Nidhan
ఉప్పల్ టెస్టులో ఓటమిపాలైన టీమిండియా దీనికి రివేంజ్ తీర్చుకోవాలని చూస్తోంది. అందుకోసం వైజాగ్ ఆతిథ్యం ఇస్తున్న రెండో మ్యాచ్‌లో స్పెషల్ ప్లాన్‌తో బరిలోకి దిగనుందని తెలుస్తోంది. అయితే ఆ గేమ్ ప్లాన్‌తో వెళ్తే రోహిత్ సేనకు ఓటమి తప్పదని ఓ మాజీ క్రికెటర్ హెచ్చరించాడు.
ఉప్పల్ టెస్టులో ఓటమిపాలైన టీమిండియా దీనికి రివేంజ్ తీర్చుకోవాలని చూస్తోంది. అందుకోసం వైజాగ్ ఆతిథ్యం ఇస్తున్న రెండో మ్యాచ్‌లో స్పెషల్ ప్లాన్‌తో బరిలోకి దిగనుందని తెలుస్తోంది. అయితే ఆ గేమ్ ప్లాన్‌తో వెళ్తే రోహిత్ సేనకు ఓటమి తప్పదని ఓ మాజీ క్రికెటర్ హెచ్చరించాడు.
Nidhan
వన్డేలు, టీ20ల్లో డామినేట్ చేస్తున్న టీమిండియా.. టెస్టుల్లోనూ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. అయితే లాంగ్ ఫార్మాట్లో బ్యాటింగ్‌లో చాలా ఇబ్బంది పడుతోంది. అనుభవజ్ఞులైన ఛటేశ్వర్ పుజారా, అజింక్యా రహానె ఫామ్ కోల్పోవడంతో వారిని సెలక్టర్లు పక్కన పెట్టారు. దీంతో బ్యాటింగ్ భారం మొత్తం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మీదే పడింది. వీళ్లు రాణిస్తే ఓకే.. కానీ ఫెయిలైతే మాత్రం టీమ్ తక్కువ స్కోరుకే కుప్పకూలుతోంది. చాలా మ్యాచుల్లో టాపార్డర్ కంటే లోయరార్డర్ కాంట్రిబ్యూషనే ఎక్కువగా ఉంటోంది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ లాంటి స్పిన్ ఆల్‌రౌండర్లు పోరాడుతుండటంతో టీమిండియా గట్టెక్కుతోంది. టర్నింగ్ ట్రాకులపై ఆడటం మన బలం అనుకుంటే.. శ్రేయస్ అయ్యర్ తప్ప స్పిన్‌లో బాగా ఆడే బ్యాటరే టీమ్‌లో లేడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో ఇది తేలిపోయింది. అయితే రెండో టెస్టులో స్పిన్ వికెట్‌ను భారత్ తయారు చేయిస్తోందని వినికిడి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా రోహిత్ సేనను హెచ్చరించాడు.
ఉప్పల్ టెస్టులో పిచ్ నుంచి స్పిన్నర్లతో పాటు పేసర్లకు మద్దతు దొరికింది. బాల్ టర్న్ అవడంతో పాటు బౌన్స్, రివర్స్ స్వింగ్ కూడా అయింది. మొదటి రెండున్నర రోజులు బ్యాటింగ్‌కు కూడా అనుకూలంగా ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో ఓడిపోవడంతో రెండో టెస్టు కోసం టీమిండియా కొత్త ప్లాన్‌ను వేస్తోందని టాక్. వైజాగ్ పిచ్‌ను పూర్తిగా స్పిన్ ఫ్రెండ్లీ వికెట్‌గా తయారు చేస్తున్నారని క్రికెట్ వర్గాల సమాచారం. ఇంగ్లండ్‌ను స్పిన్ వలలో పడేసి గెలవాలని భారత్ అనుకుంటోందని వినికిడి. కానీ ఇది రోహిత్ సేనకు రివర్స్‌గా మారే ప్రమాదం ఉందని ఆకాశ్ చోప్రా వార్నింగ్ ఇచ్చాడు. ‘టర్నింగ్ వికెట్లు కావాలంటూ బాగా ఎగ్జయిట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారత బ్యాటర్లు ఎవరూ ఫామ్‌లో లేరు. బ్యాట్స్‌మెన్ ఫామ్‌లో లేనప్పుడు ఇరు జట్ల స్పిన్నర్లు అంతే ప్రమాదకరంగా మారతారు’ అని చోప్రా చెప్పుకొచ్చాడు.
టర్నింగ్ ట్రాక్‌లో భారత స్పిన్నర్లతో పాటు ఇంగ్లండ్ స్పిన్నర్లు కూడా అంతే ప్రభావవంతంగా బౌలింగ్ చేస్తారని ఆకాశ్ చోప్రా తెలిపాడు. ఇంగ్లీష్ స్పిన్నర్లు అంత యాక్యురేట్‌గా బౌలింగ్ చేయకపోయినా అది అంత ముఖ్యం కాదని.. వికెట్లు పడటమే కీలకమన్నాడు. ఒకవేళ టర్నింగ్ ట్రాక్స్ తయారు చేస్తే మాత్రం టామ్ హార్ట్లీ గ్రేట్ బిషన్ సింగ్ బేడీలా బౌలింగ్ చేస్తాడని.. జో రూట్ లంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌లా బాల్‌ను గింగిరాలు తిప్పుతాడని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ బ్యాటర్లను ఔట్ చేయాలంటే బ్యాటింగ్ ట్రాక్ రూపొదించడమే కరెక్ట్ అన్నాడు ఆకాశ్. చైనామన్ కుల్దీప్ను ఆడిస్తే ఇంగ్లీష్ టీమ్‌ను తిప్పేస్తాడని సూచించాడు. అయితే భారత టీమ్ మేనేజ్మెంట్ ఏం ఆలోచిస్తోందో తనకు తెలియదన్నాడు. కానీ స్పిన్ పిచ్‌ను తయారు చేస్తే మాత్రం గెలుపు కాదు.. ఓటమి తథ్యమన్నాడు. మరి.. రెండో టెస్టులో నెగ్గాలంటే స్పిన్ ట్రాక్ కరెక్టా? లేదా బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెటా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Aakash Chopra in his Youtube Channel, “Don’t get overexcited that ‘we need turning pitches’ because your (India) batters are not in form. When batters are not in form, your spinners and their [England] spinners will be equally effective.“
📷 Associated Press pic.twitter.com/eaKIOHCYa5
— CricketGully (@thecricketgully) January 31, 2024