌ను దెబ్బ తీసేందుకు బుమ్రా ఆధ్వర్యంలోని బౌలింగ్ దళాన్ని సంసిద్ధం చేస్తోంది. అలాగే మన బ్యాటింగ్‌తో వాళ్ల బౌలర్లను చావబాదాలని భావిస్తోంది. అందుకు తగ్గట్లు రోహిత్ శర్మ నేతృత్వంలోని బ్యాటింగ్ యూనిట్‌ను రెడీ చేస్తోంది. ఆస్ట్రేలియా మీద 41 బంతుల్లో 92 పరుగులు చేసిన హిట్‌మ్యాన్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. అతడికి తోడు రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబె కూడా మంచి టచ్‌లో ఉండటంతో టీమిండియాకు ఢోకా లేదని చెప్పొచ్చు. అయితే ఇంత మంది టాప్ ప్లేయర్లు ఉన్నా టీమ్ మేనేజ్మెంట్ మాత్రం విరాట్ కోహ్లీ మీదే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. అతడు రాణిస్తే జట్టుకు తిరుగుండదు.. ఇంగ్లీష్ టీమ్‌పై ప్రతీకారం తీరడంతో పాటు ఫైనల్ బెర్త్ కూడా దక్కుతుందని అనుకుంటోంది.
కోహ్లీ ఎలాగైనా ఫామ్‌ను అందుకోవాలని.. ఇంగ్లండ్‌ను ఇరగదీయాలని అటు అభిమానులతో పాటు ఇటు టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది. విరాట్ సరిగ్గా ఆడకపోయినా ఇంతవరకు జట్టుకు ఎదురులేకుండా పోయింది. రోహిత్‌తో పాటు ఇతర బ్యాటర్లు, బౌలింగ్ దళం రాణించడంతో టీమ్ డబుల్ హ్యాట్రిక్ విక్టరీస్ కొట్టింది. అయితే వీళ్లందర్నీ కాదని సెమీస్‌లో కోహ్లీ మీదే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది మేనేజ్మెంట్. దీనికి కారణం అతడి రికార్డులే. టీ20 వరల్డ్ కప్స్ హిస్టరీలో నాకౌట్ మ్యాచుల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు విరాట్ పేరు మీదే ఉంది. ఈ రికార్డు అతడ్ని పరుగులు చేసేలా రెచ్చగొడుతోంది. ఇప్పటిదాకా పొట్టి కప్పులో 4 నాకౌట్ మ్యాచుల్లో కలిపి 288 పరుగులు చేశాడు కింగ్. టీ20 ప్రపంచ కప్-2016లో వెస్టిండీస్ మీద 47 బంతుల్లో 89 నాటౌట్ బెస్ట్ స్కోర్‌గా ఉంది. సెమీస్ పోరులో 4 హాఫ్ సెంచరీలు బాదాడు. అతడి స్ట్రైక్ రేట్ 152గా ఉంది. బిగ్ మ్యాచెస్‌లో శివాలెత్తే కోహ్లీ ఇవాళ గనుక ఇంగ్లండ్‌పై చెలరేగితే భారత్‌కు తిరుగుండదు. మరి.. సెమీస్‌లో విరాట్ బ్యాట్ గర్జిస్తుందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.
VIRAT KOHLI HAS MOST RUNS IN T20 WORLD CUP KNOCKOUTS IN THE HISTORY. 🐐
– The whole India wants The GOAT to deliver again today…!!!! 🇮🇳 pic.twitter.com/pmkXFlJaS8
— Tanuj Singh (@ImTanujSingh) June 27, 2024