Shubman Gill: వీడియో: మళ్లీ అలాగే ఔటైన గిల్.. ఇలాగైతే టీమ్​లో ప్లేస్ కష్టమే!

టీమిండియా స్టార్ బ్యాటర్ శుబ్​మన్ గిల్ మరోమారు అభిమానుల్ని నిరాశపర్చాడు. అతడు ఔటైన తీరుపై భారీగా విమర్శలు వస్తున్నాయి.

టీమిండియా స్టార్ బ్యాటర్ శుబ్​మన్ గిల్ మరోమారు అభిమానుల్ని నిరాశపర్చాడు. అతడు ఔటైన తీరుపై భారీగా విమర్శలు వస్తున్నాయి.

రాజ్​కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్​కు సరైన స్టార్ట్ దొరకలేదు. ఈ మ్యాచ్​లో టాస్ నెగ్గిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఆరంభంలోనే మన టీమ్​కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (10) త్వరగా పెవిలియన్ చేరాడు. మార్క్ వుడ్ గుడ్​ లెంగ్త్​లో వేసిన బాల్ పడి అనూహ్యంగా బౌన్స్ అయింది. దీంతో దాన్ని అతడు సరిగ్గా డిఫెండ్ చేయలేకపోయాడు. బాల్ అతడి బ్యాట్ ఎడ్జ్​ను తీసుకొని స్లిప్​లోకి దూసుకెళ్లింది. దాన్ని జో రూట్ చక్కగా అందుకున్నాడు. ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన స్టార్ బ్యాటర్ శుబ్​మన్ గిల్ (0) మరోసారి నిరాశపర్చాడు. అతడు గోల్డెన్ డక్​గా వెనుదిరిగాడు. ఈ రైట్ హ్యాండ్​ బ్యాటర్​ను కూడా వుడ్ ఔట్ చేశాడు. అయితే అతడు ఔట్ అయిన తీరుపై భారీగా విమర్శలు వస్తున్నాయి.

గిల్ ఈ సిరీస్​లోని తొలి రెండు టెస్టుల్లోనూ ఇలాగే ఔట్ అయ్యాడు. ఆఫ్ స్టంప్​ను టార్గెట్ చేసుకొని వుడ్ గుడ్ లెంగ్త్​లో వేసిన బాల్​ను డిఫెన్స్ చేసేందుకు ప్రయత్నించి వికెట్ పారేసుకున్నాడు గిల్. ఆ బాల్ అతడి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని కీపర్ బెన్ ఫోక్స్ చేతుల్లోకి వెళ్లింది. ఫోక్స్ క్యాచ్ పట్టుకోవడంతో గిల్ నిరాశగా క్రీజును వీడాడు. అయితే గిల్ ఇలా ఆఫ్ స్టంప్​ లైన్​లో పడిన బంతుల్ని డిఫెండ్ చేయబోయి ఔటవడం ఇదే తొలిసారి కాదు. ఆ బంతుల్ని ఎదుర్కొనే వీక్​నెస్ చాలా రోజుల నుంచి ఉంది. టెస్టులతో పాటు వన్డేలు, టీ20ల్లోనూ ఇదే బలహీనతతో చాలా సార్లు ఔటయ్యాడు. ఇంగ్లండ్​తో సిరీస్​లోని తొలి రెండు టెస్టుల్లో కూడా ఇదే విధంగా ఔటయ్యాడు.

ఆఫ్ స్టంప్​ లైన్​లో పడి ఔట్ స్వింగ్ అయ్యే డెలివరీస్​ను ఆడటంలో గిల్​కు ఉన్న వీక్​నెస్​ను ఇంగ్లండ్ పేసర్లు టార్గెట్ చేస్తున్నారు. జేమ్స్ అండర్సన్ దీన్ని ఉపయోగించుకొని వైజాగ్ టెస్టులో అతడ్ని దెబ్బ కొట్టాడు. మూడో టెస్టులో మార్క్ వుడ్ దీన్ని యూజ్ చేసుకున్నాడు. క్వాలిటీ పేస్​తో ఆఫ్ స్టంప్ ఆవల బాల్ వేసి గిల్​ను తన వలలో చిక్కుకునేలా చేశాడు. దీంతో శుబ్​మన్​ను సోషల్ మీడియాలో నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఒకే విధంగా ఇంకెన్ని సార్లు ఔట్ అవుతావని.. ఇన్నాళ్ల నుంచి ఆడుతున్నా తన బలహీనతను సరిదిద్దుకోకపోవడం ఏంటంటూ సీరియస్ అవుతున్నారు. ఇలాగైతే జట్టులో చోటు కష్టమేనని.. అతడి ప్లేసులో మరో యంగ్​స్టర్​కు ఛాన్స్ ఇవ్వాలని కామెంట్స్ చేస్తున్నారు. ఇన్ని అవకాశాలు ఇచ్చినా గిల్ తన గేమ్​ను ఇంప్రూవ్ చేసుకోవడం లేదని ఫైర్ అవుతున్నారు. మరి.. శుబ్​మన్ గిల్ మళ్లీ అలాగే ఔట్ అవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Sarfaraz Khan: సర్ఫరాజ్​ డెబ్యూతో తండ్రి ఎమోషనల్.. సంతోషంతో కన్నీళ్లు ఆపుకోలేక..!

Show comments