iDreamPost
android-app
ios-app

Virat Kohli: కోహ్లీ ఈగోతో ఆడుకుంటాం.. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ వార్నింగ్!

  • Published Jan 20, 2024 | 9:39 PM Updated Updated Jan 20, 2024 | 9:39 PM

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈగోతో తాము ఆడుకుంటామని ఓ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ అన్నాడు. త్వరలో ప్రారంభం కానున్న 5 టెస్టుల సిరీస్​లో కోహ్లీ ఈగోను మరింత రెచ్చగొడతామని చెప్పాడు.

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈగోతో తాము ఆడుకుంటామని ఓ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ అన్నాడు. త్వరలో ప్రారంభం కానున్న 5 టెస్టుల సిరీస్​లో కోహ్లీ ఈగోను మరింత రెచ్చగొడతామని చెప్పాడు.

  • Published Jan 20, 2024 | 9:39 PMUpdated Jan 20, 2024 | 9:39 PM
Virat Kohli: కోహ్లీ ఈగోతో ఆడుకుంటాం.. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ వార్నింగ్!

క్రికెట్​లో స్లెడ్జింగ్ సర్వసాధారణమే. ముఖ్యంగా టెస్టు మ్యాచుల్లో దీన్ని ఎక్కువగా చూడొచ్చు. బ్యాటర్లను రెచ్చగొడుతూ ఔట్ చేసేందుకు ప్రయత్నించడం చాలా మ్యాచుల్లో చూశాం. ఆస్ట్రేలియా టీమ్ ఇందులో ఆరితేరింది. ప్రత్యర్థి జట్ల బ్యాటర్లు క్రీజులోకి వచ్చినప్పుడు వారిని మాటలతో కవ్వించడం, రెచ్చగొట్టడం కంగారూలకు వెన్నతో పెట్టిన విద్య. ఇది వారికి ఆనవాయితీగా మారింది. ఆసీస్​తో పాటు మరికొన్ని జట్లు కూడా స్లెడ్జింగ్​ను అలవాటు చేసుకున్నాయి. అయితే స్లెడ్జింగ్​కు కొందరు మాటలతో సమాధానం చెబితే మరికొందరు బ్యాట్​తోనే స్ట్రాంగ్ రిప్లయ్ ఇస్తారు. కానీ భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాత్రం కాస్త డిఫరెంట్. అతడు బ్యాట్​తోనే కాదు మాటలతోనూ గట్టిగా జవాబిస్తాడు. అందుకే అతడ్ని స్లెడ్జ్ చేసేందుకు అందరూ భయపడతారు. కానీ ఓ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మాత్రం కోహ్లీని రెచ్చగొట్టాలని అంటున్నాడు.

భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్​కు అంతా రెడీ అయింది. జనవరి 25న ఉప్పల్​లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే తొలి టెస్ట్​తో సిరీస్ స్టార్ట్ కానుంది. దీంతో ఇంగ్లండ్ క్రికెటర్లు టీమిండియాను టార్గెట్ చేసుకుంటున్నారు. సిరీస్​ మొదలయ్యేందుకు ముందే మన జట్టులోని టాప్ స్టార్స్​ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీకి ఈగో ఎక్కువని.. అతడి ఈగోతో ఆడుకోవాలని ఇంగ్లీష్ టీమ్​కు సూచించాడు. విరాట్​ను స్లెడ్జ్ చేయాలన్నాడు. ‘కోహ్లీ ఈగోతో ఆడుకోండి. అతడ్ని స్లెడ్జ్ చేయండి. ఇంటర్నేషనల్ క్రికెట్​లో భారత్​ మీద ఉన్న చోకర్స్ అనే ముద్రను అతడికి గుర్తు చేయండి. గత దశాబ్ద కాలంలో టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా నెగ్గలేదని అతడికి చెప్పండి’ అని పనేసార్ సూచించాడు.

భారత్​ను చోకర్స్​గా వ్యాఖ్యానించిన పనేసార్.. ఇంగ్లండ్ ఐసీసీ ట్రోఫీలు నెగ్గిన విషయాన్ని గుర్తుచేశాడు. బెన్ స్టోక్స్ 2019 వన్డే వరల్డ్ కప్, 2022 టీ20 ప్రపంచ కప్ విన్నర్ అని తెలిపాడు. కోహ్లీకి ఈ విషయాన్ని చెప్పాలని.. అది అతడ్ని మానసికంగా ఇబ్బందికి గురి చేస్తుందన్నాడు పనేసార్. ఈ సిరీస్​లో విరాట్​ను జేమ్స్ అండర్సన్ ఔట్ చేస్తాడని పేర్కొన్నాడు. అండర్సన్ రివర్స్ స్వింగ్ వలలో పడి భారత బ్యాటర్లు చిత్తవడం ఖాయమని వివరించాడు. అయితే పనేసార్ వ్యాఖ్యలపై టీమిండియా అభిమానులు సీరియస్ అవుతున్నారు. భారత్​ను తక్కువ అంచనా వేయొద్దని అంటున్నారు. కోహ్లీని రెచ్చగొడితే అపోజిషన్ టీమ్​కే ప్రమాదమని.. దీనికి ఇంగ్లండ్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు. విరాట్​ను గెలికితే అతడు మాటలతోనే కాదు బ్యాట్​తోనూ పరుగులు వర్షం కురిపిస్తాడని.. ఆ జడివానలో ఇంగ్లీష్ టీమ్ మునగక తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు. మరి.. కోహ్లీ ఈగోతో ఆడుకుంటామంటూ పనేసార్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.