Nidhan
ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ లేకపోవడం, బజ్‌బాల్ క్రికెట్‌పై తనదైన శైలిలో రియాక్ట్ అయ్యాడు హిట్‌మ్యాన్.
ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ లేకపోవడం, బజ్‌బాల్ క్రికెట్‌పై తనదైన శైలిలో రియాక్ట్ అయ్యాడు హిట్‌మ్యాన్.
Nidhan
ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు సిద్ధమవుతున్న భారత జట్టు ముందు కొన్ని సవాళ్లు ఉన్నాయి. వాటిని సరిగ్గా ఎదుర్కొంటేనే విజయం మన టీమ్ సొంతం అవుతుంది. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన ఛాలెంజ్ విరాట్ కోహ్లీ లేకపోవడం. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచులకు ప్రకటించిన జట్టులో కోహ్లీ ఉన్నాడు. ఉప్పల్ టెస్ట్‌లో ఆడేందుకు హైదరాబాద్‌కు అందరికంటే ముందే చేరుకున్నాడు. కానీ వ్యక్తిగత కారణాల వల్ల హఠాత్తుగా ముంబైకి పయనం అయ్యాడు. ఫ్యామిలీకి తన అవసరం ఉందని.. అందుకే మొదటి రెండు మ్యాచుల్లో ఆడలేనని కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ ద్రవిడ్‌కు చెప్పేశాడు. దీంతో కోహ్లీ లేకుండానే ఇంగ్లండ్‌తో సమరానికి సిద్ధమవుతోంది భారత్. మన టీమ్‌కు బజ్‌బాల్ రూపంలో ఇంగ్లండ్ మరో సవాల్‌ను విసురుతోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు విషయాలపై కెప్టెన్ రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. బజ్‌బాల్ గురించి పట్టించుకోమంటూ ఇంగ్లీష్ టీమ్‌కు వార్నింగ్ ఇచ్చాడు హిట్‌మ్యాన్.
కోహ్లీ అందుబాటులో లేకపోవడం, బజ్‌బాల్ ఫార్ములాను ఇంగ్లండ్ ప్రయోగించనుందనే అంశాలపై తొలి టెస్టుకు ముందు రోహిత్ స్పందించాడు. బజ్‌బాల్ గురించి తాము పట్టించుకోట్లేదన్నాడు. తమ ఆట తాము ఆడతామంటూ పర్యాటక జట్టుకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ‘విరాట్ కోహ్లీ అందుబాటులో లేడు కాబట్టి ఎవరైనా ఎక్స్‌పీరియెన్స్ ప్లేయర్‌ను జట్టులోకి తీసుకుందామని అనుకున్నాం. కానీ అనుభవజ్ఞుల కంటే కోహ్లీ స్థానంలో యంగ్‌స్టర్స్‌లో ఒకరికి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని ఫిక్స్ అయ్యాం. తద్వారా విదేశీ పిచ్‌ల మీద డైరెక్ట్‌గా ఆడటం కంటే స్వదేశంలో ఆడుతూ వాళ్లకు మంచి ఎక్స్‌పీరియెన్స్ దొరుకుతుందని భావించాం. బజ్‌బాల్ గురించి మేం ఆలోచించట్లేదు. మా గేమ్ మేం ఆడతాం. ఒక జట్టుగా ఏం చేయాలనే దాని మీదే నేను ఫోకస్ చేస్తున్నా. అపోజిషన్ టీమ్ ఎలా ఆడుతుందనేది మాకు అనవసరం’ అని రోహిత్ స్పష్టం చేశాడు.
స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గురించి కూడా ప్రెస్మీట్లో రోహిత్ మాట్లాడాడు. అతడు స్పెషలిస్ట్ బ్యాటర్‌గానే బరిలోకి దిగుతాడని తెలిపాడు. కేఎస్ భరత్, ధృవ్ జురెల్ల్లో ఒకరికి వికెట్ కీపింగ్ బాధ్యతల్ని అప్పజెబుతామని చెప్పాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత రాహుల్ అలుపెరగకుండా క్రికెట్ ఆడుతున్నాడని.. అందుకే అతడి మీద వర్క్ లోడ్ తగ్గించాలనే ఉద్దేశంతోనే కీపింగ్ నుంచి రెస్ట్ ఇచ్చామన్నాడు. ఇక, ఉప్పల్ టెస్ట్‌కు ఇంగ్లండ్ యంగ్ స్పిన్నర్ షోయబ్ బాషిర్ దూరమయ్యాడు. వీసా ఇష్యూ వల్ల అతడు ఇంకా ఇండియాకు రాలేదు. ఈ విషయాన్ని జర్నలిస్టులు అడగ్గా.. రోహిత్ తనదైన రీతిలో రియాక్ట్ అయి నవ్వులు పూయించాడు. ‘అతడు (బషీర్) విషయంలో నేను బాధపడుతున్నా. మా జట్టు ఇంగ్లండ్‌కు వెళ్లినప్పుడు ఎవరైనా ఒక ప్లేయర్ ఇదే కారణం వల్ల అక్కడికి రాకపోతే బాధపడతాం. కానీ ఇందులో నేను చేసేదేమీ లేదు. వీసా ఆఫీసులో నేను కూర్చోను కదా!’ అని హిట్‌మ్యాన్ చెప్పాడు. దీంతో అక్కడున్న వారు నవ్వాపుకోలేకపోయారు. మరి.. ఇంగ్లండ్‌కు రోహిత్ స్వీట్ వార్నింగ్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
Rohit Sharma said “We thought of going back to an experienced player to fill Kohli’s absence but then when will we give the youngsters the chance as we don’t want them to be exposed directly in foreign countries”. [JioCinema] pic.twitter.com/PNHqugSHKZ
— Johns. (@CricCrazyJohns) January 24, 2024