iDreamPost
android-app
ios-app

IND vs ENG: మూడో టెస్టుకు ముందు ఇంగ్లండ్​కు భారీ షాక్.. ఇక ఆశలు వదులుకోవాల్సిందే!

  • Published Feb 11, 2024 | 4:47 PM Updated Updated Feb 11, 2024 | 4:47 PM

వైజాగ్ టెస్టులో ఓడిపోయిన బాధలో ఉన్న ఇంగ్లండ్​ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఇక ఆ టీమ్ సిరీస్​పై ఆశలు వదులుకోవాల్సిందే.

వైజాగ్ టెస్టులో ఓడిపోయిన బాధలో ఉన్న ఇంగ్లండ్​ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఇక ఆ టీమ్ సిరీస్​పై ఆశలు వదులుకోవాల్సిందే.

  • Published Feb 11, 2024 | 4:47 PMUpdated Feb 11, 2024 | 4:47 PM
IND vs ENG: మూడో టెస్టుకు ముందు ఇంగ్లండ్​కు భారీ షాక్.. ఇక ఆశలు వదులుకోవాల్సిందే!

బజ్​బాల్​తో దెబ్బతీస్తామంటూ భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్​.. తొలి టెస్టులో సక్సెస్ అయింది. ఉప్పల్ ఆతిథ్యం ఇచ్చిన మొదటి మ్యాచ్​లో విక్టరీ కొట్టింది. ధనాధన్ క్రికెట్​తో రోహిత్ సేనను ఉక్కిరిబిక్కరి చేసింది. దీంతో టీమిండియా పనైపోయిందని అంతా అనుకున్నారు. భారత్ కోలుకోవడం కష్టమేనని, సిరీస్ సమర్పయామి అని కొందరు నెగెటివ్ కామెంట్స్ చేశారు. కానీ ఊహించినట్లే బౌన్స్ బ్యాక్ అయిన టీమిండియా రెండో టెస్టులో ఇంగ్లండ్​ను 106 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అనూహ్యంగా ఓటమి పాలవడంతో ఇంగ్లీష్ టీమ్ షాక్​కు గురైంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లోనూ తమను భారత్ చిత్తు చేయడంతో టెన్షన్ పడుతోంది. మిగతా మ్యాచుల్లో నెగ్గి సిరీస్​ను పట్టేయాలని చూస్తోంది. అయితే ఆ టీమ్​కు ఓ బ్యాడ్ న్యూస్.

రాజ్​కోట్​లో జరగబోయే మూడో టెస్టుకు ముందు ఇంగ్లండ్​కు భారీ షాక్ తగిలింది. ఆ టీమ్ సీనియర్ స్పిన్నర్ జాక్ లీచ్ సిరీస్​లోని మిగిలిన మ్యాచులకు దూరమయ్యాడు. మోకాలు గాయంతో ఇబ్బంది పడుతున్న లీచ్​.. సిరీస్​ నుంచి వైదొలిగాడు. ఇంజ్యురీ ఇంకా మానకపోవడంతో అతడ్ని వెనక్కి పంపాలని ఇంగ్లండ్ మేనేజ్​మెంట్ డిసైడ్ అయింది. భారత్​తో సిరీస్​లో మిగిలిన మ్యాచుల్లో లీచ్ ఆడబోడంటూ ఇంగ్లీష్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటన చేసింది. ఎడమ మోకాలికి అయిన గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో అతడ్ని సిరీస్ నుంచి తప్పించామని తెలిపింది. దీంతో ప్రస్తుతం అబుదాబిలో ఉన్న లీచ్ అక్కడి నుంచి ఇంగ్లండ్​కు బయల్దేరి వెళ్లనున్నాడు.

లీచ్ ప్లేసులో మరో ప్లేయర్​ను జట్టులోకి తీసుకోబోవడం లేదని ఇంగ్లండ్ బోర్డు స్పష్టం చేసింది. ఉన్న టీమ్​తోనే మిగిలిన సిరీస్​ను కంటిన్యూ చేస్తామని తెలిపింది. దీంతో ఇంగ్లండ్ పనైపోయిందని.. సిరీస్​పై ఆ జట్టు ఆశలు వదులుకోవాలని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, గాయంతో ఇబ్బంది పడుతున్న లీచ్ స్వదేశానికి పయనమైన తర్వాత ఇంగ్లండ్ జట్టు భారత్​కు తిరిగి రానుంది. రాజ్​కోట్​ టెస్టుకు ముందు భారీ గ్యాప్ దొరకడంతో రెస్ట్ తీసుకునేందుకు అబుదాబికి వెళ్లింది ఇంగ్లీష్ టీమ్. సోమవారం నాడు ఆ జట్టు ఇండియాకు తిరిగి రానుంది. రాజ్​కోట్ టెస్టుకు సంబంధించిన ప్రిపరేషన్స్​ను గురువారం నాడు స్టార్ట్ చేయనుంది ఇంగ్లండ్. అందుకోసం మూడో టెస్టుకు వేదిక అయిన నిరంజన్ షా స్టేడియాన్నే వాడుకోనున్నారు. ఇక, ఎప్పటిలాగే మ్యాచ్ ముందు రోజే ఫైనల్ ఎలెవన్​ను ప్రకటించనుంది ఇంగ్లండ్. మరి.. జాక్ లీచ్ రూపంలో ఇంగ్లండ్​కు బిగ్ షాక్ తగలడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Glenn Maxwell: వీడియో: మ్యాక్స్​వెల్ మెరుపు సెంచరీ.. ఈ సిక్స్ మెయిన్ హైలైట్!