IND vs ENG: సర్ఫరాజ్​కు మళ్లీ అన్యాయం! ఇంకేం సాధిస్తే ఛాన్స్ ఇస్తారు?

వైజాగ్ వేదికగా భారత్-ఇంగ్లండ్​ మధ్య సెకండ్ టెస్ట్ షురూ అయింది. అయితే యంగ్ క్రికెటర్ సర్ఫరాజ్​ ఖాన్​కు మళ్లీ అన్యాయం జరిగింది.

వైజాగ్ వేదికగా భారత్-ఇంగ్లండ్​ మధ్య సెకండ్ టెస్ట్ షురూ అయింది. అయితే యంగ్ క్రికెటర్ సర్ఫరాజ్​ ఖాన్​కు మళ్లీ అన్యాయం జరిగింది.

టీమిండియా-ఇంగ్లండ్ మధ్య సెకండ్ టెస్ట్ షురూ అయింది. విశాఖపట్నం ఆతిథ్యం ఇస్తున్న ఈ మ్యాచ్​లో టాస్ నెగ్గిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. యశస్వి జైస్వాల్​ (39 నాటౌట్​)తో కలసి రోహిత్ (14) ఇన్నింగ్స్​ను స్టార్ట్ చేశాడు. ఉప్పల్ మాదిరిగా వైజాగ్ పిచ్ నుంచి స్పిన్నర్లకు టర్న్, బౌన్స్ దొరకలేదు. పేసర్లకు వికెట్ నుంచి కాస్త మద్దతు లభించింది. ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. దీంతో రోహిత్, జైస్వాల్ జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు. ఒకవైపు జైస్వాల్ స్ట్రయిక్ రొటేషన్ చేస్తూనే.. కుదిరినప్పుడు బౌండరీలు కూడా బాదాడు. కానీ హిట్​మ్యాన్ మాత్రం డిఫెన్స్​కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఈ క్రమంలో 20 ఏళ్ల అరంగేట్ర బౌలర్ షోయబ్ బషీర్​కు దొరికిపోయాడు. ప్రస్తుతం జైస్వాల్​తో పాటు శుబ్​మన్ గిల్ (17 నాటౌట్) క్రీజులో ఉన్నారు. అయితే యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్​కు మళ్లీ అన్యాయం జరిగింది. రెండో టెస్టులో అతడికి ఆడే అవకాశం రాలేదు.

మొదటి టెస్టులో గాయపడిన స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ రెండో మ్యాచుకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే అతడి ప్లేసులో జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్​ను వైజాగ్ టెస్టులో ఆడించడం ఖాయమని అంతా అనుకున్నారు. డొమెస్టిక్ క్రికెట్​లో గత కొన్నేళ్లుగా పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్.. రీసెంట్​గా కూడా సెంచరీ బాది సూపర్​ ఫామ్​లో ఉన్నాడు. దీంతో అతడ్ని టీమ్​లోకి తీసుకోవడం పక్కా అని అంతా భావించారు. సర్ఫరాజ్ డెబ్యూలో ఎలా ఆడతాడోనని అందరూ అనుకుంటున్న టైమ్​లో టీమ్ మేనేజ్​మెంట్ అనూహ్యంగా షాక్ ఇచ్చింది. రెండో టెస్టు ప్లేయింగ్ ఎలెవన్​లో సర్ఫరాజ్​కు మొండిచేయి చూపింది. అతడికి బదులు రజత్ పాటిదార్​ను తుదిజట్టులోకి తీసుకుంది. దీంతో అభిమానులు షాకవుతున్నారు. సర్ఫరాజ్​ను ఎందుకు టీమ్​లోకి తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు.

ఫస్ట్​క్లాస్ క్రికెట్​లో దాదాపు 4 వేల పరుగులు చేసిన సర్ఫరాజ్.. 14 సెంచరీలతో పాటు 11 హాఫ్​ సెంచరీలు బాదాడు. అతడి హయ్యెస్ట్ స్కోర్ 301 నాటౌట్. ఇంత బాగా ఆడుతున్నా, సూపర్బ్ ఫామ్​లో ఉన్నా, డొమెస్టిక్ క్రికెట్​లో మంచి ఎక్స్​పీరియెన్స్ ఉన్నా అతడ్ని ఎందుకు ఆడించట్లేదో చెప్పాలని సోషల్ మీడియాలో నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. సర్ఫరాజ్​కు ఏం తక్కువని.. అతడు ఇంకా ఏం సాధిస్తే ఛాన్స్ ఇస్తారో చెప్పాలని నిలదీస్తున్నారు. రజత్ పాటిదార్ కంటే సర్ఫరాజ్ ఎందులో తక్కువని నెటిజన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. ఇంత టాలెంట్ ఉన్న ఆటగాడి కెరీర్​తో ఇలా ఆడుకోవడం సరికాదని సీరియస్ అవుతున్నారు. ఇక, ఈ మ్యాచ్​లో రవీంద్ర జడేజా ప్లేసులో కుల్దీప్ యాదవ్​ను, మహ్మద్ సిరాజ్ స్థానంలో ముకేష్ కుమార్​ను తుదిజట్టులోకి తీసుకుంది టీమిండియా మేనేజ్​మెంట్. మరి.. సర్ఫరాజ్​ను భారత్ ఆడించకపోవడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments